ప్రెగ్నెన్సీ లో వివిధ రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి కాంప్లికేషన్ లోనిదే ఒకటి ప్లాసెంటా ప్రీవియ. ఈ కండిషన్ లో ప్లాసెంటా యూట్రస్ పై భాగం లో కాకుండా కింది భాగం అయిన సర్విక్స్ (Cervix) వద్ద పెరుగుతుంది. సర్విక్స్ అనే భాగం యూట్రస్ మరియు యోనీ ను కలుపుతుంది.
Table of Contents
ప్లాసెంటా (Placenta) అంటే ఏమిటి ?
ప్లాసెంటా తల్లి కడుపులో బిడ్డకు కావలసిన న్యూట్రియంట్లు మరియు ఆక్సిజన్ ను చేరవేస్తుంది. ప్లాసెంటా నే బిడ్డ కు లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పవచ్చు.
ప్లాసెంటా సాధారణ ప్రెగ్నెన్సీ లో యూట్రస్ యొక్క పై భాగం లో అతుక్కుని ఉంటుంది. ప్లాసెంటా నుంచి ఒక నాళం బిడ్డ నాభి లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ నాళం గుండానే బిడ్డ యొక్క వ్యర్థం బయటికి వెళ్లి కావాల్సిన న్యూట్రియంట్లు బిడ్డకు చేరుతాయి.
డెలివరీ సమయంలో ప్లాసెంటా నుంచి వచ్చే నాళం కట్ చేసి తీసివేస్తారు అలాగే ప్లాసెంటాను కూడా తీసివేస్తారు. ప్రతి ప్రెగ్నెన్సీ లో ప్లాసెంటా కొత్తగా ఏర్పడుతుంది.
ప్లాసెంటా అసాధారణంగా యూట్రస్ కింది భాగంలో ఏర్పడే కండిషన్ నే మనం ప్లాసెంటా ప్రీవియ అని అంటారు.
యూట్రస్ లో ప్లాసెంటా స్థానం ?
గర్భం దాల్చినప్పుడు కొన్ని రోజులు ప్లాసెంటా కింది భాగం లోనే ఉండటం సాధారణం కానీ క్రమ క్రమంగా రోజులు గడిచే కొద్దీ కడుపు యొక్క ఆకారం పెరిగే కొద్దీ ప్లాసెంటా యూట్రస్ యొక్క పై భాగానికి చేరుతుంది.
డెలివరీ కి సమయం దగ్గరైనప్పుడు ప్లాసెంటా పై భాగం లో ఉండి బిడ్డ కింది భాగం లో రావటం జరుగుతుంది.
ప్లాసెంటా ప్రీవియ అవ్వటానికి గల కారణాలు ఏమిటి ?
ఇండియా లో ప్లసెంటా ప్రీవియ కు సంబంచిన కేసులు సంవత్సరానికి దాదాపు 10 లక్షలు ఉన్నాయి. ఈ కండిషన్ కచ్చితంగా ఈ కారణం వల్ల వస్తుందని మాత్రం చెప్పలేము కానీ కొన్ని కారణాలు అంచనా వేయవచ్చు.
ప్లాసెంటా ప్రీవియ అవ్వటానికి గల కొన్ని కారణాలు
- అసాధారణ ఆకారంలో ఉన్న యూట్రస్
- ఇంతకు ముందు ఒకటి కన్నా ఎక్కువగా డెలివరీలు అయ్యి ఉండటం
- ఇంతకు ముందు కవల పిల్లలకు జన్మనిచ్చి ఉండటం
- ఇంతకు ముందు యూట్రస్ వద్ద సర్జరీ, అబార్షన్ లేదా ఆపరేషన్ అయ్యినప్పుడు
- IVF లాంటి చికిత్స చేయించుకున్నప్పుడు
- సిగరెట్ లేదా మత్తు పదార్థాలను సేవించినప్పుడు
- వయస్సు ఎక్కువగా అయ్యిన తరవాత గర్భం దాల్చినప్పుడు ఈ సమస్య వస్తుంది.
ఈ కండిషన్ లో ప్లాసెంటా 3 రకాలుగా కార్విక్స్ ను కవర్ చేస్తుంది.
- మొదటి కండిషన్ లో ప్లాసెంటా కార్విక్స్ కు పక్క భాగం లో ఉంటుంది.
- రెండవ కండిషన్ లో ప్లాసెంటా కార్విక్స్ యొక్క కొద్ది భాగాన్ని కవర్ చేస్తుంది.
- మూడవ కండిషన్ లో ప్లాసెంటా కార్విక్స్ ను పూర్తిగా కవర్ చేస్తుంది.
ఈ కండిషన్ ఉందని ఎలా తెలుసుకోవాలి ?
మీరు సాధారణంగా ఆల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు డాక్టర్ చెక్ చేసి ఈ కండిషన్ గురించి వివరిస్తారు. ఈ కండిషన్ ఉందని తెలిసిన తరవాత డాక్టర్ పూర్తిగా రెస్ట్ తీసుకోమని, శృంగారం లో పాల్గొనకుండా ఉండమని ఇంటి పనులు చేయవద్దని చెప్పే అవకాశం ఉంది. ఈ కండిషన్ అలాగే ఉంటే నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ ద్వారా డెలివరీ చేసే అవకాశాలు ఉంటాయి.
ఈ కండిషన్ ఉందని తెలిసిన తర్వాత డాక్టర్ వజైనా చెక్ అప్ లను తగ్గిస్తారు ఎందుకంటే ఎక్కువగా చెక్ అప్ లు చేయటం బ్లీడింగ్ కి దారి తీస్తుంది.
చాలా మంది అమ్మాయిలలో ఈ సమస్య దానంతకు అదే పరిష్కరించబడుతుంది ఎందుకంటే గర్భం యొక్క సైజు పెరిగే కొద్ది ప్లాసెంటా కార్విక్స్ నుంచి దూరం జరిగి ఈ సమస్య అంతమవుతుంది. అలా జరగకుండా బ్లీడింగ్ జరిగినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
లక్షణాలు :
ప్లాసెంటా ప్రీవియ యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అకస్మాత్తుగా వజైనా నుంచి బ్లీడింగ్ అవ్వటం మొదలవుతుంది. బ్లీడింగ్ సాధారణంగా నాల్గవ లేదా ఆరవ నెల నుంచి ప్రారంభమమవుతుంది. కొన్ని సందర్భాలలో నొప్పులు కూడా కలుగుతాయి
బ్లీడింగ్ కొన్ని రోజులు జరిగి మళ్ళీ తిరిగి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం ప్రాణానికి ప్రమాదం కూడా అయ్యే అవకాశం ఉంది.
ఈ కండిషన్ ఉందని తెలిసిన తరవాత డాక్టర్ చెప్పిన విధంగా సూచనలను పాటిస్తూ ఆరోగ్య జాగ్రత్తలను తీసుకున్నట్లైతే మీరు బిడ్డ క్షేమంగా ఉంటారు.
References : 1) https://www.mayoclinic.org/diseases-conditions/placenta-previa/diagnosis-treatment/drc-20352773 2) https://medlineplus.gov/ency/article/000900.htm
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply