IVF ప్రెగ్నన్సీ అంటే ఏమిటి – What is IVF pregnancy in Telugu ?

What is IVF in Telugu ?
Image by วัฒนา ลอยมา from Pixabay

కొన్ని సంవత్సరాల ముందు పిల్లలు పుట్టక పొతే పెళ్ళైన దంపతులు చాలా బాధపడేవారు. తమ తలరాత ఇంతే అని సర్ది పెట్టుకునేవారు. 

కానీ కాలం మారింది, టెక్నాలజీ మారింది ఈ రోజు కొత్త కొత్త పద్దతులతో పిల్లలు పుడుతున్నారు. ఈ టెక్నాలజీ ను ఇంగ్లీష్ లో  అసిస్టెడ్  రీప్రొడక్టీవ్ టెక్నాలజీ ( Assisted reproductive technology) అని అంటారు. ఇందులోనిదే ఒకటి  IVF.

IVF ఫుల్ ఫామ్ (Full form) :

IVF ఫుల్ ఫామ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (In vitro fertilization). IVF ను తెలుగులో కృత్రిమ గర్భధారణ అని అంటారు.

వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. న్యూస్ లో లేదా సినిమాలలో మీరు ఈ మాట విని ఉంటారు.  

IVF ఎవరు చేయించుకుంటారు ?

ఆరోగ్య కారణాల వల్ల సంతానం లేనివారు లేదా జెనెటిక్ సమస్యలతో బాధపడేవారు IVF పద్దతిని ఎంచుకోవటం జరుగుతుంది.  

సాధారణంగా దంపతులు సంతానం కోసం మందులను వాడుతారు, ఈ మందులను ఎగ్స్ యొక్క ఉత్పత్తిని పెంచటానికి ఉపయోగిస్తారు. ఇంకొన్ని సందర్భాలలో intrauterine insemination (ఇంట్రాయుటరైన్ ఇంసెమినషన్) కూడా చేయించుకుంటారు, ఈ ప్రక్రియ లో వీర్యాన్ని ఒవ్యులేషన్ సమయంలో డైరెక్ట్ గా యూట్రస్ లోకి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది.      

ఈ పద్దతులను ప్రయత్నించిన తర్వాత కూడా సంతానం కలగక పోయినప్పుడు ఇక వేరే దారి లేక చివరికి IVF పద్దతిని ఎంచుకోవటం జరుగుతుంది. 

కొంత మంది మహిళల యొక్క ఆరోగ్య సమస్యల వల్ల కూడా IVF పద్దతిని ఎంచుకోవటం జరుగుతుంది.

  • ఫాలోపియన్ ట్యూబ్ నష్టపోవటం లేదా దెబ్బ తిన్నప్ప్పుడు : ఓవరీ నుంచి బయటికి వచ్చిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారానే యూట్రస్ కు చేరుకుంటుంది. ఈ ట్యూబ్ దెబ్బతినటం వల్ల ఎగ్ యూట్రస్ వరకు చేరుకోలేదు ఫలితంగా ప్రెగ్నన్సీ సంభవించదు.
  • వయసు : మహిళ యొక్క వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, 40 సంవత్సరాల కన్నా ఎక్కువగా వయసు అయినా కూడా పిల్లలు పుట్టనప్పుడు IVF ను ఎంచుకుంటారు. 
  • ట్యూబల్ స్టెరిలైజేషన్ : దంపతులు సంతానం కలగకుండా చికిత్స చేయించుకుంటారు. ఈ చికిత్సలో ఫాలోపియన్ ట్యూబ్ ను శాశ్వతంగా కట్ చేయటం లేదా బ్లాక్ చేయటం జరుగుతుంది. ఫలితంగా ఓవరీ నుంచి బయటికి వచ్చిన ఎగ్ వీర్యం తో ఫర్టిలైజ్ అవ్వలేదు.
  • బలహీనమైన స్పెర్మ్ ఉత్పత్తి : అమ్మాయిలలో అని కాకుండా పురుషులలో ఉండే సమస్యల వల్ల కూడా సంతానం కలగటం కఠినమవుతుంది. వీర్యం బలహీనంగా ఉండటం లేదా వీర్యం యొక్క సైజు మరియు ఆకారం సరిగా ఉండకపోవటం వల్ల కూడా ప్రెగ్నెంట్ అవ్వటం కష్టం అవుతుంది.
  •  యుటరైన్ ఫైబ్రాయిడ్స్ : యూట్రస్ లో కాన్సర్ రహిత కణితులు ఏర్పడటం వల్ల ఫర్టిలైజ్ అయిన ఎగ్ యొక్క ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. 
  •  ఒవ్యులేషన్ : ప్రతి నెల ఓవరీ నుంచి ఎగ్ బయటికి రావటాన్ని ఒవ్యులేషన్ అని అంటారు. కొందరు మహిళల్లో ఎగ్స్ సరిగా ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (polycystic ovary syndrome) అనే హార్మోన్ కి సంబంచిన డిసార్డర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ప్రెగ్నెంట్ అవ్వటం కష్టం అవుతుంది.
  • ఎండోమెట్రియోసిస్ : యూట్రస్ యొక్క లైనింగ్ యూట్రస్ లోపల ఉండాలి కానీ కొన్ని సందర్భాలలో యూట్రస్ బయట ఈ లైనింగ్  పెరగటం మొదలవుతుంది. ఫలితంగా ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్ మరియు యూట్రస్ యొక్క విధులను ఆపుతుంది.  
  • జెనెటిక్ డిసార్డర్ : కొన్ని ఆరోగ్య సమస్యలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి బదిలీ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి తమ పిల్లలను కాపాడుకోవటానికి IVF పద్దతిని ఎన్నుకుంటారు.
  • కాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు :  క్యాన్సర్ బారిన పడ్డ మహిళలు కిమియో థెరపీ చేయించుకుంటారు. ఈ ప్రక్రియ లో రేడియేషన్ కారణంగా సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే ఎగ్స్ ను ముందే బయటికి తీసి పెట్టుకొని ఫ్రోజ్ చేసి పెట్టుకుంటారు. ఇలా ఫ్రోజ్ చేసిన ఎగ్స్ ను తరవాత తీసి ఉపయోగించుకోవచ్చు.

 IVF ప్రక్రియ ఎలా ఉంటుంది ?

ఈ ప్రక్రియ లో మహిళ నుంచి పరిపక్వ ఎగ్ ను తీసుకొని పురుషుడి వీర్యం తో  ల్యాబ్ లో ఫర్టిలైజ్ (ఫలదీకరణం) చేస్తారు. ఈ ప్రక్రియ లో ఒక ఎగ్ లేదా అంత కన్నా ఎక్కువ ఎగ్ లను ఫలదీకరణం చేయటం జరుగుతుంది.

ఇలా ఫలదీకరణం చెందిన ఎగ్ ను ఎంబ్రియో అని అంటారు. ఎంబ్రియోలను మహిళ యొక్క యూట్రస్ లోకి ప్రవేశపెడతారు.   

సాధారణంగా ఈ ప్రక్రియ పెళ్ళైన దంపతులు చేస్తారు. భార్య యొక్క ఎగ్స్ మరియు భర్త యొక్క వీర్యం తో IVF చేయటం జరుగుతుంది.

ఒకవేళ భార్య ఎగ్స్ లేదా భర్త యొక్క వీర్యం IVF ప్రక్రియలో ఫర్టిలైజ్ అవ్వక పొతే డోనర్ సహాయం తీసుకోవటం జరుగుతుంది.

డోనర్ అంటే ఎవరు ?

డోనర్ లు తమ ఎగ్స్ ని లేదా వీర్యాన్ని ఇతరులకు డబ్బులు తీసుకొని ఇస్తారు. క్లినిక్స్ లో ఆడ మరియు మగ ఇద్దరు డోనర్ లు అందుబాటులో ఉంటారు.

IVF ప్రక్రియలో మహిళ యొక్క ఎగ్స్  ద్వారా ఫలదీకరణం చేయటం సాద్యం అవ్వనప్పుడు డోనర్ ఎగ్స్ ను తీసుకోవటం జరుగుతుంది.    

ఇలాగే పురుషుడి యొక్క వీర్యం యొక్క ఉత్పత్తి సరిగా లేకపోవటం లేదా ఇతర కారణాల వల్ల వీర్యం తో ఫలదీకరణం చేయటం సాధ్యం అవ్వనప్పుడు డోనర్ వద్ద వీర్యం ను తీసుకోవటం జరుగుతుంది. 

డోనర్ ఎన్ని డబ్బులు తీసుకుంటారు ?

సాధారణంగా ఎగ్ డోనర్ లు 20 నుంచి 40 వేల దాకా డబ్బులు తీసుకుంటారు. అలాగే వీర్యం యొక్క డోనర్ లు 500 నుంచి 1000 దాకా డబ్బులు తీసుకుంటారు. 

కచ్చితంగా ఇంత అవుతుందని మాత్రం చెప్పలేము ఎందుకంటే మీరుంటున్న రాష్ట్రం లేదా దేశం పై ఈ ఖర్చు ఆధారపడి ఉంటుంది.    

సరోగసీ మరియు IVF కి సంభందం ఏమిటి ?

ఒక మహిళ గర్భం దాల్చటమే అసంభవం అయినప్పుడు  IVF పద్దతి ద్వారా ఎంబ్రియోను తయారు చేసి ఇంకొక మహిళ యూట్రస్ లో ప్రవేశ పెడతారు. దీనినే సరోగసీ అని అంటారు.  

IVF కి ముందు భార్య భర్తలు లేదా పార్ట్నర్స్ కొన్ని టెస్టులను చేయించుకోవాల్సి ఉంటుంది

  1. మొదట ఎగ్స్ యొక్క క్వాలిటీ ను చెక్ చేయటం జరుగుతుంది, ఈ ప్రక్రియ లో ఒకటి కన్నా ఎక్కువ ఎగ్ లను తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఎగ్ క్వాంటిటీ ను కూడా చెక్ చేయటం జరుగుతుంది.
  1. ఎగ్స్ తో పాటు వీర్యం యొక్క క్వాలిటీ ను చెక్ చేయటం జరుగుతుంది.
  1. HIV తో పాటు ఇతర అంటువ్యాధుల కోసం టెస్ట్ లు చేస్తారు. 
  1. అల్ట్రా సౌండ్ సహాయం తో యూట్రస్ యొక్క లైనింగ్ ను చెక్ చేస్తారు.
  1.  ఎగ్ ఫర్టిలైజ్ అయిన తరవాత ట్రాన్స్ఫర్ చేసేటపుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఎగ్ లేకుండానే ముందుగానే ఎంబ్రియో ట్రాన్ఫర్ కోసం ప్రాక్టీస్ చేస్తారు. 

కొన్ని సందర్భాలలో దంపతుల యొక్క ఎగ్స్ లేదా వీర్యం ద్వారా ప్రెగ్నెన్సీ కష్టం అనిపించినప్పుడు డోనర్ ద్వారా వీర్యం లేదా ఎగ్స్ ను తీసుకోవటం జరుగుతుంది. 

టెస్టుల తరవాత ఇప్పుడు దంపతులు IVF  కోసం రెడీ గా ఉన్నారు. ఈ స్టేజ్ లో దంపతులు కొన్ని విషయాలలో తమ నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

  • ఈ ప్రక్రియ లో ఒకటి కంటే ఎక్కువ ఎంబ్రియో లను ట్రాన్స్ఫర్ చేయబడతాయి కాబట్టి ఒకే ప్రెగ్నన్సీ లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. దంపతుల నిర్ణయం మేరకు తరవాత సెలెక్టివ్ రిడక్షన్ పద్దతి ద్వారా ఫీటస్ (పిండాలు) లను తగ్గించటం జరుగుతుంది.  
  • వయసు ఎక్కువగా ఉన్న వారిలో ప్రెగ్నన్సీ సక్సెస్ అవ్వటానికి ఇలా ఎక్కువగా ఎంబ్రియో లను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విషయం పై డాక్టర్ తో కూడా చర్చించటం జరుగుతుంది.
  • ఒక వేళ మొదటి సారే ఈ ప్రక్రియ సక్సెస్ అయితే మిగిలిన ఎంబ్రియో లను ఎం చేయాలనుకున్నారో నిర్ణయించాలి. సాధారణంగా ఈ ఎంబ్రియోలను వేరే దంపతులకు దానం చేయటం లేదా నాశనం చేస్తారు.
  • ఏదైనా కారణాల వల్ల దంపతులు డోనర్ సహాయం తీసుకున్నట్లైతే చట్టపరమైన సమస్యలను ముందే పరిష్కరించుకోవాలి.  పుట్టబోయే బిడ్డ మీకే చెందేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.  

అన్ని నిర్ణయాలు తీసుకున్న తరవాత దశల వారీగా IVF ప్రక్రియ జరుగుతుంది.

మొదటి దశ  : సూపర్ ఒవ్యులేషన్ 

ఎగ్స్ యొక్క క్వాలిటీ మరియు క్వాంటిటీ ను పెంచడానికి  మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది.   

సాధారణంగా మహిళలు నెలకు ఒక్కసారి మాత్రమే ఎగ్ ను ఉత్పత్తి చేస్తారు కానీ ఈ ప్రక్రియలో ఒకటి కన్నా ఎక్కువగా ఎగ్స్ ను ఉత్పత్తి చేసేలా మందులు ఇవ్వటం జరుగుతుంది.

వజైనల్ అల్ట్రాసౌండ్ మరియు బ్లడ్ టెస్టుల ద్వారా ఓవరీ మరియు హార్మోనల్ లెవెల్స్ ను గమనిస్తారు.

రెండవ దశ : ఎగ్ మరియు వీర్యం రిట్రీవల్

ఎగ్స్ సేకరించే ప్రక్రియకి ముందు నొప్పి తెలియకుండా ఉండటానికి మత్తు మందును ఇస్తారు.  ఒక చిన్న సర్జరీ ద్వారా ఎగ్ లను సేకరించటం జరుగుతుంది.  

ఎగ్ ను ఓవరీ నుంచి తీసుకోవడానికి ట్రాన్స్ వజైనల్ అల్ట్రాసౌండ్ (Transvaginal ultrasound) ద్వారా లోపలి భాగాన్ని చూస్తూ ఒక నీడిల్ (Pelvic laparoscopy) ద్వారా ఎగ్స్ ను సేకరించటం జరుగుతుంది. 

ఈ నీడిల్ ఒక సక్షన్ డివైస్ అమర్చి ఉంటుంది కాబట్టి సులువుగా ఎగ్స్ ను ఒక దాని తరవాత మరొక ఎగ్ ను సేకరించటం జరుగుతుంది.ఒక ఓవరీ నుంచి తీసుకున్న తరవాత మరొక ఓవరీ నుంచి అదే ప్రక్రియ ను రిపీట్ చేయటం జరుగుతుంది. 

ఈ ప్రక్రియ తరవాత  ఒక రోజు వరకు క్రామ్ప్స్ (cramps) లాంటి ఫీలింగ్ కలుగుతుంది. 

ఎగ్స్ సేకరించే ప్రక్రియ పూర్తి అయిన తర్వాత భర్త లేదా పార్టనర్ యొక్క వీర్యాన్ని సేకరించటం జరుగుతుంది. ఈ ప్రక్రియ హస్త ప్రయోగం లేదా  టెస్టికల్స్ నుంచి డైరెక్ట్ గా వీర్యాన్ని తీసుకుంటారు.

మూడవ దశ : ఫర్టిలైజషన్ 

సేకరించిన ఎగ్స్ లో నుంచి మంచి క్వాలిటీ ఎగ్స్ ను తీసుకొని వీర్యం తో కలపటం జరుగుతుంది.  ఇలా ఎగ్ మరియు వీర్యాన్ని కలపడాన్ని ఇన్సేమినేషన్ అంటారు.

అనుకూల వాతావరణం లో ఎగ్స్ మరియు వీర్యాన్ని ఉంచుతారు. ఇలా ఉంచిన కొద్దీ గంటలలోనే వీర్యం ఎగ్ ను ఫర్టిలైజ్ చేస్తుంది. 

ఫర్టిలైజ్ ప్రక్రియ నెమ్మదిగా అవుతుందని అనిపించినప్పుడు వీర్యాన్ని డైరెక్ట్ గా ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. ఈ ప్రక్రియ ను ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) అని అంటారు. 

నాల్గవ దశ  : ఎంబ్రియో 

ఫర్టిలైజ్ అయిన ఎగ్ విభజింపబడి ఎంబ్రియోగా మారుతుంది. ఎగ్ యొక్క ఎదుగుదలను జాగ్రత్తగా గమనించటం జరుగుతుంది. 5 రోజులలో ఎంబ్రియోలోని కణాలు సరైన సంఖ్యలో విభజింపబడాలి.    

ఎదుగుదల మంచిగా అవుతున్నప్పుడు ఎంబ్రియో నుంచి కొంత భాగాన్ని తీసుకొని జన్యు పరమైన రోగాల కోసం టెస్ట్ చేయటం జరుగుతుంది.  ఈ ప్రక్రియను ప్రీ -ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ (PGD) అని అంటారు.టెస్ట్ సక్సెస్ అయిన తరవాత ఎంబ్రియో ను ట్రాన్స్ఫర్ చేయటానికి రెడీ అవుతారు.

ఐదవ దశ : ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 

ట్రాన్స్ఫర్ చేయటానికి ముందు నొప్పి తెలియకుండా ఉండటానికి మత్తు మందును ఇస్తారు

కాథెటర్ అనే ఒక ట్యూబ్ ను వజైన లోకి ప్రవేశపెడతారు. తరవాత ఒక సిరంజి సహాయంతో ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ ఎంబ్రియో లను యూట్రస్ లోకి ప్రవేశ పెడతారు. వయసు ఎక్కువగా ఉన్న మహిళలో ఒకటి కన్నా ఎక్కువ ఎంబ్రియోలు ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. 

ఈ ప్రక్రియ సక్సెస్ అయినట్లయితే  ఎంబ్రియో యూట్రస్ లైనింగ్ కు అతుక్కొని ఎదగటం మొదలుపెడుతుంది.

ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సాధారణంగా ఒక రోజు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సలహా ఇస్తారు. ఎక్కువ శాతం మహిళలు ఆ మరుసటి రోజు నుంచి  యధావిధిగా పనులు చేసుకుంటారు.

పిండం యొక్క ఎదుగుదలకు డాక్టర్ కొన్ని మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది.

ఫలితం : 

ఎగ్స్ సేకరించిన రోజు నుంచి 12 రోజుల తరవాత ప్రెగ్నన్సీ టెస్ట్ ను చేయటం జరుగుతుంది.

ప్రెగ్నెంట్ అయ్యారని ఖరారు అయ్యిన తరవాత ప్రసూతి వైద్యుడిని సంప్రదించమని సలహా ఇస్తారు.

ఒక వేళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఒక వారం లో పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పీరియడ్స్ కాకుండా ఇంకేదైనా ఆరోగ్య సమస్యలను గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోతె IVF యొక్క రెండవ సైకిల్ ను ప్రారంభించడానికి డాక్టర్ తో సంప్రదించవచ్చు.

IVF సక్సెస్ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది ?

  • IVF చేసుకునేవారి వయసు ఎంత తక్కువగా ఉంటె అంత ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.  
  • యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియో ఎంత మంచిగా ఎదిగి ఉంటె అంత ఎక్కువగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
  • స్మోకింగ్ లేదా ఇతర చెడు అలవాట్లు ఉన్నట్లయి ఈ ప్రక్రియ సక్సెస్ అవ్వటం కష్టం అవుతుంది.
  • కొంత మంది మహిళలలకు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండటం వల్ల IVF సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఎండోమెట్రియోసిస్ డిసార్డర్ లో యూట్రస్ లోపల ఉండే లైనింగ్ బయటి భాగంలో ఎదిగినప్పుడు ప్రెగ్నన్సీ లో సమస్య వస్తుంది.
  •  ఇంతకు ముందు కనీసం ఒక్క డెలివరీ అయిన చేసి ఉన్న వారు IVF ప్రక్రియ చేసినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. 

IVF చేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదా ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా ?

  • IVF ప్రక్రియ లో వయసు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భస్రావం (miscarriage) అవకాశాలు ఉంటాయి.
  • కొంత మంది మహిళలలో ఎంబ్రియో యూట్రస్ లో పెరగకుండా ఫాలోపియన్ ట్యూబ్ లో పెరుగుతుంది. యూట్రస్ కాకుండా ఇతర ప్రదేశంలో ఎంబ్రియో ఎదిగే అవకాశాలు ఉండవు.
  • కొత్తగా జరిగిన పరిశోధనల ప్రకారం IVF ప్రక్రియ వల్ల క్యాన్సర్ జబ్బు రాదు.
  • ఎగ్ సేకరించే పద్దతిలో ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఓవరీలు వాపు కు గురి అయ్యి నొప్పిని కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎగ్స్ సేకరించడానికి ఉపయోగించే నీడిల్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.    
  • ఇవన్నీ ఒక ఎత్తు అయితే IVF ప్రక్రియ చేసుకునే మహిళ చాలా స్ట్రెస్ కి గురి అయ్యే అవకాశం ఉంటుంది. 

IVF కి ఎంత ఖర్చు అవుతుంది ?

ఖర్చు ఇంత అవుతుందని కచ్చితంగా చెప్పలేము, ఒక సైకిల్ ఫెయిల్ అయితే మళ్ళీ రెండవ సైకిల్ చేయాల్సి ఉంటుంది. 

మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు లేదా ఏ దేశంలో ఉన్నారు అన్న దాని పై కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది. IVF యొక్క ఖర్చు ఇండియా లో అయితే సుమారుగా 2 లక్షలకు పైగా అవుతుంది. డోనర్ వద్ద ఎగ్స్ లేదా వీర్యం తీసుకున్నట్లైయితే ఆ ఖర్చు వేరు గా ఉంటుంది.

Sources :

https://www.ncbi.nlm.nih.gov/books/NBK562266/

https://www.acog.org/womens-health/faqs/treating-infertility?utm_source=redirect&utm_medium=web&utm_campaign=otn

https://www.mayoclinic.org/tests-procedures/in-vitro-fertilization/about/pac-20384716

https://medlineplus.gov/ency/article/007279.htm

https://www.pregnancybirthbaby.org.au/when-to-consider-ivf

https://www.womenshealth.gov/a-z-topics/infertility

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.