చాలా వరకు మహిళలలో గర్భం దాల్చిన తరవాత వికారం లాంటి ఫీలింగ్ కలుగుతుంది. దీనినే మార్నింగ్ సిక్ నెస్ అని అంటారు. మార్నింగ్ సిక్ నెస్ కి సంబంధించిన లక్షణాలు సాధారణంగా ఉదయం సమయంలో కనిపిస్తాయి.
వికారం లేదా వాంతులు మాత్రం రోజు మొత్తంలో ఎప్పుడైనా కలిగే అవకాశం ఉంటుంది. కొంత మంది మహిళలో మాత్రం ప్రెగ్నన్సీ మొత్తం వికారం లాంటి ఫీలింగ్ కలుగుతుంది.
కొంతమంది మహిళలో మార్నింగ్ సిక్ నెస్ తీవ్ర రూపం దాల్చుతుంది ఫలితంగా అధికంగా వికారం మరియు వాంతులు కలుగుతాయి. ఈ కండిషన్ నే హైపెరెమెసిస్ గ్రావిడారం అని అంటారు.
హైపెరెమెసిస్ గ్రావిడారం కండిషన్ అంటే ఏమిటి ?
ఈ కండిషన్ లో తీవ్రమైన వికారం, వాంతులు, బరువు తగ్గటం మరియు ఎలెక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.. తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి విశ్రాంతి, ఆహారంలో మార్పులు మరియు అంటాసిడ్లు ఇవ్వటం జరుగుతుంది. తీవ్రమైన లక్షణాలతో భాదపడుతున్న మహిళలను డాక్టర్ లు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వమని చెప్పటం జరుగుతుంది.
హైపెరెమెసిస్ గ్రావిడారం కండిషన్ రావటానికి గల కారణాలు ఏమిటి ?
హైపెరెమెసిస్ గ్రావిడారం గల కారణం కచ్చితంగా ఇప్పటికి తెలియదు కానీ కొన్ని అంచనాల ప్రకారం హార్మోన్ లలో కలిగే మార్పుల వల్ల ఈ కండిషన్ ఏర్పడుతుంది.
గర్భం దాల్చిన 4 నుంచి 6 వారాలకు మొదలయ్యి 9 నుంచి 13 వ వారాలలో తీవ్ర రూపం దాల్చుతుంది. చాలా వరకు మహిళలు 14 నుంచి 20 వ వారం లోపు ఈ కండిషన్ నుంచి ఉపశమనం పొందుతారు.
ఇంతకు ముందే చెప్పినట్లు కొంతంమంది మహిళలు మాత్రం ప్రెగ్నన్సీ మొత్తం ఈ సమస్య తో భాదపడుతారు.
- హైపెరెమెసిస్ గ్రావిడారం కి గల లక్షణాలు ఏమిటి ?
- తీవ్రమైన వికారం మరియు వాంతుల వల్ల డీహైడ్రేషన్ కలగటం
- గర్భం దాల్చక ముందు ఉండే బరువు లో నుంచి 5% బరువు తగ్గటం
- తలనొప్పి మరియు అలిసిపోయినట్లు అనిపించటం
- మూత్రం తక్కువగా రావటం
- గుండె వేగంగా కొట్టుకోవటం, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉండటం
- అంక్సయిటి లేదా డిప్రెషన్ కలగటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు గమనించిన తరవాత వెంటనే డాక్టర్ ను సంప్రదించటం మంచిది.
References :https://americanpregnancy.org/healthy-pregnancy/pregnancy-complications/hyperemesis-gravidarum/ https://www.mayoclinic.org/diseases-conditions/morning-sickness/diagnosis-treatment/drc-20375260 https://www.stanfordchildrens.org/en/topic/default?id=hyperemesis-gravidarum-90-P02457https://www.nhs.uk/pregnancy/related-conditions/complications/severe-vomiting/ https://www.pregnancybirthbaby.org.au/severe-vomiting-during-pregnancy-hyperemesis-gravidarum https://my.clevelandclinic.org/health/diseases/12232-hyperemesis-gravidarum-severe-nausea–vomiting-during-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply