మనం తినే కూరగాయలు మరియు పండ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. కొన్ని పండ్లలో మాత్రం ఇతర పండ్ల కన్నా ఎక్కువ శాతం పోషక విలువలు ఉంటాయి. కివీ ఫ్రూట్ చూడటానికి చిన్నగా గుడ్డు ఆకారంలో ఉన్నా, వీటిలో అద్భుతమైన న్యూట్రియంట్లు ఉంటాయి.
కివీ ఫ్రూట్ యొక్క 10 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం
Table of Contents
1. కివీ లో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి.
20 వ శతాబ్దానికి ముందు ఎవరికీ పెద్దగా కివీ ఫ్రూట్ ఉపయోగాలు తెలియవు కానీ 20 వ శతాబ్దం నుంచి కివీ దాదాపు అన్ని ప్రదేశాలలో లభించటం మొదలయ్యింది.
కివీ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆకుపచ్చ రంగులో మరియు రెండు బంగారం రంగు లో ఉంటుంది.
100 గ్రాముల కివీ లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి (1).
పేరు | మొత్తం |
శక్తి (Energy) | 61Cal |
Vitamin A | 87IU |
నీరు (Water) | 83.1g |
కార్బో హైడ్రేట్ (Carbohydrate) | 14.7g |
షుగర్ (Sugars) | 8.99g |
ఫ్రూక్టోజ్ (Fructose) | 4.35g |
గ్లూకోజ్ (Glucose) | 4.11g |
ఫైబర్ (Fiber) | 3g |
ప్రోటీన్ (Protein) | 1.14g |
కొవ్వు (fat) | 0.52g |
పొటాషియం (Potassium) | 312mg |
Vitamin C | 92.7mg |
కాల్షియం (Calcium) | 34mg |
ఫాస్ఫరస్ (Phosphorus) | 34mg |
మెగ్నీషియం (Magnesium) | 17mg |
కోలిన్ (Choline) | 7.8mg |
సోడియం (Sodium) | 3mg |
Vitamin E | 1.46mg |
బీటైన్ (Betaine) | 0.5mg |
నియాసిన్ (Niacin) | 0.341mg |
ఐరన్ (Iron) | 0.31mg |
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin) | 122µg |
కెరోటిన్ (Carotene) | 52µg |
Vitamin K | 40.3µg |
ఫోలేట్ (Folate) | 25µg |
Vitamin A | 4µg |
సెలీనియం (Selenium) | 0.2µg |
2. కివీ కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
పండ్లు మరియు కూరగాయలలో లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin) సమృద్ధిగా ఉంటాయి.
లుటిన్ మరియు జియాక్సంతిన్ మక్యూలర్ డిజెనరేషన్ అనే వయస్సు తో పాటు వచ్చే కంటికి సంబంధించిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. కివీ పండు లో కూడా లుటిన్ మరియు జియాక్సంతిన్ ఉంటాయి. ఫలితంగా కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది.
అంతే కాదు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
3. కివీ ఫ్రూట్ ఆస్థమా ను నయం చేయటంలో సహాయపడుతుంది
కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ సి మరియు ఆంటీ యాక్సిడెంట్ గుణాలు ఆస్థమా నుంచి బాధపడేవారికి నయం చేయటంలో సహాయపడుతుంది.
ఒక అధ్యయనం ప్రకారం కివీ ఫ్రూట్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే గురక లాంటి శబ్దాన్ని కూడా తగ్గించటంలో సహాయపడుతుంది.
4. కివీ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది
కివీ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. ఈ ఫ్రూట్ లో ఉండే ఎంజైమ్ ఆక్టినిడిన్ ప్రోటీన్లను బ్రేక్ డౌన్ చేసి జీర్ణ వ్యవస్థ లో సహాయపడుతుంది.
ఫైబర్ కాన్స్టిపేషన్ అంటే మలబద్దకం సమస్యను మరియు మలం లో వచ్చే సమస్యలను నయం చేయటంలో సహాయపడుతుంది.
5. కివీ ఫ్రూట్ మన శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
19 సంవత్సరాలు దాటిన వారికి రోజుకి 90 మిల్లి గ్రాముల విటమిన్ C అవసరం. అయితే ఒక 100 గ్రాముల కివీ పండు లో 92 మిల్లీ గ్రాముల విటమిన్ C ఉంటుంది.
కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C ఇమ్మ్యూనిటీ ని బూస్ట్ చేయటంలో సహాయపడుతుంది. ఈ పండు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
6. కివి ఫ్రూట్ మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ను నియత్రించటంలో సహాయపడుతుంది
రోజుకి మూడు కివీ పండ్లు తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇంతే కాకుండా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలైన గుండెపోటు ను తగ్గించటంలో సహాయపడుతుంది.
కివీ ఫ్రూట్ లో ఉండే పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
7. కివి ఫ్రూట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కాపాడటంలో సహాయపడుతుంది
మన శరీరంలో బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె కు సంబంధించిన రోగాలైన గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. కివీ లో ఉండే ఆంటీ ప్లేట్లెట్ గుణం కారణంగా రక్తం గడ్డ కట్టకుండా కాపాడటంలో సహాయపడుతుంది.
8. కివీ ఫ్రూట్ చర్మం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
కొల్లాజిన్ చర్మ ఆరోగ్యానికి సహాయపడే ముఖ్యమైన న్యూట్రియంట్, కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C కొల్లాజిన్ తయారీ లో ముఖ్య పాత్ర వహిస్తుంది.
విటమిన్ C గాయాలను త్వరగా నయం చేయటం లో కూడా సహాయపడుతుంది. కివీ లో ఉండే విటమిన్ E చర్మాన్ని సూర్యుని నుంచి హాని చేకూర్చే కిరణాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.అంతే కాకుండా రోగాల నుంచి మన శరీరానికి సహజ రక్షణ కలిపిస్తుంది.
9. కివీ క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
మన శరీరంలో క్యాన్సర్ డిఎన్ఏ లో కలిగే మార్పుల వల్ల వస్తుంది అయితే ఫ్రీ రాడికల్స్ కూడా మన శరీరంలో డిఎన్ఏ ను నష్ట పరుస్తుంది.
విటమిన్ C లో ఉండే అంటి యాక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతాయి.
కివీ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల కు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది.
10. కివీ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది
కివీ లో ఉండే విటమిన్ K మరియు కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన శరీరం విటమిన్ K ను ఎముకల నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది.
ఈ విటమిన్ K ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల రోగం నుంచి కూడా కాపాడటంలో సహాయపడుతుంది.
Sources :
Wheezing : https://thorax.bmj.com/content/55/4/283
Digestion : https://pubmed.ncbi.nlm.nih.gov/24604128/
Blood clot : https://pubmed.ncbi.nlm.nih.gov/24219176/
Skin : https://www.nhs.uk/conditions/vitamins-and-minerals/vitamin-e/
Bones : https://www.bonejoint.net/blog/fruits-and-vegetables-are-good-for-our-bones/
Also read :
సీతాఫలం పండు యొక్క 11 ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండు వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు
దానిమ్మ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు
అరటిపండు వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు
పసుపు వల్ల కలిగే 10 ప్రయోజనాలు
డ్రాగన్ ఫ్రూట్ యొక్క 10 ఉపయోగాలు
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply