Table of Contents
వర్జిన్ అంటే ఏమిటి అర్థం ?
ఒక మహిళా లేదా ఒక పురుషుడు ఇంతవరకు ఎప్పుడు కూడా శృంగారంలో పాల్గొనకపోయినట్లైతే వర్జిన్ అని పిలుస్తారు. ప్రస్తుతం మన సమాజంలో పెళ్లి కి ముందు కొంత మంది అమ్మాయిలు తాము వర్జినా కదా అనే ప్రశ్నలు వినవలసి ఉంటుంది.
ఒకవేళ అమ్మాయి వర్జిన్ అయినట్లయితే టెస్ట్ ద్వారా రుజువు చేయమని అడగటం జరుగుతుంది.
వర్జినిటీ టెస్ట్ అంటే ఏమిటి ?
వర్జినిటీ టెస్ట్ నే టూ ఫింగర్ టెస్ట్ (Two Finger Test) అని కూడా అంటారు. సాధారణంగా ఈ టెస్ట్ ను పెళ్లి అవ్వాల్సిన అమ్మాయిలకు చేయటం జరుగుతుంది. ఈ టెస్ట్ ను అమ్మాయిలు ఇంత వరకు శృంగారంలో పాల్గొన్నారా లేదా అని తెలుసుకోవడాని చేయటం జరుగుతుంది.
ఈ టెస్ట్ లో సాధారణంగా రెండు పద్దతుల ద్వారా టెస్ట్ చేస్తారు. మొదటి పద్దతిలో అమ్మాయి యొక్క వజైనా లో హైమెన్ ను చెక్ చేస్తారు. రెండవ పద్దతిలో వజైనా యొక్క సున్నితత్వాన్ని అంటే ఎంత లూజ్ గా ఉందో చెక్ చేయటం జరుగుతుంది.
మొదటి పద్దతిలో వజైనాలో ఉండే హైమెన్ (వజైనా ను కప్పే ఒక పలుచటి పొర) పొర ఎంత చిరిగి ఉంది, అసలు ఉందా లేదా అని చూడటం జరుగుతుంది.
హైమెన్ అంటే ఏమిటి ?
హైమెన్ వజైనా పై ఉండే ఒక పలుచటి పొరను అంటారు. హైమెన్ యొక్క ఆకారం వివిధ రకాలుగా ఉంటుంది.
ఎక్కువ శాతం మహిళలో హైమెన్ అర్ద చంద్రపు ఆకారం లేదా డోనట్ ఆకారం ఉంటుంది. హైమెన్ వజైనా మొత్తాన్ని కప్పి ఉంచదు కాస్త భాగం ఓపెన్ గా ఉంటుంది, ఫలితంగా వజైనా నుంచి పీరియడ్స్ సమయంలో రక్త స్రావం జరుగుతుంది.
కొన్ని సందర్భాలలో పుట్టిన పిల్లలలో హైమెన్ వజైనాను పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఇలా ఉండటం వల్ల మూత్ర విసర్జనలో పిల్లలు ఇబ్బంది పడతారు. యుక్త వయసు వచ్చిన తరవాత పీరియడ్స్ మొదలైనప్పుడు ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటారు. వైద్య పరంగా ఇలాంటి కండిషన్ ను Imperforate Hymen (అసంపూర్ణ హైమెన్) అని అంటారు.
వర్జినిటీ టేస్ట్ మనం నమ్మొచ్చా ?
వర్జీనిటీ టేస్ట్ మొత్తం హైమెన్ ఎంత మొత్తం లో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంది. పిల్లలు గా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు పలు కారణాల వల్ల హైమెన్ పొర పూర్తిగా నశించే అవకాశాలు ఉంటాయి.
పీరియడ్స్ సమయంలో టాంపోన్ లను ఉపయోగించినప్పుడు
పీరియడ్స్ సమయంలో మెన్స్ట్రువల్ కప్ లను వినియోగించినప్పుడు
జిమ్నాస్టిక్స్ లేదా గుర్రపు సవారి చేసేటప్పుడు
ఈ పొర నశించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వర్జిన్ టేస్ట్ ను పూర్తిగా నమ్మలేము. ఇంకొన్ని సందర్భాలలో అమ్మాయిలలో అసలు హైమెన్ పొర చాలా వరకు ఉండక పోవచ్చు, ఇది ఒక సాధారణ విషయం.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) ప్రకారం ఈ టేస్ట్ పనిచేస్తుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.
టెస్టు వల్ల అమ్మాయిల ఆరోగ్యం పై కలిగే ప్రభావం ?
అమ్మాయిలు శారీరకంగా మరియు మానసింగా చాలా భాదపడుతారు. కొన్ని సందర్భాలలో అమ్మాయిలు వర్జిన్ టెస్టు ఫెయిల్ అయ్యామని తెలుసుకొని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
ఏ దేశాలలో ఈ టెస్టు చేయబడుతుంది ?
ఒక్క దేశం అని కాకుండా ప్రపంచం లోని పలుదేశాలలో ఈ టెస్టు చేయబడుతుంది. ఎక్కువగా పెళ్లి కాని అమ్మాయిలకే ఈ టెస్టు ను చేయటం జరుగుతుంది.
ఇండోనేసియా దేశంలో అమ్మాయిలు పోలీస్ ఫోర్స్ జాయిన్ అవ్వాలంటే వర్జీనిటీ టెస్టు పాస్ అవ్వాల్సిందే, 2021 వ సంవత్సరం నుంచి ఆ దేశంలో ఈ పద్దతిని మానేసారు.
చివరి మాట :
హైమెన్ పొర సహజంగానే అమ్మాయిలలో ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ పొర నశించటం జరుగుతుంది. ఇది చాలా సాధారణం, పైగా ఈ టెస్టు కి శాస్త్రీయ పరంగా ఎలాంటి రుజువు లేదు.
ఈ టెస్టు లను చేయటం మానుకున్నట్లైతే అమ్మాయిలను శారీరకంగా మరియు మానసికంగా బాధపడకుండా కాపాడే వాళ్లవుతాము.
Sources : https://youngwomenshealth.org/2013/07/10/hymens/#:~:text=The%20most%20common%20hymen%20in,sometimes%20be%20diagnosed%20at%20birth.
https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5437416/
https://en.wikipedia.org/wiki/Virginity_test
https://reproductive-health-journal.biomedcentral.com/articles/10.1186/s12978-019-0731-8
https://www.who.int/reproductivehealth/virginity-testing-elimination/en/
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply