అవొకాడో తినటం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు – 10 Avocado health benefits in Telugu

Avocado benefits and uses
Credits : Steve Buissinne from Pixabay

అవొకాడో  ను తెలుగు లో కూడా అవొకాడో అని అంటారు, అవొకాడో యొక్క శాస్త్రీయ నామం పర్సియా అమెరికాన. 

అవొకాడో కి మెక్సికో మరియు సెంట్రల్ అమెరికా మూలం, ప్రపంచం లో ఉండే మొత్తం అవొకాడో లో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు.  

సాధారణంగానే  పండ్లు కూరగాయలు మన ఆరోగ్యానికి మంచివి. వివిధ రోగాల బారిన పడకుండా ఉండటానికి సహాయపడతాయి.   

అవొకాడో పియర్ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారం లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. 

దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం కఠినంగా ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. బాగా పండిన అవొకాడో మాత్రం పర్పల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. 

దీని యొక్క రుచి కొంచెం తియ్యగా మరియు బట్టర్ లాగా ఉంటుంది, ఒకసారి తింటేనే అసలు రుచి మనకు తెలుస్తుంది (1).

1.అవొకాడో లో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి.  

100 గ్రాముల అవొకాడో లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి.

పేరుమొత్తం
శక్తి (Energy) 160cal
Vitamin A, IU146IU
నీరు  (Water)73.2g
కొవ్వు (fat)14.7g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)8.53g
ఫైబర్  (Fiber)6.7g
ప్రోటీన్ (Protein)2g
షుగర్  (Sugars)0.66g
పొటాషియం (Potassium)485mg
ఫాస్ఫరస్ (Phosphorus)52mg
మెగ్నీషియం  (Magnesium)29mg
కోలిన్ (Choline)14.2mg
కాల్షియం (Calcium)12mg
Vitamin C10mg
సోడియం (Sodium)7mg
Vitamin E 2.07mg
జింక్ (Zinc)0.64mg
ఐరన్ (Iron)0.55mg
Vitamin B-60.257mg
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin)271µg

2. అవొకాడో కంటి రోగ్యానికి సహాయపడుతుంది 

అవొకాడోస్ లో మంచి ఆంటియాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. వీటిలో కెరోటినాయిడ్స్ లైన లుటిన్ మరియు జియాక్సంతిన్ మన కంటికి హాని ని కలిగించే కిరణాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. 

అంతే కాకుండా  వయసు తో పాటు వచ్చే జబ్బులైన మక్యూలర్ డిజెనెరేషన్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

అందుకే మంచి ఆంటియాక్సిడెంట్ లు ఉండే ఆహారం వయసుతో పాటు వచ్చే జబ్బులను తగ్గించటంలో సహాయపడుతుంది.   

3. అవొకాడో అల్జిమర్స్ వ్యాధి నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.   

వయసు తో పాటు వచ్చే రోగాలలో ఒకటి అల్జిమర్స్, ఈ వ్యాధి కారణంగా జ్ఞాపక శక్తి కోల్పోవటం వల్ల చాలా మంది భాదపడుతూ ఉంటారు.

అవొకాడో లో ఉండే విటమిన్ E  అల్జిమర్స్ వ్యాధి కి వ్యతిరేకంగా పనిచేయటంలో మరియు వయసు తో పాటు వచ్చే జ్ఞాపక శక్తికి సంబంచిన సమస్యలను నెమ్మదిస్తుంది.  

4.అవొకాడో గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

కొన్ని పరిమితమైన పరిశోధనల ప్రకారం మన శరీర కొవ్వు శాతాన్ని తగ్గించటంలో మరియు రక్తం లోని ట్రైగ్లిజరాయిడ్లు (రక్తం లోని కొవ్వు ) ను తగ్గించటంలో సహాయపడుతుంది.

ఇవేకాకుండా మన శరీరంలోని చెడ్డ కొవ్వు అయినా (LDL) ను తగ్గించటంలో మరియు మంచి కొవ్వు అయినా (HDL) ను  పెంచటంలో సహాయపడుతుంది.   

5. అవొకాడో ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది  

మనలో చాలా మందికి వయసు పెరిగే కొద్దీ ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి భాదపడుతూ ఉంటారు. అవొకాడో లో ఉండే విటమిన్ K ఎముకలకు సంబంధించిన రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

అవొకాడో తినటం వల్ల ఎముకలు ఫ్రాక్చర్ అవ్వకుండా ఉండటంలో సహాయపడుతుంది.   

6.అవొకాడో శరీర బరువుని తగ్గించటంలో సహాయపడుతుంది 

అవొకాడో లో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్ శరీర బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. అవొకాడో లో ఉండే ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ ను కలిగిస్తుంది మరియు త్వరగా ఆకలి వేయకుండా ఉండటంలో కూడా సహాయపడుతుంది.  

7. అవొకాడో మంచి జీర్ణ వ్యవస్థ కు సహాయపడుతుంది 

100 గ్రాముల అవొకాడో లో దాదాపు 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ కు సంబంధించిన సమస్యలైనా కాన్స్టిపేషన్ (మలబద్దకం) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.  

8. అవొకాడో లో పుష్కలంగా పొటాషియం ఉంటుంది 

ఒక 100 గ్రాముల అవొకాడో లో 485 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియం హై బ్లడ్ ప్రెషర్ ను మరియు గుండె పోటు ను తగ్గించటంలో సహాయపడుతుంది. పొటాషియం ను తగినంత మోతాదులో తీసుకున్నట్లైతే డయాబెటిస్ ను కూడా తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. 

కొన్ని పరిశోధనల ప్రకారం పొటాషియం కిడ్నీ యొక్క ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.  

9. అవొకాడో క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది 

అవొకాడో పండు క్యాన్సర్ కి సంబంచిన కణాలకు వ్యతిరేకంగా పనిచేయటం లో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం అవొకాడో లో ఉండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్ కణాల ఎదుగుదలను ఆపటంలో సహాయపడుతుంది.  

ప్రస్తుత పరిశోధనలు పరిమితంగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ స్థాయిలో హ్యూమన్ ట్రయల్స్ జరిగితే ఎక్కువ సమాచారం వీటి గురించే వచ్చే అవకాశం ఉంది.

10.అవొకాడో చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది 

వయసు తో పాటు మన చర్మం ముడతలు పడటం మరియు చర్మానికి సంబంధించిన రోగాల బారిన పడుతుంది. చర్మం యొక్క ఆరోగ్యానికి పండ్లు మరియు ఆకు కూరగాయలు అవసరం. అవొకాడో కూడా చర్మ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

అవొకాడో  లో ఉండే లుటిన్ మరియు జియాక్సంతిన్ మన చర్మాన్ని UV కిరణాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. ఇవే కాకుండా చర్మం యొక్క ఎలాస్టిసిటీ ను కొనసాగించడానికి కూడా సహాయపడుతుంది.  

పండ్లు మరియు ఆకూ కూరగాయలు మన చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.  

Also read :

దానిమ్మ పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు 

అరటిపండు వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు 

పసుపు వల్ల కలిగే 10 ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్ యొక్క 10 ఉపయోగాలు

కివీ ఫ్రూట్ ఉపయోగాలు

ఆప్రికాట్ యొక్క 10 ఉపయోగాలు

Sources :

Vitamin E : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3997530/

Vitamin K : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4600246/

Potassium : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4963920/ 

Cancer : https://pubmed.ncbi.nlm.nih.gov/17582784/

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3664913/

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.