దానిమ్మ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు – 10 Pomegranate health benefits in Telugu

danimma health benefits in telugu
Image by Poswiecie from Pixabay

దానిమ్మ పండు ను ఇంగ్లీష్ లో పోమగ్రానెట్ (Pomegranate) అని అంటారు. ఇది ఇరాన్ మరియు ఉత్తర భారతదేశానికి చెందినది కానీ ప్రపంచం మొత్తం ఈ పండు ను పండిస్తారు. పురాతన కాలంలో దానిమ్మ ను ఒక పవిత్రమైన పండుగా పరిగణించే వారు (1).

దానిమ్మ పండు భారత దేశంలో దాదాపు అన్ని చోట్ల దొరుకుంటుంది. దీని యొక్క ధర ఎక్కువైనా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఆలా ఉంటాయి.    

ఇప్పుడు దానిమ్మ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి చూద్దాము.  

1. విటమిన్లు మరియు పోషకాలు (Nutrients) :

దానిమ్మ లో చాలా ముఖ్యమైన నూట్రిన్లు ఉంటాయి, ఒక 100 గ్రాముల దానిమ్మ లో కింద చూపిన విధంగా విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి (1.1)

పేరు మొత్తం 
శక్తి (Energy)83kcal
పొటాషియం (Potassium)236g
ఫాస్ఫరస్ (Phosphorus)36g
కార్బో హైడ్రేట్(Carbohydrate)18.7g
షుగర్ (Sugars)13.7g
మెగ్నీషియం (Magnesium)12g
కాల్షియం (Calcium)10mg
ఫైబర్ (Fiber)4mg
సోడియం (Sodium)3mg
ప్రోటీన్ (Protein)1.67mg
కొవ్వు (Fat)1.17mg
జింక్ (Zinc)0.35mg
ఐరన్ (Iron)0.3mg
కాపర్ (Copper)0.158mg
మాంగనీస్ (Manganese)0.119mg

2. క్యాన్సర్ (Cancer) :

 గుండె జబ్బు తరవాత అతి భయంకరమైన వ్యాధి అంటే క్యాన్సర్ వ్యాధి అని చెప్పవచ్చు. క్యాన్సర్ వ్యాధి మన శరీరంలోని కణాలు అదుపు లేకుండా పెరగటం వల్ల వస్తుంది. 

క్యాన్సర్ మన శరీరంలోని వివిధ అవయవాలలో వ్యాప్తిస్తుంది. దీనికి ఇంతవరకు క్యూర్ (Cure) కనిపెట్టలేదు.

దానిమ్మ పండు జ్యూస్ రొమ్ము క్యాన్సర్ కు కారకమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడుతుంది. 

దానిమ్మ ఇతర క్యాన్సర్ రకాలైన ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) మరియు పెద్దప్రేగు కాన్సర్ (Colon cancer) ల చికిత్సలో కూడా సహాయపడుతుంది (2).

అయితే ఈ విషయం పై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. 

3.గుండె ఆరోగ్యం (Heart Health)

మన శరీరంలో  HDL (high-density lipoprotein) మరియు LDL (low-density lipoprotein) అనే రెండు రకాలైన మంచి చెడు కొలెస్ట్రాల్ లు ఉంటాయి. 

LDL అనేది చెడు కొలెస్ట్రాల్, ఇది పెరగటం వల్ల  గుండె పోటు కు దారితీసే అవకాశం ఉంటుంది.

HDL అనేది మంచి కొలెస్ట్రాల్, ఈ కొలెస్ట్రాల్ లివర్ ద్వారా  శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. HDL వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. (3

ఒక అధ్యయనం ప్రకారం 2 వారాల వరకు దానిమ్మ రసం తీసుకున్న వారిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గటం గమనించటం జరిగింది. (4)

అయితే దానిమ్మ పండు ప్రభావం మనుషుల మీద తెలియడానికి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. 

4.ఆర్థరైటిస్ (Arthritis) : 

దానిమ్మ పండు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి వాపును మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించటంలో సహాయపడుతుంది (5).

కొన్ని అధ్యయనాల ప్రకారం దానిమ్మ పండు లో ఉండే మంచి గుణాలు మృదులాస్థి (cartilage) ను క్షిణించ కుండా ఉండటంలో సహాయపడుతుంది 

దానిమ్మ విత్తనాలతో చేసిన నూనె ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికీ ఉపశమనం ఇవ్వటం లో సహాయపడుతుంది. 

జంతువుల పై జరిగిన కొన్ని పరిశోధనలలో దానిమ్మ విత్తనాల నూనె ఎముకల  ఖనిజ సాంద్రత (Mineral density) ను పెంచటం లో మరియు వాపు కి గురి అవ్వకుండా ఉండటం లో సహాయపడుతుంది (6).  

5. అల్జీమర్స్ (Alzheimer) :

జంతువుల పై జరిగిన పరిశోధనల లో దానిమ్మ రసం అల్జీమర్స్ జబ్బు కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాపడుతుంది 

వయసు పై బడిన వారిలో చాలా వరకు జ్ఞాపక శక్తికి సంబంధిన సమస్యలు ఉంటాయి. ఒక పరిశోధన లో వయసు పై బడిన వారికి 4 వారాల వరకు 1 కప్పు దానిమ్మ జ్యూస్ ఇవ్వటం జరిగింది . 4 వారాల తరవాత వీరిలో జ్ఞాపక శక్తి పెరగటం గమనించటం జరిగింది (7).

6. చర్మ ఆరోగ్యం (Skin health) :

సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల నే ఎక్కువ శాతం చర్మానికి సంబంధించిన రోగాలు వస్తు ఉంటాయి. ఈ రోగాలలో స్కిన్ క్యాన్సర్ కూడా ఒకటి.  Ultraviolet B రేడియేషన్ స్కిన్ క్యాన్సర్ కి కారణం అవుతుంది. 

కొన్ని మనుషుల పై మరియు జంతువుల పై చేసిన పరిశోధనల ప్రకారం దానిమ్మ ఎక్స్ట్రాక్ట్, దానిమ్మ జ్యూస్ మరియు దానిమ్మ విత్తన నూనె  UVB రేడియేషన్ కి వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేయటంలో సహాయపడుతుందని తెలింది (8).

7. ఆంటియాక్సిడెంట్ మరియు ఆంటీ ఇన్ఫ్లమేటరీ (Antioxidant and Anti-inflammatory):

దానిమ్మ లో ఉండే అంటి ఇంఫ్లమ్మెటరీ మరియు ఆంటియాక్సిడెంట్  గుణాలు దీర్ఘకాలిక జబ్బులైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ మరియు గుండె కి సంబంధించిన జబ్బుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. 

కొన్ని జంతువుల పై చేసిన అధ్యయనాల ప్రకారం దానిమ్మ జ్యూస్ శ్వాస కోశ జబ్బులు,రుమటాయిడ్ ఆర్థరైటిస్, న్యూరో డి జెనెరేటివ్ జబ్బు మరియు హైపర్లిపిడెమియా లాంటి జబ్బులపై మంచి ప్రభావం చూపుతుందని గమనించటం జరిగింది (9).

8. బ్లడ్ ప్రెషర్ (Blood Pressure) : 

కొన్ని జంతువుల మీద చేసిన పరిశోధనల ప్రకారం దానిమ్మ శరీర బరువును తగ్గించటం గమనించటం జరిగింది. ఒక పరిశోధన ప్రకారం దానిమ్మ జ్యూస్ ఒక నెల తీసుకున్న వారిలో బరువు మరియు కొవ్వు ను తగ్గించటంలో సహాయపడింది అని తెలిసింది. అయితే మనుషుల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం పై స్పష్టత లేదు.

ఊబకాయం తో పాటు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం దానిమ్మ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటం లో సహాయ పడుతుంది (10) (11).

9. దంత ఆరోగ్యం (Dental health) : 

దానిమ్మ దంత ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుంది. ఒక పరిశోధనలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని 30ml దానిమ్మ జ్యూస్ తో దంతాలను శుభ్రం చేయటం జరిగింది. ఈ పరిశోధన తరవాత దంతాలతో ఉండే సూక్ష్మజీవుల కాలనీల సంఖ్య గణనియంగా తగ్గటం గమనించటం జరిగింది (12) (13).

10. ఫిట్ నెస్ (Fitness) : 

ఒక పరిశోధన లో క్రీడాకారులకు 21 రోజుల వరకు దానిమ్మ జ్యూస్ ను ఇవ్వటం జరిగింది. ఎక్సర్ సైజు వల్ల ఆక్సిడేటివ్ నష్టాన్ని దానిమ్మ తగ్గించడాన్ని గమనించటం జరిగింది. 

దానిమ్మ జ్యూస్ వాపు ను, కండరాలకు జరిగిన నష్టాన్ని తగ్గించటంలో  మరియు ఆరోగ్యంగా ఉన్న వారిలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచటంలో  సహాయపడుతుంది (14) (15) . 

దానిమ్మ పై కొన్ని పరిశోధనలు మాత్రమే జరిగాయి, పెద్ద మొత్తంలో పరిశోధనలు జరిగితే ఇంకా ఆసక్తి కరమైన విషయాలు ఎలిస్ అవకాశం ఉంది.   

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

1 Comment

Leave a Reply

Your email address will not be published.