రోజు మనం న్యూస్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు చుస్తున్నాం పైగా కోవిడ్ -19 యొక్క కొత్త వేరియంట్ వల్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
ఇలాంటి సమయంలో WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ను పాటిస్తూ మనల్ని మనం రక్షించు కోవాలి. ప్రస్తుతం ఇండియా లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
కొంత మంది తప్ప దాదాపు అందరు వ్యాక్సిన్ డోస్ లను తీసుకుంటున్నారు. ఇప్పటికి కొంత మందికి వ్యాక్సిన్ కి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి.
ముఖ్యంగా ప్రెగ్నెంట్ అవ్వబోతున్న లేదా ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలు వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అనే డైలమా లో ఉన్నారు. పాలు పట్టే మహిళలలో కూడా వ్యాక్సిన్ పట్ల సందేహాలు ఉన్నాయి.
వాక్సిన్ ను ప్రెగ్నెంట్ ఉన్నవారు తీసుకోవచ్చా ?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇప్పటి వరకు చేసిన పరిశోధనల లో ప్రెగ్నన్సీ సమయంలో వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఉన్న ప్రమాదం కన్నా లాభాలే ఎక్కువగా ఉన్నాయి అని తేలింది.
కోవిడ్ – 19 వ్యాక్సిన్ లో లైవ్ వైరస్ కూడా ఉండదు కాబట్టి వ్యాక్సిన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేదు.కోవిడ్ కాకుండా కొన్ని ఇతర వ్యాక్సిన్ ల తయారీ లో బలహీన మైన వైరస్ ను ఉపయోగించటం జరుగుతుంది. ఈ బలహీనమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇమ్యూన్ సిస్టం వైరస్ కి వ్యతిరేకంగా ఆంటీ బాడీస్ లను తయారుచేస్తుంది.
Also read : What is Vaccine in Telugu ?
శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం కూడా mRNA Covid – 19 వ్యాక్సిన్ ద్వారా గర్భస్రావం (miscarriage) అవ్వదని గమనించటం జరిగింది.
ఇజ్రాయిల్ లో జరిపిన ఒక పరిశోధన లో వ్యాక్సిన్ తీసుకున్న ప్రెగ్నెంట్ మహిళలలను వ్యాక్సిన్ తీసుకొని మహిళలతో పోల్చారు. ఈ పరిశోధనలో వ్యాక్సిన్ కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకునే ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాక్సిన్ వేసుకుంటున్నామని ప్రెగ్నన్సీ ను తరవాత ప్లాన్ చేసుకోవటం లేదా ప్రెగ్నన్సీ ను రద్దు చేసుకోవద్దని సూచిస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయం లో వ్యాక్సిన్ తీసుకున్నవారు తమ శరీరంలో ఆంటీ బాడీ లను తయారు చేసుకుంటారు. అలాగే ఈ అంటి బాడీస్ పుట్ట బోయే బిడ్డ ను కూడా కోవిడ్ నుంచి కాపాడే అవకాశాలు ఉన్నాయి.
బ్రెస్ట్ ఫీడింగ్ (పాలు పట్టే) మహిళలు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా ?
ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల ప్రకారం వాక్సిన్ తీసుకున్న తల్లి పాలలో ఆంటీ బాడీస్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల బిడ్డ ను కూడా కోవిడ్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.
ఈ విషయం పై ఇంకా పెద్ద మొత్తంలో పరిశోదనలు జరగాల్సి ఉంది.
చాలా అరుదుగా కొంత మందికి వ్యాక్సిన్ వల్ల అలర్జిక్ రియాక్షన్ ఏర్పడుతుంది. ఇంతకు ముందు తీసుకున్న ఏదైనా వ్యాక్సిన్ వల్ల అలర్జిక్ రియాక్షన్ కలిగినట్లైతే ఒక సారి డాక్టర్ తో సంప్రదించటం మంచిది.
చివరి మాట :
CDC ప్రకారం ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలు ప్రెగ్నెంట్ లేని వారి కంటే ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని తేలింది. వ్యాక్సిన్ మనల్ని కరోనా నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
చాలా మందికి వాక్సిన్ వల్ల గర్భస్రావం లేదా సంతానోత్పత్తి లో సమస్యలు వస్తాయని అపోహలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలలో ఇవేమి రుజువు కాలేదు.
సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లను మరియు ఫేక్ న్యూస్ లను నమ్మొద్దు. వ్యాక్సిన్ వేసుకొని మిమ్మల్ని మరియు మీకు పుట్టబోయే బిడ్డను కరోనా నుంచి కాపాడుకోండి.
Sources:
https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/recommendations/pregnancy.html
https://www.who.int/news-room/feature-stories/detail/who-can-take-the-pfizer-biontech-covid-19–vaccine-what-you-need-to-know
https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/coronavirus/the-covid19-vaccine-and-pregnancy-what-you-need-to-know
https://www.rcog.org.uk/en/guidelines-research-services/coronavirus-covid-19-pregnancy-and-womens-health/covid-19-vaccines-and-pregnancy/covid-19-vaccines-pregnancy-and-breastfeeding/
https://www.acog.org/covid-19/covid-19-vaccines-and-pregnancy-conversation-guide-for-clinicians
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply