ఆప్రికాట్ పండు తినటం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు – 7 Health benefits of Apricot

Apricot fruit uses
夏 沐沐 from Pixabay

ఆప్రికాట్ పండు చూడటానికి చిన్నగా ఉన్నా వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఆప్రికాట్ యొక్క శాస్త్రీయ నామం ప్రూనస్ అర్మేనియాకా (Prunus armeniaca) , ఈ పండు రోసేసి (Rosaceae) అనే ఒక పెద్ద ఫ్యామిలీ  కి చెందినది. 

ఈ ఆప్రికాట్ పండు యొక్క మూలం చైనా అయినా కాల క్రమేణా  అక్కడి నుంచి వివిధ దేశాలను వ్యాప్తి చెందింది. 

ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఈ పండు ను ఫ్రెష్ గా  ఉన్నప్పుడు, ఎండిన తరవాత డ్రై ఫ్రూట్ లాగా మరియు జామ్ లాగా కూడా తింటారు. 

ఈ పండు లో ఉండే పోషకవిలువలు పలు రకాల రోగాల నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది (1).   

 ఒక 100 గ్రాముల ఆప్రికాట్ లో కింద చూపిన విధంగా పోషకవిలువలు ఉంటాయి.

పేరుమొత్తం
శక్తి (Energy) 48cal
Vitamin A, IU1930IU
నీరు  (Water)86.4g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)11.1g
షుగర్  (Sugars)9.24g
సుక్రోజ్ (Sucrose)5.87g
గ్లూకోజ్ (Glucose)2.37g
ఫైబర్  (Fiber)2g
ప్రోటీన్ (Protein)1.4g
ఫ్రూక్టోజ్ (Fructose)0.94g
కొవ్వు (fat)0.39g
పొటాషియం (Potassium)259mg
ఫాస్ఫరస్ (Phosphorus)23mg
కాల్షియం (Calcium)13mg
మెగ్నీషియం  (Magnesium)10mg
Vitamin C10mg
కోలిన్ (Choline)2.8mg
సోడియం (Sodium)1mg
Vitamin E 0.89mg
కెరోటిన్ (Carotene)1090µg
క్రిప్టోక్సంతిన్ (Cryptoxanthin)104µg
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin)89µg

1.ఆప్రికాట్ లో ఎక్కువ మోతాదులో ఆంటియాక్సిడెంట్ లు ఉన్నాయి      

ఆప్రికాట్ పండు లో విటమిన్ C, విటమిన్ A, విటమిన్ E మరియు బీటా కెరోటిన్ లైన ఆంటియాక్సిడెంట్లు ఉంటాయి. ఆంటియాక్సిడెంట్ లు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ మన శరీరం లోని కణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల దీర్ఘ కాలిక  వ్యాదులకు దారి తీస్తుంది. 

2.ఆప్రికాట్ పండు కంటి రోగ్యానికి సహాయపడుతుంది. 

ఆప్రికాట్ లో ఉండే విటమిన్ A, బీటా కెరోటిన్ మరియు కెరోటినాయిడ్స్  కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. విటమిన్ A లోపం కారణంగా రేచీకటి అనే సమస్య బారిన పడతారు.

ఆప్రికాట్ లో ఉండే విటమిన్ A రేచీకటి నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. విటమిన్ E కూడా కంటిచూపు యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

ఈ పండు లో ఉండే లుటిన్ మరియు జియాక్సంతిన్  కంటికి సంబంధించిన మక్యూలర్ డిజెనెరేషన్ అనే డిసార్డర్ మరియు క్యాటరాక్ట్స్ (కంటి శుక్లాలు) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.  

3. ఆప్రికాట్ పండు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది 

ఆప్రికాట్ లో కరిగే ఫైబర్ (soluble fiber) మరియు కరగని ఫైబర్ (insoluble fiber) రెండూ ఉంటాయి. కరిగే ఫైబర్ జీర్ణ క్రియ ను నెమ్మదిస్తుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ లోని గట్ బాక్టీరియా ఎదుగుదలకు సహాయపడుతుంది. 

ఈ గట్ బాక్టీరియా ను మంచి బాక్టీరియా అని కూడా అంటారు. ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా ఊబకాయం నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. 

కరగని ఫైబర్ కూడా జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి మరియు స్టూల్ అంటే మలానికి సంబంచిన సమస్యలలో సహాయపడుతుంది.   

ఫైబర్ శరీరంలో షుగర్ లెవల్స్ లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.  

4. ఆప్రికాట్ పండు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాపడుతుంది 

ఆప్రికాట్ లో పొటాషియం మంచి మోతాదులో ఉంటుంది. ఒక 100 గ్రాముల ఆప్రికాట్ లో 259 మిల్లి గ్రాములు ఉంటుంది.  పొటాషియం నరాల మరియు కండరాల పని తీరు లో సహాయపడుతుంది. 

ఇది ఒక మంచి ఎలెక్ట్రోలైట్, శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలన్స్ ను నిర్వహించటంలో కూడా సహాయపడుతుంది.  

పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిచటంలో మరియు గుండె యొక్క ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

5. ఆప్రికాట్ చర్మం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది 

ఆప్రికాట్ లో ఉండే విటమిన్ C మరియు విటమిన్ E చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి మరియు UV కిరణాల నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది. ఇంతేకాకుండా చర్మం యొక్క ఎలాస్టిసిటీ ను ఉంచడానికి  మరియు చర్మం ముడతలు పడకుండా కాపాడటంలో కూడా సహాయపడుతుంది.   

ఆప్రికాట్ లో ఉండే బీటా కెరోటిన్ కూడా సన్ బర్న్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.  

6. ఆప్రికాట్ పండు ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది 

మన శరీరం లోని ఎముకలు దృడంగా ఉండాలన్న లేదా ఎముకలకు సంబంధించిన రోగాలకు దూరంగా ఉండాలన్నా కాల్షియం అవసరం. 

మనం రోజు తినే ఆహారం ద్వారా మన శరీరానికి కాల్షియం చేరుతూ ఉంటుంది. ఆప్రికాట్ లో ఉండే కాల్షియం మరియు పొటాషియం ఎముకల యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది     

7. ఆప్రికాట్ నూనె  

ఆప్రికాట్ గింజల నుంచి నూనె తీయటం జరుగుతుంది. ఈ నూనె చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది  

Sources :

Fiber : https://health.clevelandclinic.org/whats-the-difference-between-soluble-and-insoluble-fiber/

https://www.ncbi.nlm.nih.gov/labs/pmc/articles/PMC4190386/

https://www.ncbi.nlm.nih.gov/labs/pmc/articles/PMC8230439/

Also read :

సీతాఫలం పండు యొక్క 11 ఆరోగ్య ప్రయోజనాలు 

అంజీర్ పండు వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు

దానిమ్మ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు 

అరటిపండు వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు 

పసుపు వల్ల కలిగే 10 ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్ యొక్క 10 ఉపయోగాలు

కివీ ఫ్రూట్ ఉపయోగాలు

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.