అరటిపండు వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు – 10 Amazing Banana health benefits in Telugu

Image by neo tam from Pixabay

ప్రపంచంలో కొన్ని పండ్లు కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతాయి కానీ కొన్ని పండ్లు మాత్రం సులువుగా ప్రపంచంలో అన్ని చోట్ల దొరుకుతుంది.

అరటి పండు ప్రపంచ వ్యాప్తంగా సులువుగా దొరుకుతుంది, ఒక సీజన్ అని కాకుండా సంవత్సరం మొత్తం మార్కెట్ లో కనిపిస్తూనే ఉంటుంది. 

ఈ అరటి పండు ధర కూడా ఎక్కువగా ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు దీనిని ఇష్ట పడుతారు. 

ఈ ఆర్టికల్ లో ఇలాంటి అరటిపండు గురించి సంబంధించిన 10 అద్భుతమైన ప్రయోజనాల గురించి చూద్దాము.

అరటిపండు కాయ గా ఉన్నప్ప్పుడు మరియు పండు గా ఉన్నప్పుడు వేరువేరు ప్రయోజనాలు ఉన్నాయి.

1. అరటి పండు లో ముఖ్యమైన విటమిన్ లు మరియు పోషకాలు ఉంటాయి 

ఒక మీడియం సైజు అరటి పండు లో 100 గ్రామ్ లకు కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి (1).

పేరు మొత్తం 
పొటాషియం (Potassium)358mg
శక్తి (Energy)89kcal
నీరు (Water)74.9g
మెగ్నీషియం (Magnesium)27mg
కార్బో హైడ్రేట్ (Carbohydrate)22.8g
ఫాస్ఫరస్ (Phosphorus)22mg
షుగర్ (Sugars)12.2g
ఖోలిన్ (Choline)9.8mg
విటమిన్ సి (Vitamin C)8.7mg
స్టార్చ్ (Starch)5.38g
కాల్షియం (Calcium)5mg
ఫైబర్ (Fiber)2.6g
ప్రోటీన్ (Protein)1.09g
సోడియం (Sodium)1mg
విటమిన్ బీ 6 (Vitamin B-6)0.367mg
కొవ్వు (fat)0.33g
మాంగనీస్ (Manganese)0.27mg
ఐరన్ (Iron)0.26mg
జింక్ (Zinc)0.15mg

2. అరటి పండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది 

పైన చూపిన విధంగా అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. పొటాషియం గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో సహాయపడుతుంది.    

కొన్ని అధ్యయనాల ప్రకారం పొటాషియం హై బ్లడ్ ప్రెషర్ (BP) ను నియంత్రిస్తుంది.పొటాషియం గుండె పోటు వచ్చే అవకాశాన్ని తగ్గించటానికి కూడా సహాయపడుతుంది (2) (3). 

3. అరటికాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

అరటిపండు, పండని లేదా కాయగా ఉన్నప్పుడు ఇది ఆకుపచ్చ రంగు లో ఉంటుంది. ఈ కాయ గట్టిగా మరియు చేదు గా ఉంటుంది.   

కాయ పండు గా మారే క్రమంలో ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగు లోకి మారుతుంది.  

అరటి కాయ లో  రెసిస్టన్స్ స్టార్చ్ (Resistance Starch) ఉంటుంది. ఈ రెసిస్టన్స్ స్టార్చ్ త్వరగా జీర్ణం అవ్వకుండా మన  కడుపు లో ఉండే మంచి బాక్టీరియా కు  ఆహారం గా మారుతుంది. 

ఫలితంగా జీర్ణ వ్యవస్థకు సంభందించిన జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది (4) (5).

4. అరటి పండు కిడ్నీ యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది 

పొటాషియం మన శరీరానికి చాలా ముఖ్యం, కూరగాయలు మరియు అరటిపండ్లు తినేవారికి పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.

ఇవికాకుండా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ తినే వారికి పొటాషియం సరైన మోతాదులో లభించటానికి అవకాశం ఉండదు. (6)

పొటాషియం మన శరీరంలోని కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది (7).    

5. అరటి పండు మన శరీర బరువు తగ్గించటంలో సహాయపడుతుంది 

అరటి పండు తింటే బరువు పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు మాత్రం మన శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయి.

అమెరికా లో 133,468 మగ ఆడవారి ని 24 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో వారు తీసుకునే పండ్లు కూరగాయలు వారి శరీర బరువును ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది చూడటం జరిగింది. 

ఈ పరిశోధనలో అరటిపండు కూడా బరువు తగ్గటానికి సహాయపడింది అని తేలింది (8) (9).  

 6. అరటిపండు లో అద్భుతమైన ఆంటియాక్సిడెంట్స్ ఉంటాయి 

అరటిపండు లో ఉండే ఆంటియాక్సిడెంట్స్ మన శరీరాన్ని దీర్ఘ కాలిక వ్యాదులైన కాన్సర్ మరియు గుండె కు సంబంచిన జబ్బుల నుంచి కాపాడుతాయి (10) (11).

7. అరటి పండు వ్యాయామానికి మంచి శక్తి ని ఇస్తుంది 

అరటి పండు మనకు తక్కువ ధర లో మార్కెట్ లో దొరుకుతుంది. దీని వల్ల వ్యాయామం చేసే వారికి మరియు  క్రీడాకారులకు  మంచి శక్తి ని ఇస్తుంది.

అరటి పండు సహన శక్తిని కూడా పెంచటంలో సహాయపడుతుంది. ఒక మీడియం సైజు అరటి పండు (118g) లో  27 g కార్బో హైడ్రేట్లు, 3.1 g ఫైబర్, 105 కెలోరీల శక్తిని ఇస్తుంది (12).  

8. అరటి పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది 

ఆస్టియోపొరాసిస్ అనే ఎముకలకు సంబంధించిన జబ్బు ఎముకలను బలహీన పరుస్తుంది. ఈ వ్యాధి క్రమ క్రమంగా పెరుగతూ ఉంది.

అరటి పండు లో ఉండే న్యూట్రిన్లు ఆస్టియోపొరాసిస్ (Osteoporosis) వ్యాధి ని నివారించటంలో సహాయపడుతుంది (13) (14).

9. అరటి కాయ ఇన్సులిన్ రెసిస్టన్స్ కొరకు సహాయపడుతుంది 

పండు గా మారని అరటి కాయ లో రెసిస్టన్స్ స్టార్చ్ (Resistant starch) 80 నుంచి 90 శాతం ఉంటుంది. అరటి కాయ పండు గా మారే క్రమంలో రెసిస్టన్స్ స్టార్చ్ షుగర్ గా మారుతుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం రెసిస్టన్స్ స్టార్చ్  ఇన్సులిన్  రెసిస్టన్స్ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీ  ను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. 

అయితే ఈ విషయం పై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అప్పుడే రెసిస్టన్స్ స్టార్చ్ గురించి ఇంకా తెలిసే అవకాశం ఉంది (15) (16).

10. అరటిపండు అల్సర్ వ్యాధి చికిత్స లో సహాయపడుతుంది 

అరటిపండు లో ఉండే నూట్రిన్ల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అరటి పండు అల్సర్ వ్యాధి నుంచి బాధపడుతున్న వారికి సహాయపడుతుంది (17) (18).

Also read : 10 Amazing Apple health benefits in Telugu

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

1 Comment

Leave a Reply

Your email address will not be published.