Birth control methods in Telugu – కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏమిటి ?

Birthcontrol methods in Telugu
Image by Anqa from Pixabay

బర్త్ కంట్రోల్ లేదా కుటుంబ నియంత్రణ అనగా ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఆపడాన్ని అంటారు. కొంత మంది అమ్మాయిలు తాము చేసే ఉద్యోగం కారణంగా లేదా కెరీర్ కారణంగా గర్భం దాల్చడాన్ని వాయిదా వేసుకుంటారు. 

కుటుంబ నియంత్రణ పద్దతుల ద్వారా గర్భాన్ని అనుకున్న సమయం వరకు ఆపి తరవాత మళ్ళీ గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. మందులు లేదా ఇతర పద్దతుల ద్వారా కుటుంబ నియంత్రణ చేయటం జరుగుతుంది. ఒక పద్దతి ఇంకో పద్దతి  కన్నా బాగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది.

మీరు కుటుంబ నియంత్రణ కొంత సమయం కోసం చేస్తున్నారా లేదా ఇక ఎప్పటికీ పిల్లలు కలగకుండా ఉండటానికి కుటుంబ నియంత్రణ చేయించుకుంటున్నారో డాక్టర్ తో ముందే సంప్రదించాలి.

ఇక ఎప్పటికీ పిల్లలు కలగకుండా ఉండాలంటే స్టెరిలైజషన్ చేయించుకోవాలి, ఈ పద్దతిలో ఆడ లేదా మగ వారిలో వీర్యం లేదా ఎగ్స్ కలవకుండా సర్జరీ చేయటం జరుగుతుంది. 

ఈ ఆర్టికల్ లో మాత్రం కేవలం కొంత సమయం వరకు మాత్రమే కుటుంబ నియంత్రణ చేసే పద్దతుల గురించి చూద్దాము.

కుటుంబ నియంత్రణలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. 

1) ఇంట్రా యుటరైన్ పద్దతి 

2) హార్మోన్ పద్దతి      

3) బారియర్ పద్దతి 

ఈ మూడు పద్దతుల గురించి విడి విడిగా చూద్దాము.

 ఇంట్రా యుటరైన్ పద్దతి : 

ఈ పద్దతిలో T ఆకారం లో ఉండే ఒక డివైస్ ను యూట్రస్ లో ప్రవేశ పెట్టడం జరుగుతుంది. ఈ డివైస్ శరీరంలో ప్రతి రోజు కొంత మొత్తంలో ప్రొజెస్టిన్ ను విడుదల చేసి గర్బం దాల్చకుండా ఉండటంలో సహాయపడుతుంది.

ఈ డివైస్ సాధారణంగా 3 నుంచి 6 సంవత్సరాల వరకు యూట్రస్ లో ఉంటుంది. ఈ డివైస్ ఎంత బాగా పనిచేస్తుందంటే దీని యొక్క ఫెయిల్యూర్ యొక్క శాతం కేవలం 0.1% నుంచి 0.4% ఉంటుంది. ఈ డివైస్ ను లెవోనోర్జెస్ట్రెల్ ఇంట్రా యుటరైన్ సిస్టం అని అంటారు. 

హార్మోన్ పద్దతి : 

1) ఇంప్లాంట్ :

ఈ పద్దతి లో ఒక పలుచటి రాడ్ ను మహిళ యొక్క చేతి పై భాగంలో  ఇంప్లాంట్ చేయబడుతుంది. ఈ రాడ్ శరీరంలో ప్రొజెస్టిన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఫలితంగా గర్బం రాకుండా ఉండటంలో సహాయపడుతుంది. ఈ రాడ్ మూడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

2) ఇంజెక్షన్ :

ఈ పద్ధతిలో ఇంజెక్షన్ ద్వారా  ప్రొజెస్టిన్ హార్మోన్ ను శరీరం లో ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. ఒక్కసారి ఈ ఇంజెక్షన్ తీసుకున్న తరవాత 3 నెలల వరకు పనిచేస్తుంది.  ఈ ఇంజెక్షన్ ను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసుకోవాలి. ఈ పద్దతి యొక్క ఫెయిల్యూర్ రేట్ 4% గా ఉంటుంది. 

3) నోటి ద్వారా  గర్భనిరోధకాలు : 

ఈ పద్దతిలో పిల్స్ ను నోటి ద్వారా తీసుకోవటం జరుగుతుంది. ఈ పిల్స్ శరీరంలో  ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిన్ హార్మోన్ విడుదల చేసి గర్బం కలగకుండా సహాయపడుతుంది.  కొన్ని పిల్స్ లో కేవలం ప్రొజెస్టిన్ మాత్రమే ఉంటుంది. ఈ పిల్స్ యొక్క ఫెయిల్యూర్ రేట్ 7% ఉంటుంది. ఈ పిల్స్ కేవలం డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేసి ఉండాలి.  

4) ప్యాచ్ : 

ఈ పద్దతి ద్వారా ప్యాచ్ శరీరం లో  పొత్తి కడుపు కింద, పిరుదుల పై, శరీర పై భాగం లో (రొమ్ముల పై కాకుండా) ధరిస్తారు. ప్రతి వారం ఈ ప్యాచ్ ను మారుస్తూ ఉండాలి, 3 వారాల వరకు ధరిస్తారు. 4 వ వారంలో ప్యాచ్ ధరించరు ఎందుకంటే 4 వ వారంలో పీరియడ్స్ వస్తాయి. ఈ పద్దతి యొక్క ఫెయిల్యూర్ రేట్ 7% గా ఉంటుంది.

5) వజైనల్ రింగ్ పద్దతి : 

ఈ పద్దతిలో రింగ్ ను వజైనా లో ఉంచటం జరుగుతుంది. ఈ రింగ్ కూడా ఇతర పద్దతుల లాగానే ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ రింగ్ ను 3 వారాల వరకు ధరించి 4 వ వారం పీరియడ్స్ కోసం తీసి వేయాలి. పీరియడ్స్ తరవాత మళ్లీ కొత్త రింగ్ ను ధరించాలి. ఈ పద్దతి లో ఫెయిల్యూర్ రేట్ 7% గా ఉంటుంది.  

ఈ పై తెలుపబడిన పద్ధతులన్నీ హార్మోన్ కి సంబంధించిన పద్ధతులు, ఇప్పుడు బారియర్ పద్దతుల గురించి చూద్దాం.

బారియర్ పద్ధతులు :

ఈ పద్ధతులు కేవలం శృంగారం చేయటానికి ముందు వినియోగించటం జరుగుతుంది. శృంగారం లో పాల్గొన్న తరవాత తీసివేయటం జరుగుతుంది.    

1) డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ క్యాప్ :

ఈ పద్దతి లో ఒక కప్ ఆకారం లో ఉన్న డయాఫ్రాగమ్ వజైనా లో ఉంచటం జరుగుతుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు స్పెర్మిసైడ్ తో కప్పు అమర్చుకోవాలి. స్పెర్మిసైడ్ వీర్యాన్ని ఆపటం లేదా చంపుతుంది. ఈ కప్పు వేరు వేరు ఆకారాలలో లభిస్తుంది. మీకు ఏ సైజు సరిపోతుందో డాక్టర్ ద్వారా కనుక్కోవాలి. ఈ పద్దతి యొక్క ఫెయిల్యూర్ శాతం 17%.

2)   స్పాంజ్ :

ఈ పద్దతిలో స్పెర్మిసైడ్ తో కూడిన ఒక స్పాంజ్ ను వజైనా లో అమర్చటం జరుగుతుంది. ఈ పద్దతి 24 గంటల వరకు పనిచేస్తుంది మరియు శృంగారం లో పాల్గొన్న తరవాత కనీసం 6 గంటల వరకు అలాగే ఉంచాలి. ఈ పద్దతి యొక్క ఫెయిల్యూర్ శాతం సంతానం లేని వారిలో 14% గా మరియు సంతానం ఉన్న వారిలో 27% గా ఉంటుంది. 

3) మగ లేదా మహిళ కండోమ్ :

ఈ రెండు పద్దతులలో మగ లేదా ఆడ వారు కండోమ్ ను ధరిస్తారు. ఇది ప్రెగ్నన్సీ ను ఆపడమే కాకుండా లైంగికంగా వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.  మగ వారి లో ఫెయిల్యూర్ శాతం 13% అయితే ఆడవారి లో ఫెయిల్యూర్ శాతం 21 % గా ఉంటుంది.

4) స్పెర్మిసైడ్ :

శృంగార సమయంలో వీర్యాన్ని చంపటంలో సహాయపడుతుంది. మార్కెట్ లో ఇది జెల్, క్రీం లేదా టాబ్లెట్ రూపంలో లభిస్తుంది. శృంగారం చేయటానికి ఒక గంట ముందు వజైనా లో పెట్టాలి. శృంగారం తరవాత 6  నుంచి 8 గంటల దాకా వదిలి వేయాలి. ఈ పద్దతి యొక్క ఫెయిల్యూర్ శాతం 21 %. 

ఇలా పైన తెలుపబడిన పద్దతుల ద్వారా మీ కెరీర్ లేదా ఉద్యోగం చేస్తూ గర్బం దాల్చకుండా ఉండవచ్చు. పై తెలుపబడిన పద్దతులను మీ డాక్టర్ తో సంప్రదించిన తరవాతే తీసుకోండి.         

Sources : https://www.cdc.gov/reproductivehealth/contraception/index.htm   https://www.womenshealth.gov/a-z-topics/birth-control-methods#:~:text=Short%2Dacting%20hormonal%20methods%2C%20such,from%20getting%20to%20the%20egg. https://www.mayoclinic.org/healthy-lifestyle/birth-control/in-depth/birth-control-options/art-20045571 https://www.plannedparenthood.org/learn/birth-control https://my.clevelandclinic.org/health/articles/11427-birth-control-options    

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

:

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.