మయోసైటిస్ అంటే అరుదైన వ్యాధుల సమూహం. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు బలహీనత మరియు కండరాలలో నొప్పి కలగటం. ఈ వ్యాధి క్రమ క్రమంగా తీవ్ర రూపం దాల్చుకుంటుంది.
ఈ వ్యాధి లో కండరాలు వాపు కు గురవుతాయి. ఈ వాపు లింఫోసైట్లు అంటే తెల్ల రక్త కణాల వల్ల కలుగుతుంది.
తెల్ల రక్త కణాలు సాధారణంగా శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టం ను కాపాడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో మాత్రం ఇమ్యూన్ సిస్టం ను కాపాడటంతో పాటు ఆరోగ్యమైన కండర కణజాలంపై దాడి చేస్తుంది. ఈ కండిషన్ ను ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని అంటారు.
ఫలితంగా కండరాల పని తీరుపై ప్రభావం చూపుతుంది అలాగే అలసట కదలలేకుండా అవుతారు.
మాయోసైటిస్ రకాలు :
మాయోసైటిస్ లో పలు రకాలు ఉన్నాయి
1) పాలీమాయోసైటిస్ : ఈ రకమైన వ్యాధిలో వివిధ కండరాలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భుజాలు, పిరుదులు మరియు తొడల కండరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. సాధారణంగా 30 నుంచి 60 సంవత్సరాల వయస్సు వారు దీని బారిన పడతారు.
2) డెర్మటోమాయోసైటిస్ : ఈ వ్యాధి ప్రభావం శరీరంలోని వివిధ రకాల కండరాలపై ఉంటుంది మరియు స్కిన్ రాష్ (దద్దుర్లు) కలిగిస్తుంది. ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా మహిళలలో మరియు పిల్లలలో ఉంటుంది.
3) ఇంక్లూజన్ బాడీ మాయోసైటిస్ : ఈ వ్యాధి ప్రభావం తొడ కండరాలు, ముంచేయి కండరాలు మరియు మోకాలి కింది కండరాలపై ఉంటుంది. పురుషులు మరియు 50 సంవత్సరాల పై బడిన వారిలో ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Sources:1) https://www.hss.edu/condition-list_myositis.asp 2)https://www.nhs.uk/conditions/myositis/
Leave a Reply