జామ పండు ను ఇంగ్లీష్ లో గువవా(Guava) అని అంటారు. జామ పండు యొక్క శాస్త్రీయ నామం సిడియం గుజావ (Psidium guajava). ప్రపంచ వ్యాప్తంగా జామపండు యొక్క ఉత్పత్తి 55 మిలియన్ టన్నులు అయితే ఇందులో 22 మిలియన్లు అంటే దాదాపు 45% కేవలం మన భారత దేశంలో ఉత్పత్తి చేయబడుతుంది (1)
జామ పండు లో ఉండే ఔషధ గుణాల కారణంగా పురాతన కాలం నుంచే దీనిని పలు రోకాల రోగాల కోసం ఉపయోగించేవారు. జామ పండుని పండించటం కూడా చాలా సులువు, వివిధ రకాల నెలలలో మరియు వాతావరణ పరిస్థుతులలో కూడా లక్షణంగా పండించవచ్చు.
ఒక 100 గ్రాముల జామపండులో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి (2).
పేరు | మొత్తం |
శక్తి (Energy) | 68kcal |
Vitamin A, IU | 624IU |
నీరు (Water) | 80.8g |
కార్బో హైడ్రేట్ (Carbohydrate) | 14.3g |
షుగర్ (Sugars) | 8.92g |
ఫైబర్ (Fiber) | 5.4g |
ప్రోటీన్ (Protein) | 2.55g |
కొవ్వు (fat) | 0.95g |
పొటాషియం (Potassium) | 417mg |
Vitamin C | 228mg |
ఫాస్ఫరస్ (Phosphorus) | 40mg |
మెగ్నీషియం (Magnesium) | 22mg |
కాల్షియం (Calcium) | 18mg |
కోలిన్ (Choline) | 7.6mg |
సోడియం (Sodium) | 2mg |
Vitamin E | 0.73mg |
లైకోపీన్ (Lycopene) | 5200µg |
బీటా కారోటీన్ Beta carotene | 374µg |
Vitamin K | 2.6µg |
ఇప్పుడు జామ పండు మరియు ఆకుల ఉపయోగాలను చూద్దాము
Table of Contents
1.జామ పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
జామ పండులో ఉండే ఫైబర్ మరియు పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో దోహదపడుతుంది.
ఒక పరిశోధనలో బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్న 145 మందిని రెండు గ్రూప్ లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో 73 మందిని పెట్టడం జరిగింది.
నాలుగు వారాల తరవాత వీరిలో బ్లడ్ ప్రెషర్ తగ్గటాన్ని, కొవ్వు శాతం తగ్గటాన్ని మరియు తక్కువ శాతం లో HDL అంటే మంచి కొలెస్ట్రాల్ పెరగటం గమనించటం జరిగింది (3).
జామ పండు తో పాటు జామ చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. చాలా మంది లేత జామ ఆకులను చింతపండు తో కలిపి తింటారు, చాలా రుచిగా కూడా ఉంటుంది.
కొన్ని జంతువుల మీద జరిపిన పరిశోధనల ప్రకారం జామ చెట్టు ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటాని గమనించటం జరిగింది (4).
2. జామ పండు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది
ఒక పరిశోధన ప్రకారం ప్రతి రోజు 100 గ్రాముల జామ చెట్టు యొక్క ఆకుల డికాషన్ తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ మరియు కడుపు కు సంబంచిన క్యాన్సర్ ల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది (5)
జామ పండు లో ఉండే అంటి యాక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతుంది. ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో మరియు దెబ్బ తిన్న DNA ను బాగు చేయటానికి సహాయపడుతుంది (6).
3. జామ పండు చర్మానికి సంబంచిన రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
పలు దేశాలలో జామ పండు యొక్క లేత రెమ్మలను చర్మానికి సంబంచిన వ్యాధులను నయం చేయటంలో వినియోగిస్తారు (7)
జామ పండు ఆకులో ఉండే ఆంటీబాక్టీరియల్ గుణాల కారణంగా చర్మానికి సంబంచిన వివిధ సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
చర్మానికి కాలిన గాయాలు లేదా కోసుకు పోవటం వల్ల కలిగే గాయాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడటంలో జామ పండు ఆకుల ఎక్స్ట్రాక్ట్ సహాయపడుతుంది (8).
4. జామ పండు జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
జామ పండు లోని ఔషధ గుణాల కారణంగా జీర్ణ వ్యవస్థ కు సంబంచిన ఇన్ఫెక్షన్స్ అయిన అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి లాంటి సమస్యల కోసం సాంప్రదాయక చికిత్స గా వినియోగిస్తారు (9).
జామ పండు ఆకులు చర్మానికి కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యలకు కూడా సహాయపడుతుంది. ఇండియా లోని పలు ప్రాంతాలలో జామ చెట్టు యొక్క ఆకులను జీర్ణ వ్యవస్థకు సంభందించిన రోగాల కోసం వినియోగించటం జరుగుతుంది(10).
ఎలుకల పై జరిగిన పరిశోధనల ప్రకారం జామ చెట్టు ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ డయేరియా అంటే విరేచనాల సమస్య నుంచి కాపాడటంలో మరియు డయేరియా తీవ్రతను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇంతే కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే జీర్ణాశయం లో కలిగే పుండు నయం చేయటం లో సహాయపడుతుంది (11) (12).
5. జామ పండు కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
జామపండు లో ఉండే విటమిన్ C కంటి చూపుని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది మరియు వయసు పై బడిన వారిలో కంటికి సంబంచిన సమస్యలైనా మక్యూలర్ డిజనరేషన్ మరియు క్యాటరాక్ట్స్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది (13).
6. జామ పండు శరీరంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది
ఇండియా లోని పలు ప్రాంతాలలో జామ పండు మరియు ఆకులను డయాబెటిస్ కోసం ఒక రెమెడీ గా ఉపయోగించటం జరుగుతుంది(14) (15).
కొన్ని ఎలుకల పై జరిగిన పరిశోధనల ప్రకారం కూడా జామ పండు శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది(16).
ఇంకో 40 మంది పై జరిగిన క్లినికల్ ట్రయల్ లో జామ పండు బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. జపాన్ లో మంచి ఆరోగ్యం కోసం జామ చెట్టు యొక్క ఆకుల తో తయారు చేయబడ్డ టీ ను అమ్మటం కూడా జరుగుతుంది (17) (18).
7. జామ పండు మహిళలకు పీరియడ్స్ లో ఉపశమనమా ఇవ్వటంలో సహాయపడుతుంది
పలు దేశాలలో జామ పండు, వీటి ఆకులను మరియు ఆకుల యొక్క డికాషన్ ను నొప్పి తో కూడిన పీరియడ్స్ ను తగ్గించటానికి వినియోగిస్తారు (19).
ఒక పరిశోధనలలో 197 మహిళలపై జరిగిన ట్రయల్స్ ప్రకారం జామపండు యొక్క ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ పీరియడ్స్ లో వచ్చే కడుపు నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది అని తెలిసింది(20).
8. జామ పండు యొక్క ఆకులు పంటి యొక్క నొప్పిని తగ్గించటం లో సహాయపడుతుంది
ఇండియా లోని ఉత్తర సిక్కిం లో జామ చెట్టు యొక్క లేత ఆకులను పంటి నొప్పిని తగ్గించడానికి మరియు నోటి యొక్క అల్సర్ లను తగ్గించటానికి ఉపయోగించటం జరుగుతుంది (21).
ల్యాబ్ లో జరిగిన పరిశోధనల ప్రకారం జామ చెట్టు యొక్క ఆకులలో ఉండే ఆంటీ బాక్టీరియల్ గుణాలు నోటి వ్యాధికారకాల నుంచి కాపాడటంలో మరియు ఇతర దంత సమస్యలైనా డెంటల్ కెరీస్ (dental caries) మరియు డెంటల్ ప్లేక్స్ (dental plaques) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది (22) (23).
Also read :
దానిమ్మ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు
అరటిపండు వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు
పసుపు వల్ల కలిగే 10 ప్రయోజనాలు
డ్రాగన్ ఫ్రూట్ యొక్క 10 ఉపయోగాలు
జామ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply