నాల్గవ నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు – Fourth month pregnancy symptoms in Telugu

నాల్గవ నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు - Fourth month pregnancy symptoms in Telugu
Image by Pete Linforth from Pixabay

మూడు నెలలు పూర్తి చేసుకున్న తరవాత మీరు రెండవ ట్రిమ్స్టర్ లోకి అడుగుపెడతారు. మొదటి ట్రిమ్స్టర్ లా కాకుండా రెండవ ట్రిమ్స్టర్ 13 నుంచి 27 వ వారం వరకు ఉంటుంది.  రెండవ ట్రిమ్స్టర్ లో 12 వారాలు కాకుండా 15 వారాలు ఉంటాయి. 

పదమూడవ వారం (Week 13) :

ఈ వారంలో ఫీటస్ 7.4 cm పొడవుగా ఉంటుంది, పిండం యొక్క సైజు పీచ్ పండు అంత ఉంటుంది మరియు ఫీటస్ యొక్క బరువు 25 గ్రాములు ఉంటుంది. 

ఫీటస్ అమ్మాయి అయితే ఓవరీలు పూర్తిగా తయారవుతాయి ఒకవేళ ఫీటస్ అబ్బాయి అయితే వృషణాలు (testes) పూర్తిగా తయారయ్యి ఉంటాయి. కడుపులో పిండం అటూ ఇటూ కదులుతూ ఉంటుంది, ఈ కదలికలు మీరు అప్పుడే గమనించలేరు. 17 వ వారంలో బిడ్డ కదలటం గమనిస్తారు. 

ఇదే సమయంలో పిండం తన బొటనవ్రేలును నోట్లో పెట్టుకొని పీల్చటం మొదలుపెడుతుంది, ఇలా చేయటం ద్వారా బిడ్డ పుట్టిన తరవాత పాలు తాగేటప్పుడు సహాయపడుతుంది. 

పదనాల్గవ వారం (Week 14) :

ఈ వారంలో ఫీటస్ 8.5 సెంటీ మీటర్లు ఉంటుంది, పిండం యొక్క సైజు కివీ పండు అంత ఉంటుంది.    

ముందు పెద్దగా ఉన్న తల మిగతా శరీరం తో పాటు ఆకారం లోకి వస్తుంది. ఈ వారంలో ఫీటస్ తన చుట్టూ ఉన్న అమ్నియోటిక్  ఫ్లూయిడ్ లో నుంచి కొంచెం మింగుతుంది.  ఇలా ఫీటస్ కడుపులోకి వెళ్లిన ఈ ఫ్లూయిడ్ ను కిడ్నీలు యూరీన్ రూపంలో బయటికి పంపిస్తుంది.   

పదిహేనవ వారం (Week 15) : 

ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 10 సెంటీమీటర్లు ఉంటుంది మరియు ఆకారం ఆపిల్ సైజు అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు మాత్రం కేవలం 70 గ్రాములు ఉంటుంది.

ఇదే వారంలో  ఫీటస్ యొక్క శరీరం మొత్తం పై మృదువైన వెంట్రుకలు పెరగటం మొదలవుతాయి. కనుబొమ్మలు మరియు కనురెప్పలు కూడా క్రమంగా పెరుగుతూ ఉంటాయి.    

ఇదే వారంలో ఫీటస్ వినటం కూడా మొదలుపెడుతుంది. మీరు ఏదైనా మాట్లాడితే ఫీటస్ వినే అవకాశం ఉంటుంది.  మీ గుండె చేసే చప్పుడు మరియు జీర్ణ వ్యవస్థ చేసే చప్పుడు కూడా వింటుంది.  ఫీటస్ యొక్క కళ్ళు కూడా లైట్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.  

పదహారవ వారం (Week 16) :

ఈ వారంలో ఫీటస్ యొక్క పొడువు 11.6 cm  ఉంటుంది మరియు ఆయాకారం అవొకాడో అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు ఈ వారంలో 100 గ్రాములు ఉంటుంది.  

ఈ వారంలో ఫీటస్ యొక్క ముఖం లో ఎక్స్ప్రెషన్స్ (ముఖ కవళికలు) కనిపిస్తాయి కానీ ఫీటస్ కి కండరాలపై కంట్రోల్ ఉండదు. నవ్వటం లాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా  అనుకోకుండా వస్తాయి.  

నాడీ వ్యవస్థ కూడా క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఫలితంగా ఫీటస్ చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉంటుంది. చేతులతో పిడికిలి బిగించి కడుపు పై కొడుతుంది.

పదిహేడవ వారం (Week 17) :

ఈ వారంలో ఫీటస్ 12 cm పొడువు గా ఉంటుంది మరియు ఆకారంలో దానిమ్మ పండంత ఉంటుంది. ఫీటస్ యొక్క శరీర బరువు 150 గ్రాములు ఉంటుంది. 

ఈ వారంలో ఫీటస్ యొక్క కళ్ళు మూసుకొని ఉంటాయి కానీ లోపలి నుంచి కదిలిస్తూ ఉంటాయి. నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటాయి.పెద్ద శబ్దాలకు రియాక్ట్ (స్పందిస్తూ)కూడా అవుతాయి.   

ఇదే వారంలో వేలి ముద్రలు కూడా తయారవుతూ ఉంటాయి. ప్రపంచంలో ఏ ఒక్కరి వేలి ముద్రలు ఇతరులతో మ్యాచ్ అవ్వవు. కవలల వేలి ముద్రలు కూడా ఒకేలా ఉండవు. 

మీ శరీరంలో కలిగే మార్పులు :

ఇప్పటి వరకు కలిగిన మార్నింగ్ సిక్ నెస్ క్రమంగా తగ్గుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో విడుదల అయ్యే హార్మోన్స్ లేదా పెల్విక్ ఏరియా లో ఎక్కువగా రక్తం సరఫరా అవ్వటం వల్ల శృంగారం లో పాల్గొనాలనే కోరికలు పెరుగుతాయి.

ఇప్పుడు కడుపు కాస్త పెద్దగా అవ్వటం కూడా గమనిస్తారు.ఇది వరకు బ్లాడర్ ప్రెస్ అవ్వటం వల్ల ఎక్కువగా యురీన్ వచ్చేది, పదమూడవ వారంలో కడుపు కాస్త పెద్దగా అవ్వటం వల్ల ఎక్కువగా వచ్చే యూరీన్ కూడా తగ్గుతుంది. 

ప్లసెంటా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ప్లసెంటా మరియు ఫీటస్ (పిండం) ఒక ట్యూబ్ లాంటి ఆకారం తో జోడించబడి బడి ఉంటాయి. ఈ ట్యూబ్ ని  అంబిలికల్ కార్డ్ (umbilical cord) అని అంటారు. ఈ ట్యూబ్ లోపల రెండు చిన్న నాళాలు ఒక పెద్ద నాళం ఫీటస్ నుంచి ప్లసెంటా కి జోడించబడి ఉంటాయి.

పెద్ద నాళం తల్లి నుంచి బిడ్డకు ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్లు చేరవేస్తుంది మరియు చిన్న నాళాలు ఫీటస్ నుంచి వ్యర్ధాలను తీసుకెళతాయి. ఈ ప్రక్రియ ఎంత సక్రమంగా జరుగుతుందంటే తల్లి మరియు బిడ్డ యొక్క రక్తం కలవదు.         

తల్లి కడుపులో పెరిగే బిడ్డ కి  అంబిలికల్ కార్డ్ నాభి దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటుంది. డెలివరీ తరవాత ఈ ట్యూబ్ ను తొలగిస్తారు మిగిలిన భాగం నాభి గా మిగిలిపోతుంది. 

ఈ సమయంలో మీ శరీర బరువు కూడా పెరుగుతుంది. మీ శరీర బరువు ఎంత పెరగబోతుందో అది ప్రెగ్నన్సీ కన్నా ముందు ఉండే మీ శరీర బరువు పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 14 వ వారంలో 10 నుంచి 12 కిలో గ్రాములు పెరిగే అవకాశం ఉంటుంది.  

పదిహేనవ వారంలో ఫీటస్ చాలా త్వర త్వరగా పెరుగుతుంది. ఇదే వారంలో కడుపులో నొప్పి కూడా అనిపిస్తుంది, దీనినే రౌండ్ లిగ్మెంట్ పెయిన్ అని అంటారు. 

శరీర చర్మం పై దురదలాగా కూడా అనిపిస్తుంది. లూస్ మరియు కాటన్ బట్టలు వేసుకోవటం వల్ల ఉపశమనం కలగవచ్చు.దురద మరీ ఎక్కువైతే డాక్టర్ ను సంప్రదించటం మంచిది. ఇదే వారంలో వజైనా నుంచి డిశ్చార్జ్ కూడా అవుతుంది.  

 పదహారవ వారంలో మీ నుంచి బిడ్డ కి అంటూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా  పలు రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ను చెక్ చేయటం జరుగుతుంది.  యూరీన్ టెస్ట్ సహాయం తో ప్రీ-ఎక్లంప్సియా అనే కంప్లికేషన్ కూడా చెక్ చేయటం జరుగుతుంది. 

ప్రీ-ఎక్లంప్సియా అనే కండిషన్ లో హై బ్లడ్ ప్రెషర్ మరియు లివర్, కిడ్నీ లాంటి అవయవాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది.

పదిహేడవ వారంలో మీ కడుపు పెద్దదిగా మారుతుంది మరియు బిడ్డ కూడా పెద్దదిగా మారుతుంది.   

Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/2nd-trimester/week-17/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/13-to-27/16-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.