ఇప్పుడు మీరు మూడవ ట్రిమ్స్టర్ లోని ఆఖరి నెలలో ఉన్నారు అంటే మీ ప్రెగ్నన్సీ మొదలయ్యి 8 నెలలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీరు 9 వ నెలలో అడుగు పెట్టబోతున్నారు.
ఈ ఆఖరి నెలలో 38 వ వారం నుంచి 41 వ వారం వరకు మొత్తం నాలుగు వారాలు ఉంటాయి.
Table of Contents
ముప్పై ఎనిమిదవ వారం (Week 38) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 49.8 cm లు ఉంటుంది మరియు శరీర బరువు 3 kg లు ఉంటుంది. రెండవ ట్రిమ్స్టర్ బిడ్డ యొక్క చర్మానికి ఉన్న పలుచటి వెంట్రుకల పొర మాయమైపోతుంది. కొంత మంది పిల్లలలో మాత్రం పుట్టిన తరవాత కూడా అక్కడక్కడా వెంట్రుకలు కనిపిస్తాయి.
కడుపులో ఉన్నప్పుడు బిడ్డ మింగిన ఫ్లూయిడ్స్ కడుపులో ఒక గ్రీన్ స్లైమ్ లాగా జమ అయ్యి ఉంటుంది. బిడ్డ పుట్టిన తరవాత చేసే మొదటి మలంలో ఈ గ్రీన్ స్లైమ్ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది.
ముప్పై తొమ్మిదవ వారం (Week 39) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడువు 50.7cm లు ఉంటుంది మరియు ఫీటస్ యొక్క శరీర బరువు 3.3 kg లు ఉంటుంది. ఇంతవరకు పారదర్శకంగా ఉన్న చర్మం ఇప్పుడు ఒక కొత్త పొరను తయారు చేసుకుంటుంది. ఈ పొర శరీర పారదర్శకతను కవర్ చేస్తుంది.
బిడ్డ యొక్క చర్మానికి మైనం లాంటి ఒక జిడ్డు పదార్థం అతుక్కొని ఉంటుంది, ఇది డెలివరీ సమయంలో బిడ్డ సులువుగా బయటికి రావటంలో సహాయపడుతుంది.
40 వ వారం (Week 40) :
ఈ వారంలో ఫీటస్ 51.2cm లు ఉంటుంది మరియు శరీర బరువు 3.5kg లుగా ఉంటుంది. బిడ్డ యొక్క కదలికలు ఈ వారంలో కూడా కనిపిస్తాయి కానీ ఒక వేళ బిడ్డ యొక్క కదలికలు ఆగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
41 వ వారం (Week 41) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 3-4kg లుగా ఉంటుంది. ఈ వారంలో బిడ్డ పూర్తిగా తయారవుతుంది. డ్యూ డేట్ కన్నా ఒక వారం ఎక్కువగా అయినట్లయితే బిడ్డ చర్మం పై ఉండే జిడ్డు పొర కూడా తగ్గుతుంది. అందుకే బిడ్డ ఎరుపు రంగులో ఉంటుంది.
మీ శరీరంలో కలిగే మార్పులు :
ముప్పై ఎనిమిదవ వారంలో డాక్టర్ మీ కడుపు యొక్క సైజు చెక్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్ మరియు యురీన్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా ప్రీ-ఎక్లంప్సియా లాంటి ఏమైనా గర్భధారణ సమస్యలను తెలుసుకుంటారు.
ప్రీ-ఎక్లంప్సియా కండిషన్ లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అవ్వటం, కిడ్నీ మరియు లివర్ కి సంబంచిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ ద్వారా బిడ్డను కనాలి అని అనుకుంటే డాక్టర్ కి తెలియ జేయాలి.
ముప్పై తొమ్మిదవ వారంలో వజైనా నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ లక్షణం మీరు డెలివరీ కి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం.
40 వ వారంలో కూడా డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసి అంతా సరిగా ఉందొ లేదో చెక్ చేస్తారు. 41 వ వారంలో మీ ప్రెగ్నెన్సీ డ్యూ డేట్ కూడా అయిపోయి కూడా ఉండవచ్చు. మీ డాక్టర్ వజైనా లో వేలు పెట్టి చెక్ చేస్తూ ఉంటారు.
పురిటి నొప్పులు వచ్చిన తరవాత అప్పటి పరిస్థితి ని బట్టి నార్మల్ లేదా ఆపరేషన్ ద్వారా డెలివరీ అవుతుంది.
Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/1st-trimester/week-12/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/12-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply