వీర్యం మరియు ఎగ్స్ సరిగ్గా కలవనప్పుడు ప్లసెంటా కి బదులు ఒక క్యాన్సర్ రహిత కణితి ఏర్పడుతుంది. ఈ కణితి ఎంబ్రియో యొక్క ఎదుగుదలకు సహాయపడదు ఫలితంగా ప్రెగ్నెన్సీ ముందుకు కొనసాగకుండా నిలిచిపోతుంది. దీనినే మోలార్ ప్రెగ్నన్సీ లేదా హైడాటిడిఫార్మ్ మోల్ అని అంటారు.
మోలార్ ప్రెగ్నన్సీ లో ఏర్పడ్డ కణితి యూట్రస్ లో ఎదుగుతుంది. ఈ కణితి యొక్క ఆకారం ద్రాక్షపండ్ల గుత్తి లాగా ఉంటుంది. ద్రవము తో నిండిన ద్రాక్షపండ్ల లాగా ఈ కణితి కనిపిస్తుంది.
మోలార్ ప్రెగ్నెన్సీ రెండు రకాలుగా ఉంటుంది. 1) Complete 2) Partial
కంప్లీట్ మోలార్ ప్రెగ్నన్సీ లో ప్లసెంటా అసాధారణంగా పెరుగుతుంది, ఫలితంగా ఎంబ్రియో కూడా ఏర్పడదు. ఈ ప్లసెంటా కణితి మాత్రం నార్మల్ పెగ్నన్సీ లో లాగానే HCG అనే ప్రెగ్నన్సీ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ప్రెగ్నన్సీ ఉందనే సంకేతాన్ని ఇస్తుంది కానీ నిజానికి యూట్రస్ లో ఒక కణితి ఉంటుంది.
పార్షియల్ మోలార్ ప్రెగ్నెన్సీ లో అసాధారణంగా పెరుగుతున్న ప్లసెంటా తో పాటు ఎంబ్రియో కూడా పెరుగుతుంది. ఈ కండిషన్ లో ఎంబ్రియో చాలా పుట్టుకతో కూడిన లోపాలను కలిగి ఉంటుంది. అలాగే పెరుగుతున్న కణితి ఎంబ్రియో యొక్క ఎదుగుదలకు సహకరించదు.
Table of Contents
మోలార్ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు ఏమిటి ?
- ఎక్కువ మోతాదులో HCG హార్మోన్ స్థాయిలు ఉండటం
- వాంతికి వచ్చినట్లు ఫీలింగ్ కలగటం లేదా వాంతులు అవ్వటం
- ప్రెగ్నన్సీ యొక్క మొదటి మూడు నెలలలోనే వజైనా నుంచి రక్త స్రావం జరగటం
- ప్రీఎక్లంప్సియా ఏర్పడటం, ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ప్రీఎక్లంప్సియా ఏర్పడుతుంది. ఈ కండీషన్ 20 వారాల ప్రెగ్నన్సీ తరవాత వస్తుంది.
- కడుపు యొక్క సైజు సాధారణ ప్రెగ్నన్సీ కన్నా త్వర త్వరగా పెరుగుతుంది
- కడుపులో ఉన్న ఎంబ్రియో యొక్క గుండె చప్పుడు వినబడక పోవటం
- వజైనా నుంచి ద్రాక్ష పండ్ల లాంటి కణితులు బయటికి వస్తాయి
- అనీమియా ఏర్పడుతుంది
ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్ టెస్టులు చేసిన తరవాత నిర్ధారణ చేస్తారు.
మోలార్ ప్రెగ్నన్సీ రావటానికి గల కారణాలు ఏమిటి ?
పురుషుడి వీర్యం మరియు మహిళ యొక్క ఎగ్ యొక్క కలయిక వల్ల ప్రెగ్నన్సీ ఏర్పడుతుంది. మహిళల్లో మరియు పురుషులలో అనేక సంఖ్యలో వీర్యం మరియు ఎగ్స్ ఉన్న ప్రెగ్నెంట్ అవ్వడానికి మాత్రం కేవలం 1 ఎగ్ మరియు 1 వీర్య కణం చాలు.
సాధారణంగా మనుషులలో 46 క్రామోసోములు ఉంటాయి. 23 క్రామోసోములు తల్లి నుండి మరియు 23 క్రామోసోములు తండ్రి నుండి వస్తాయి. దీనినే మనం జెనెటిక్ మెటీరియల్ అని అంటాము.
కంప్లీట్ మోలార్ ప్రెగ్నన్సీ లో ఖాళీగా ఉన్న ఒక ఎగ్ 1 లేదా 2 వీర్య కణాలతో కలిసి ఫెర్టిలైజ్ అవుతుంది. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ లో కేవలం తండ్రి యొక్క క్రామోసోములు మాత్రమే ఉంటాయి. తల్లి నుంచే వచ్చే క్రామోసోములు ఆక్టివ్ గా ఉండక పోవటం మరియు కేవలం తండ్రి యొక్క క్రోమోసోములు ఉండటం వల్ల ఈ కండీషన్ ఏర్పడుతుంది.
పార్షియల్ లేదా పాక్షిక మోలార్ ప్రెగ్నెన్సీ లో తల్లి క్రామోసోములు (23) ఉంటాయి అలాగే తండ్రి నుంచి వచ్చిన క్రామోసోములు రెండు జతలలో (46) ఉంటాయి. ఇలా మొత్తం 69 క్రామోసోములు ఉంటాయి. ఒక ఎగ్ తో 2 వీర్య కణాలు ఫర్టిలైజ్ అయినప్పుడు ఇలా 69 క్రామోసోములు ఏర్పడుతాయి.
సాధారణంగా ప్రెగ్నెన్సీ లో ప్లసెంటా బిడ్డ యొక్క లైఫ్ సపోర్ట్ గా ఉంటుంది కానీ మోలార్ ప్రెగ్నన్సీ లో మాత్రం ప్లసెంటా ఒక కణితి గా మారి ఎంబ్రియో యొక్క ఎదుగుదలను ఆపివేస్తుంది.
మోలార్ ప్రెగ్నన్సీ వయస్సు పై కూడా ఆధారపడే అవకాశం ఉంటుంది. 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా వయస్సు ఉన్న మహిళలలో మరియు 20 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలలో వచ్చే ఆస్కారం ఉంటుంది.
ఇవే కాకుండా ఇంతకూ ముందుకు మోలార్ ప్రెగ్నన్సీ, గర్భ స్రావం, సాధారణ ప్రెగ్నన్సీ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అయ్యి ఉంటే మోలార్ ప్రెగ్నన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.
మోలార్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ :
మీ శరీరంలో ఉన్న లక్షణాలను డాక్టర్ కు చెప్పిన తరవాత డాక్టర్ నిర్ధారించుకోవడానికి కొన్ని టెస్టులు చేయటం జరుగుతుంది.
మీ శరీర రక్తంలో ఉండే HCG హార్మోన్ ను టెస్ట్ చేయటం మరియు ఆల్ట్రాసౌండ్ చేయటం జరుగుతుంది.
కంప్లీట్ మోలార్ ప్రెగ్నన్సీ ఉంటే అల్ట్రా సౌండ్ లో
- ఎంబ్రియో కనిపించదు
- అమ్నియోటిక్ ద్రవం (ప్రెగ్నన్సీ లో బిడ్డ చుట్టూ ఉండే ద్రవము)
- ప్లసెంటా ఒక కణితి గా మారి యూట్రస్ లో వ్యాప్తి చెందటం
పాక్షిక మోలార్ ప్రెగ్నన్సీ ఉంటే అల్ట్రా సౌండ్ లో
- ఫీటస్ యొక్క సైజు ఉండాల్సిన సైజు కన్నా చిన్నగా ఉండటం
- అమ్నియోటిక్ ద్రవం తక్కువగా ఉండటం
- అసాధారణంగా పెరుగుతున్న ప్లసెంటా
చికిత్స :
సాధారణంగా అమ్మాయిలలో మోలార్ ప్రెగ్నన్సీ దానంతకు అదే అంతమవుతుంది. ద్రాక్ష పరిమాణంలో ఉన్న కణితులు వజైనా ద్వారా బయటికి వస్తాయి.
కొంతమంది అమ్మాయిలకు మాత్రం చికిత్స ద్వారా కణితి ని తీసివేయటం జరుగుతుంది.
References : 1) https://my.clevelandclinic.org/health/diseases/17889-molar-pregnancy 2) https://www.mayoclinic.org/diseases-conditions/molar-pregnancy/diagnosis-treatment/drc-20375180
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply