వ్యాక్సిన్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ? – What is Vaccine in Telugu

Image by Alexandra_Koch from Pixabay

ఈ మధ్య కాలంలో మనము బాగా వింటున్న పదం ఏమిటంటే వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది ?

మన పూర్వీకుల సమయంలో టెక్నాలజీ అంతగా లేకపోవటం వళ్ళ ఒక వ్యాధి కి మందు కనుగొనడం చాలా ఇబ్బంది గా ఉండేది. ఒక వ్యాధి కి మందు కనుగొనే ప్రక్రియ లోనే చాలా మంది చనిపోయే వారు. కొన్ని వ్యాధులు మనుషుల కు వచ్చినప్పుడు వాటంతకు అవే తగ్గి పోతాయి. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు మొదలగునవి.

కొన్ని వ్యాధులు మాత్రం త్వరగా తగ్గవు పైగా మనిషి ప్రాణం సైతం తీస్తాయి. ఈ వ్యాధులు అన్ని దాదాపుగా అంటు వ్యాధులు, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి కి చాలా త్వరగా వేగవంతం గా వ్యాపిస్తాయి. పోలియో, టెటనస్, ఇన్ఫ్లుఎంజా, రుబెల్లా, తట్టు, రోటవైరస్, గవద బిళ్ళ, అమ్మోరు (చికెన్ పాక్స్ ), డిఫ్తీరియా లాంటి వ్యాధులు చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాయి.

ఈ వ్యాధులకు వ్యాక్సిన్ కనుగొనడం వళ్ళ దాదాపు ఈ వ్యాధి బారిన పది మరణించు వారి సంఖ్య చాలా వరకు తగ్గి పోయింది.

ప్రపంచం లోని మొట్ట మొదటి వ్యాక్సిన్ :

ప్రపంచం లోని మొట్ట మొదటి వ్యాక్సిన్ ను 1796 సంవత్సరం లో ఎడ్ వర్డ్ జెన్నర్ కనుగొన్నారు.

మొదటి వ్యాక్సిన్ కనుగొను ప్రక్రియ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది.

ఆ రోజుల్లో స్మాల్ పాక్స్ అనే రోగం బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది శాస్త్రవేత్త లు స్మాల్ పాక్స్ రోగానికి మందు కనుగొనడానికి కృషి చేస్తున్నారు.

ఎవరికీ కూడా ఫలితం దక్కలేదు, అదే సమయంలో కౌ పాక్స్ అనే వ్యాధి కూడా వ్యాపిస్తుంది. కౌ పాక్స్ అనే వ్యాధి వచ్చిన వారికి స్మాల్ పాక్స్ వ్యాధి సోకేది కాదు.

ఈ విషయం గ్రహించిన ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ వ్యాధి బారిన పడ్డ వారి గాయం నుంచి వచ్చే చీము ను తీసుకోని స్మాల్ పాక్స్ వ్యాధి వచ్చిన వారి శరీరంలో ఇంజెక్ట్ చేశారు. ఫలితంగా స్మాల్ పాక్స్ వ్యాధి నుంచి కోలుకున్నారు.

ఆ సమయంలో జెన్నర్ కి అర్థము కానిది ఏంటంటే అసలు ఈ పద్దతి ఎలా పని చేసింది అని, కానీ రోగం తగ్గితే చాలు అనుకోని చాలా మంది జెన్నర్ చూపించిన పద్దతిని ఫాలో అయ్యారు.

ఈ విధంగా తయారు చేసిన వాక్సిన్ ను జెన్నర్ జేమ్స్ ఫిప్స్ అనే చిన్న బాబు కు ఇచ్చాడు. ఇలా 1796 సంవత్సరంలో ప్రపంచంలో మొట్ట మొదటి వాక్సిన్ ను కనుగొనడం జరిగింది.

ఈ విధంగా తయారు చేసిన వాక్సిన్ ను జెన్నర్ జేమ్స్ ఫిప్స్ అనే చిన్న బాబు కు ఇచ్చాడు. ఇలా 1796 సంవత్సరంలో ప్రపంచంలో మొట్ట మొదటి వాక్సిన్ ను కనుగొనడం జరిగింది.

అసలు వాక్సిన్ ఎలా పనిచేస్తుంది :

మన శరీరానికి ఎలాంటి సామర్థ్యము ఉంటుందంటే అది మన శరీరానికి ఉపయోగ పడే మరియు హాని చేసే సూక్ష్మజీవులను చాలా బాగా గుర్తు పడుతుంది.

ఎప్పుడైనా మన శరీరంలోకి హాని చేసే సూక్ష్మజీవులు ప్రవేశిస్తే మన ఇమ్యూన్ సిస్టం వాటిని గుర్తు పట్టి చంపేస్తాయి, ఈ ప్రక్రియ మన శరీరంలో తరచూ జరుగుతూ ఉంటుంది కానీ మనకు ఈ విషయం బయటికి కనిపించదు.

ఇమ్యూన్ సిస్టం ఎలా పని చేస్తుంది :

మన శరీరంలోని రక రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి, వాటిలో ఒక రకం లింఫోసైట్స్ . ఈ లింఫోసైట్స్ , మన శరీరంలో ప్రవేశించే వైరస్ మరియు బాక్టీరియా ను గుర్తు పడుతుంది. వైరస్ మరియు బాక్టీరియాల శరీరం పై యాంటిజెన్లు ఉంటాయి.

మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం లింఫోసైట్స్ సహాయం తో ఈ ఆంటిజెన్లను గుర్తుపట్టి ఆంటీబాడీస్ ను విడుదల చేస్తుంది.

ఆంటీబాడీస్ వైరస్ లేదా బాక్టీరియా యొక్క ఆంటిజెన్లను బంధించి వాటిని నాశనం చేస్తాయి. ఈ ప్రక్రియ వల్లనే మనము చాలా రకాల రోగాల బారిన పడకుండా ఉంటాము.

ఇమ్యూన్ సిస్టం బాక్టీరియా మరియు వైరస్ ను నాశనం చేస్తే మనకు వాక్సిన్ ఎందుకు అవసరం ?

కొన్ని రకాల సూక్ష్మజీవులను మన ఇమ్యూన్ సిస్టం గుర్తించలేదు ఫలితంగా ఆ సూక్ష్మ జీవులు మన శరీరంలోనే ఉండి ఒక భయంకర రోగానికి దారి తీస్తాయి

వాక్సిన్ ను మన శరీరంలో ఆంటీబాడీస్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

వాక్సిన్ లో ఇంతకూ ఏముంటుంది ?

వాక్సిన్ లో ఏముంటుందో చాలా మందికి తెలియదు, వాక్సిన్ మీరనుకున్నట్లు మందులతో తయారు చేయబడదు.

పైన జెన్నర్ కథ విన్నారుగా అదే ప్రకారంగా వాక్సిన్ ను తయారు చేస్తారు.

ఏదైనా ఒక భయంకరమైన రోగం బారిన మనము పడ్డప్పుడు మన ఇమ్యూన్ సిస్టం ఆంటీబాడీస్ తయారు చెయ్యదు.

అటువంటి సమయంలో రోగానికి కారణమైన వైరస్ ను తీసుకోని దానిని పార్శికంగా నాశనం చేస్తారు. ఇలా పార్శికంగా నాశనం అయిన వైరస్ ను వాక్సిన్ రూపంలో మన శరీరంలో ఇంజెక్ట్ చేస్తారు.

ఈ వాక్సిన్ లో ఉన్న వైరస్ మన శరీరానికి ఎటువంటి హాని కలిగించదు కానీ మన శరీరంలో ఆంటీబాడీస్ తయారు కావటానికి సమయం పడుతుంది.

ఈ ఆంటీబాడీస్ తయారు కావటానికి చాలా సమయం పడుతుంది, అది కొన్ని రోజులు కావొచ్చు లేదా కొన్ని సంవత్సరాలు కావొచ్చు.

వాక్సిన్ తయారు చేయడానికి అంత సమయం ఎందుకు పడుతుంది ?

ఎయిడ్స్ వ్యాధి గురించి మనందరం వినే ఉంటాం, ఇప్పటికి ఆ రోగానికి వాక్సిన్ రాలేదు ఎందుకంటే ఎయిడ్స్ కి కారణమైన వైరస్ తరచూ మ్యుటేషన్ కి గురి అవుతూ ఉంటుంది. అందుకే వాక్సిన్ ను తయారు చేయడం కష్టమవుతుంది.

ఎలాగైతే 2g సిమ్ 4G ఫోన్ లో రాదో అలాగే కొత్త మ్యుటేషన్ కి గురైన వైరస్ కు పాత వాక్సిన్ పనిచేయదు.

మ్యుటేషన్ ఎందుకు అవుతుంది ?

మ్యుటేషన్ ప్రాణం ఉన్న ప్రతి జీవంలో అవుతూ ఉంటుంది. కొన్ని మ్యుటేషన్ లో మనకు మంచివి, కొన్ని మనకు హాని కలిగిస్తాయి.

కణాలు విభజింప పడ్డప్పుడు వాట్ DNA లో కలిగే మార్పు వళ్ళ మ్యుటేషన్ జరుగుతుంది. వైరస్ లో కూడా మ్యుటేషన్ జరిగినప్పుడు ఒక కొత్త రకమైన వైరస్ ఉనికిలోకి వస్తుంది.

ఈ ఆర్టికల్ లో నేను వాక్సిన్ కు సంబంచించి దాదాపు అన్ని వివరాలు అందించాను. మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి.

Sources :
1.Diseases which have vaccines:
https://www.cdc.gov/vaccines/parents/diseases/forgot-14-diseases.html

2. Mutation and causes: https://www.ncbi.nlm.nih.gov/books/NBK21578/

3. Vaccine Discovery : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2279376/

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

1 Comment

Leave a Reply

Your email address will not be published.