ప్రతి అమ్మాయి శరీరంలో ఒవ్యులేషన్ ప్రక్రియ పీరియడ్స్ రావటానికి ముందు జరుగుతుంది.
ఈ ప్రక్రియ లో ఓవరీల నుంచి ఒక మెచూర్ అయిన ఎగ్ విడుదల అవుతుంది. ఓవరీల నుంచి విడుదల అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ గుండా మెల్లగా తన ప్రయాణం చేస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్ లో ఎగ్ 12 నుంచి 24 గంటల సమయం వరకు ఉంటుంది. ఈ ప్రక్రియ నే ఒవ్యులేషన్ అని అంటారు.
ఈ 12 నుంచి 24 గంటల సమయాన్ని ఫర్టిలిటీ విండో అని కూడా అంటారు. ఈ సమయంలో ఫాలోపియన్ ట్యూబ్ లో వీర్యం ఉన్నట్లయితే వీర్యం మరియు ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్ విడుదల అయిన సమయంలో వీర్యం అక్కడ లేకపోతే యధావిధిగా మీ యూట్రస్ లైన్ విఛ్చిన్నం అయ్యి పీరియడ్స్ వస్తాయి.
ఒక్క మాటలో ఒవ్యులేషన్ అంటే ప్రతీ నెల మీ శరీరంలోని ఓవరీల నుంచి ఒక ఎగ్ విడుదల అవ్వటాన్ని అంటారు. ఒవ్యులేషన్ సమయంలో శృంగారంలో పాల్గొంటే మీరు గర్భం దాల్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా శృంగారం చేసిన తరవాత వీర్యం ఫాలోపియన్ ట్యూబ్స్ లో 5 రోజుల దాకా ఉండగలుగుతుంది.
ఉదాహరణకి మీరు ఒవ్యులేషన్ అయ్యే సమయం కన్నా రెండు రోజులు ముందు శృంగారం లో పాల్గొంటే వీర్యం ఫాలోపియన్ ట్యూబ్ లో ఉండి, ఎగ్ విడుదల అయిన తరవాత ఫెర్టిలైజ్ అవుతుంది.
మీరు గర్భం దాల్చాలి అనుకుంటే ఒవ్యులేషన్ అయ్యే సమయం లో లేదా రెండు నుంచి మూడు రోజులు ముందు శృంగారం లో పాల్గొనాలి.
అలాగే పిల్లలు ఇప్పుడే వద్దు అనుకునే వారు ఒవ్యులేషన్ జరిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Table of Contents
ఒవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో ఎలా తెలుసుకోవాలి ?
ప్రతి అమ్మాయిలో మెన్స్ట్రువల్ సైకిల్ వేరు వేరుగా ఉంటుంది. 21 రోజులు, 28 రోజులు మరియు 35 రోజులు అని వేరు వేరుగా ఉంటుంది.
ఒవ్యులేషన్ మీ పీరియడ్స్ రావటానికి 14 రోజులు ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. మీ మెన్స్ట్రువల్ సైకిల్ 28 రోజులదైతే 14 (14+14)వ తారీఖు ఎగ్ విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 21 రోజులు మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న అమ్మాయిలలో 7 (7+14 =21) వ తారీఖు న ఒవ్యులేషన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇలా మీ మెంట్రువల్ సైకిల్ ను బట్టి ఒవ్యులేషన్ డేట్ ను అంచనా వేయవచ్చు. ఇంటర్నెట్ లో చాలా వెబ్ సైట్ లు ఒవ్యులేషన్ డేట్ ను అంచనా వేస్తాయి.
మీరు ఒవ్యులేషన్ కాలిక్యులేటర్ అని సెర్చ్ చేసి మీ పీరియడ్ స్టార్ట్ అయ్యే డేట్ ఎంటర్ చేస్తే ఒవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో మరియు మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్న రోజులను చూపిస్తుంది.
ఒవ్యులేషన్ లక్షణాలు :
Cervical మ్యూకస్ :
ఒవ్యులేషన్ అవ్వ్వబోతుంది అన్న సమయంలో మీ వజైనా నుంచి ఎగ్ వైట్ లాంటి స్పష్టమైన మరియు సాగే గుణం కల స్రావాలు వస్తాయి. దీనిని ఇంగ్లీష్ లో సర్వికల్ మ్యూకస్ అని అంటారు. ఒవ్యులేషన్ అయిపోయిన తరవాత మ్యూకస్ క్రమ క్రమంగా తగ్గిపోతుంది.
బేసల్ బాడీ టెంపరేచర్ :
సరిగ్గా ఒవ్యులేషన్ అవుతుంది అన్న సమయంలో మీ శరీర ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులను మీరు తెలుసుకోవాలంటే ఒక ప్రత్యేక థర్మామీటర్ ను కొనుక్కోవాలి. సాధారణ థర్మామీటర్ స్వల్ప మార్పులను చూపించదు.
ఈ థర్మామీటర్ ను రోజు ఉదయం ఏ పని చేయకుండా శరీరం రెస్ట్ లో ఉన్నప్పుడు చెక్ చేయాలి. ప్రతి రోజు ఒక పేపర్ పై రీడింగ్ ను రాసుకుంటే ఉష్ణోగ్రతలో కలిగే మార్పులు మీరు వెంటనే గమనించవచ్చు. ఒవ్యులేషన్ తరవాత temperature 36.4°C నుంచి 37°C వరకు ఉంటుంది
వీటితో పాటు మార్కెట్ లో ఒవ్యులేషన్ కిట్లు కూడా దొరుకుతాయి. అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్క కిట్ లో 5 నుంచి 7 స్టిక్ లు ఉంటాయి. ఈ స్టిక్ లను ఉపయోగించి 3 నుంచి 5 రోజులు టెస్ట్ చేస్తే ఒక రోజు పాజిటివ్ గా చూపిస్తుంది. పాజిటివ్ గా చూపించిన 36 గంటల తరవాత మీకు ఒవ్యులేషన్ అయ్యే అవకాశం ఉంటుంది.
References : https://www.mayoclinic.org/healthy-lifestyle/getting-pregnant/in-depth/how-to-get-pregnant/art-20047611 https://www.yourfertility.org.au/everyone/timinghttps://medlineplus.gov/ency/article/007062.htm https://www.sart.org/patients/a-patients-guide-to-assisted-reproductive-technology/general-information/assisted-reproductive-technologies/ https://www.uofmhealth.org/healthlibrary/hw202058#:~:text=Before%20ovulation%2C%20a%20woman%E2%80%99s%20BBT,before%20getting%20out%20of%20bed. https://www.sciencedirect.com/topics/nursing-and-health-professions/basal-body-temperature
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply