What is Herd Immunity in Telugu -హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి ?

Image by Bruno /Germany from Pixabay

ఈ మధ్య కాలంలో మనము చాలా సార్లు హెర్డ్ ఇమ్మ్యూనిటీ గురించి చాలా సార్లు విని ఉంటాము. అసలు హెర్డ్ ఇమ్మ్యూనిటీ ఎలా పనిచేస్తుంది, ఏ రోగనికైనా ఇది పనిచేస్తుందా వంటి విషయాల గురించి తెలుసుకుందాము.

 హెర్డ్ ఇమ్మ్యూనిటీ : 

ఒక సముదాయంలో లేదా ఒక కమ్యూనిటీ లో చాలా వరకు ప్రజలు ఒక రోగానికి వ్యాధి నిరోధక శక్తి ని తయారుచేసుకోవడాన్ని హెర్డ్ ఇమ్మ్యూనిటీ అని అంటారు. 

హెర్డ్ ఇమ్మ్యూనిటీ ప్రక్రియ లో ఒక మనిషి శరీరంలోని  రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టం, శరీరం పై దాడి చేసే వైరస్ బాక్టీరియా నుంచి కాపాడుతుంది. 

మన శరీరం పై ఒక వైరస్ లేదా బాక్టీరియా దాడి చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టం ఆంటీబాడీస్ ను తయారు చేస్తుంది. ఈ ఆంటీబాడీస్ ఆ వైరస్ లేదా బాక్టీరియా ను చంపేస్తుంది.

కొన్నిసార్లు వైరస్ లేదా బాక్టీరియా ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఇమ్యూన్ సిస్టం బలంగా ఉన్నవారు మాత్రమే ఆంటీబాడీస్ తయారు చేయగలరు. 

ఇమ్యూన్ సిస్టం బలహీనంగా, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో మరియు చిన్న పిల్లలలో ఇమ్యూన్ సిస్టం ఆంటీబాడీస్ తయారు చేయలేక పోతుంది. ఫలితంగా వారు ఆ రోగము బారిన పడి చనిపోతారు.

హెర్డ్ ఇమ్మ్యూనిటీ 2 రకాలుగా  మన శరీరంలో తయారు అవుతుంది.

1 . సహజంగా (Natural) 

2 . వాక్సిన్ (Vaccination)

Natural :

ఈ పద్దతి లో సహజం గానే మనుషులు వ్యాధి బారిన పాడుతారు. వీరి ఇమ్యూన్ సిస్టం బలంగా ఉండటం వళ్ళ , వీరి శరీరంలో ఆంటీబాడీస్ తయారు అయ్యి వైరస్ లేదా బాక్టీరియా ను చంపేస్తుంది. 

Natural ఇమ్మ్యూనిటీ కోసం కావాలని ఒక భయంకర రోగం బారిన పడితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టం ఎంత బలంగా ఉందో మీకు తెలియదు.

Vaccine :

ఈ ప్రకియ లో డాక్టర్లు ఒక వ్యాధి నుంచి మనందరినీ కాపాడటానికి వాక్సిన్ తయారు చేస్తారు. ఈ వాక్సిన్ ను మనకు ఇచ్చినప్పుడు ఇది మన ఇమ్యూన్ సిస్టం ను ప్రేరేపించి ఆంటీబాడీస్ ను తయారు చేస్తుంది.

ఈ ఆంటీబాడీస్ ఆ వైరస్ లేదా బాక్టీరియా ను చంపి ఆ రోగం నుంచి  మనలను కాపాడుతుంది.

వాక్సిన్ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మరియు చిన్న పిల్లలకు వేయలేరు, అందుకే వాక్సిన్ తీసుకోని మనం ఆరోగ్యవంతులైతే మన నుంచి రోగం ఇతరులకు వ్యాప్తి చెందదు.

ఫలితంగా చిన్నపిల్లలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వ్యాధి బారిన పడకుండా ఉంటారు.

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

1 Comment

Leave a Reply

Your email address will not be published.