ఒక్క గ్యాలన్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి – How many liters in one gallon in Telugu ?

ఒక్క గ్యాలన్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి
Image by Gary G from Pixabay

మనము సాధారణంగా ద్రవ పదార్థలను లీటర్లలో కొలుస్తాము. పాలు, నీరు లాంటి ద్రవపదార్థలను మనము తరచూ లీటర్లలో కొలుస్తూ ఉంటాము.

మన దేశంలో లీటర్లల్లో కొలిస్తే ఇతర దేశాలలో వేరే ప్రమాణాలతో కొలుస్తారు. అమెరికా లో గ్యాలన్ విధానం ఉంది. అక్కడ ప్రజలు ద్రవ పదార్థలను గ్యాలన్ విధానంలో కొలుస్తారు.

అమెరికా లో దూరాన్ని కూడా కిలోమీటర్లలో కాకుండా మైళ్ళ లో కొలుస్తారు.

 గ్యాలన్ ప్రమాణాన్ని అమెరికాలో మరియు యూకే లో ఉపయోగిస్తారు.

సాధారణంగా ఒక్క గ్యాలన్ అంటే 3.7854 లీటర్లకు సమానం. 

గ్యాలన్ లో ప్రస్తుతం 3 రకాలు ఉన్నాయి.

1.ఇంపీరియల్  గ్యాలన్  

2.US లిక్విడ్ గ్యాలన్ 

3.US డ్రై గ్యాలన్ 

1) ఇంపీరియల్  గ్యాలన్ : ఈ ప్రమాణాన్ని యూకే లో ఉపయోగిస్తారు. యూకే లో ఒక్క గ్యాలన్ 4.54609 లీటర్ల కి సమానం.

2) US లిక్విడ్ గ్యాలన్  : అమెరికాలో ఉపయోగించే గ్యాలన్ ప్రకారం ఒక్క గ్యాలన్  3.7854 లీటర్లకు సమానం.

3) US Dry గ్యాలన్ : ఈ ప్రమాణం ప్రకారం ఒక్క గ్యాలన్ 4.4.5 లీటర్ల కు సమానం.    

Also read : ఒక్కరోజులో ఎన్ని లీటర్లు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది ? 

1 Comment

Leave a Reply

Your email address will not be published.