గర్భం దాల్చిన తరవాత కొంతమందికి సజావుగా డెలివరీ అయిపోతుంది కానీ కొంత మందికి కొన్ని రకాల కాంప్లికేషన్స్ రావటం జరుగుతుంది. అందులోనిదే ఒక కాంప్లికేషన్ ప్రీఎక్లంప్సియా (Preeclampsia).
Table of Contents
ప్రీఎక్లంప్సియా అంటే ఏమిటి ?
బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉన్న అమ్మాయిలలో బ్లడ్ ప్రెషర్ ఉండటం, మూత్రం లో ఎక్కువ శాతం ప్రోటీన్లు ఉండటం లేదా ఇతర ఏదైనా అవయవం గాయపడినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది.
మూత్రం లో ఎక్కువ శాతం ప్రోటీన్లు ఉండటం కిడ్నీ డ్యామేజ్ అయ్యిందన్న సంకేతం ఇస్తుంది. ఈ కండీషన్ ప్రెగ్నెన్సీ లో 20 వ వారం లేదా 5 వ నెలలో ప్రారంభమవుతుంది. ఈ కండీషన్ తల్లీ మరియు బిడ్డకు చాలా ప్రమాదకరం కాబట్టీ వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలి.
మన దేశంలో ఇలాంటి కేసులు 10 లక్షల కన్నా తక్కువగానే ఉంటాయి.
ప్రీఎక్లంప్సియా యొక్క కండీషన్ లో సాధారణంగా డెలివరీ చేయటం జరుగుతుంది. ప్రీఎక్లంప్సియా యొక్క తీవ్రత మరియు ప్రెగ్నెన్సీ యొక్క నెల ను బట్టి మీ డాక్టర్ డెలివరీ చేయటం జరుగుతుంది. ప్రీఎక్లంప్సియా యొక్క చికిత్స చేసిన తరవాతే డెలివరీ కూడా చేయటం జరుగుతుంది.
ప్రీఎక్లంప్సియా యొక్క లక్షణాలు ఏమిటి ?
- బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరగటం అంటే 140/90 mmHg కన్నా ఎక్కువగా ఉండటం
- యూరీన్ లో ఎక్కువగా ప్రోటీన్లు ఉండటం లేదా ఇతర కిడ్నీ కి సంబంధించిన సమస్యలు ఉండటం.
- లివర్ ఎంజైములు పెరిగి లివర్ కి సంబంధిన సమస్యలు కలగటం
- రక్తం లోని ప్లేట్లెట్స్ తగ్గటం
- తక్కువ మోతాదులో యురీన్ రావటం
- ఊపిరితిత్తులలో ఫ్లూయిడ్ జమ అవ్వటం, ఊపిరి తీసుకోవటం ఇబ్బంది కలగటం
- తీవ్రమైన తలనొప్పి కలగటం
- కంటి చూపు లో మార్పు కనిపించటం, మసక మసక గా కనిపించటం
- కడుపులో రిబ్స్ కింద కుడివైపు నొప్పి కలగటం
- వాంతి లాంటి ఫీలింగ్ కలగటం లేదా వాంతులు అవ్వటం
ఈ పై తెలుపబడిన లక్షణాలతో పాటు అకస్మాత్తుగా శరీర బరువు పెరగటం లేదా ముఖం పై మరియు చేతులు వాపు కి గురి అవ్వటం జరుగుతుంది.
ప్రీఎక్లంప్సియా లక్షణాలు గమనిస్తే ఏం చేయాలి ?
పై తెలుపబడిన లక్షణాలలో కొన్ని లక్షణాలు సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో కనిపిస్తాయి. మీరు మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే ఈ లక్షణాల గురించి మీ డాక్టర్ ను సంప్రదించటం మంచిది. డాక్టర్ మిమ్మల్ని క్లినిక్ లో చెక్ చేసి నిజంగానే ఈ కండీషన్ ఉందొ లేదో చెబుతారు.
ప్రీఎక్లంప్సియా రావటానికి గల కారణాలు ఏమిటి ?
ప్రీఎక్లంప్సియా రావటానికి గల కచ్చితమైన కారణం చెప్పటం కష్టం కానీ అంచనా వేయవచ్చు. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యినప్పుడు బిడ్డ కు సరిపడ ఆహారం అందించడానికి ప్లసెంటా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ప్లసెంటా కడుపులో ఉండే బిడ్డకు ఒక లైఫ్ సపోర్ట్ గా పనిచేస్తుంది.
ప్లసెంటా నుంచి బిడ్డ ఒక నాళం గుండా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ నాళం లో ఉండే చిన్న నాళాల ద్వారా ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్లు చేరవేయబడతాయి. బిడ్డ యొక్క వ్యర్థాలు ఇదే నాళం ద్వారా బయటికి పంపించటం జరుగుతుంది.
ప్రీఎక్లంప్సియా కండీషన్ ఉన్న అమ్మాయిలో ప్లసెంటా కి కనెక్ట్ అయ్యి ఉన్న రక్త నాళాలు సరిగా అభివృద్ధి అవ్వకున్నా లేదా పనిచేయకపోయినా తల్లి శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రీఎక్లంప్సియా రావటానికి ఎక్కువగా అవకాశం ఉన్న కారణాలు
- ఇంతకు ముందు ప్రెగ్నన్సీ లో కూడా ప్రీఎక్లంప్సియా సమస్య వచ్చి ఉండటం
- కడుపులో ఒకటి కంటే ఎక్కువ బిడ్డలు (కవలలు) ఉన్నప్పుడు
- దీర్ఘకాలిక అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు
- ప్రెగ్నన్సీ కి ముందు టైపు 1 లేదా టైపు 2 డయాబెటిస్ ఉన్నప్పుడు
- కిడ్నీ కి సంబంచిన సమస్య ఉన్నప్పుడు
- IVF ప్రక్రియ ఎంచుకున్నప్పుడు
- ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వచ్చినప్పుడు
ప్రీఎక్లంప్సియా రావటానికి తక్కువ అవకాశం ఉన్న కారణాలలో
- ప్రీఎక్లంప్సియా కి సంబంధించిన ఫామిలీ హిస్టరీ ఉన్నప్పుడు
- అధిక బరువు
- ఇంతకు ముందు ప్రెగ్నెంట్ అయ్యి 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా అయినప్పుడు
- 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండటం
ప్రీఎక్లంప్సియా ఉందని ఎలా నిర్ధారణ చేయబడుతుంది ?
మీరు మీ డాక్టర్ కు హై బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్పినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్పే అవకాశం ఉంది.
బ్లడ్ టెస్ట్ :
ఈ టెస్ట్ ద్వారా లివర్ మరియు కిడ్నీ లు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకుంటారు. బ్లడ్ టెస్ట్ ద్వారానే ప్లేట్లెట్స్ యొక్క సంఖ్య కూడా చూడటం జరుగుతుంది.
యూరీన్ టెస్ట్ :
యురీన్ ను టెస్ట్ చేసి కిడ్నీ లు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవటం జరుగుతుంది.
ఫీటస్ ఆల్ట్రాసౌండ్ :
ఈ పద్దతి ద్వారా బిడ్డ యొక్క ఎదుగుదల మరియు బరువును తెలుసుకోవటం జరుగుతుంది. అలాగే యూట్రస్ లో ఉండే అమ్నియోటిక్ ద్రవం (amniotic fluid) ను చెక్ చేయటం జరుగుతుంది.
నాన్ స్ట్రెస్ టెస్ట్ :
ఈ టెస్ట్ ద్వారా బిడ్డ కదిలినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయటం జరుగుతుంది.
పై తెలుపబడిన టెస్టుల ద్వారా ప్రీఎక్లంప్సియా ఉందని రుజువు అయితే పలు రకాల కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంది.
ఫీటస్ యొక్క ఎదుగుదల :
ప్రీఎక్లంప్సియా కారణంగా ప్లసెంటా కి రక్తం తీసుకెళ్లే ధమనులు సరైన మోతాదులో రక్తం అందించక పోవటం వల్ల బిడ్డకు తక్కువ మోతాదులో రక్తం, ఆక్సిజన్ మరియు తక్కువ న్యూట్రియంట్లు అందుతాయి. ఫలితంగా ఫీటస్ నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.
బిడ్డ ముందుగా పుట్టడం :
ఈ కండీషన్ వల్ల డెలివరీ సమయం కన్నా ముందే చేయాల్సి ఉంటుంది. సుమారుగా ఎనిమిది నెలల సమయంలో డెలివరీ చేయటం జరుగుతుంది. సమయం కన్నా ముందే పుట్టే బిడ్డను ప్రీ టర్మ్ బర్త్ (premature) అని అంటారు. ప్రీ మెచూర్ గా పుట్టడం వల్ల బిడ్డ లో శ్వాస, చూపు, వినికిడి, ఫీడింగ్ కి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
అవయవాల డ్యామేజ్ :
ప్రీఎక్లంప్సియా కారణంగా కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల, గుండె, కళ్ళు లాంటి అవయవాలు గాయ పడే అవకాశం ఉంటుంది. ప్రీఎక్లంప్సియా ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ఇతర అవయవాలు ప్రభావితం చెందుతాయి.
గుండె కు సంబంధించిన వ్యాధి :
ప్రీఎక్లంప్సియా కారణంగా గుండె కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ సార్లు ప్రీఎక్లంప్సియా అవ్వటం వల్ల ఎక్కువ శాతం గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
కొంతమంది అమ్మాయిలలో బిడ్డకు జన్మనిచ్చిన తరవాత ప్రీఎక్లంప్సియా కండీషన్ ఏర్పడుతుంది. ఈ కండీషన్ ను postpartum ప్రీఎక్లంప్సియా అని అంటారు.
References : 1)https://www.mayoclinic.org/diseases-conditions/preeclampsia/symptoms-causes/syc-20355745 2) https://my.clevelandclinic.org/health/diseases/17952-preeclampsia 3) https://medlineplus.gov/ency/article/000898.htm
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply