మూడవ నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి – Third Month pregnancy symptoms in Telugu

మూడవ నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి - Third Month pregnancy symptoms in Telugu
Credit : Pixabay

రెండు నెలలు పూర్తి చేసుకొని ఇప్పుడు మీరు మూడవ నెలలో అడుగు పెట్టారు. మూడవ నెల ప్రెగ్నెన్సీ లో చాలా ముఖ్యమైనది. ఈ నెల తో మీ ఫస్ట్ ట్రిమ్స్టర్ పూర్తి అవుతుంది.   

తొమ్మిదవ వారం (Week 9) : 

ఈ వారంలో  ఫీటస్ యొక్క కడుపులో ప్రేగు లు మరియు నోటి లోపల పళ్ళ భాగం కూడా రూపం తీసుకుంటుంది. ఇంతవరకు తోక లా ఉన్న భాగం కనుమరుగు అయిపోతుంది. 

ఫీటస్ యొక్క ముఖం క్రమంగా రూపం దాల్చుకుంటుంది. కళ్ళు కాస్త పెద్దగా అవుతాయి, నోటి భాగంలో నాలుక ఏర్పడుతుంది. ఈ నాలుక పై టేస్ట్ బడ్స్ కూడా కనిపిస్తాయి. 

చేతులు మరియు కాళ్ళు క్రమంగా పెరుగుతాయి. కనిపించి కపించనట్టు వేళ్ళు ఉంటాయి, అన్ని వేళ్ళు ఒకదానితో మరొకటి అతుక్కొని ఉంటాయి. 

శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు మరియు గట్ క్రమంగా పెరుగుతూ ఉంటాయి. తొమ్మిదవ వారం ముగిసినప్పుడు ఫీటస్ దాదాపు ఒక అంగుళం అంత ఉంటుంది, ఒక సగటు చెర్రీ పండు అంత ఉంటుంది. 

ఈ వారంలో ఫీటస్ లో కాస్త కదలికలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మీకు ఆ కదలికల అనుభూతి ఇప్పుడే కనిపించదు. 

పదవ వారం (Week 10) : 

ఈ వారంలో ఫీటస్ యొక్క ఆకారం ఒక ఆప్రికాట్ సైజు అంత ఉంటుంది. ఫీటస్ యొక్క తల కి ఇరువైపుల చెవులు రూపం దాల్చుకుంటాయి.   

ముఖం పై పెదాలు మరియు ముక్కు రంధ్రాలు మెల్లగా కనిపించటం మొదలవుతాయి. నోటి లోపలి భాగంలో దవడ ఎముకలు కూడా ఏర్పడుతాయి.  శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె పూర్తిగా ఏర్పడింది. ఫీటస్ గుండె నిమిషానికి 180 సార్లు కొట్టుకుంటుంది.  తల్లి శరీరం గుండె కన్నా ఫీటస్ యొక్క గుండె రెండు మూడు రేట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. 

పదకొండవ వారం (Week 11) :

ఈ వారంలో ఫీటస్ ఒక అంజీర్ పండు సైజు అంత ఉంటుంది. తల భాగం ఇప్పటికి మిగతా శరీరం కన్నా పెద్దగా ఉంటుంది కానీ మిగతా శరీర భాగం కూడా వేగంగా పెరుగుతుంది. చేతులకు మరియు కాళ్లకు అతుక్కొని ఉన్న వేళ్ళు క్రమంగా వేరు అవుతాయి. వేళ్ళకు గోర్లు ఉండటం కూడా గమనిస్తారు. 

బిడ్డకు లైఫ్ సపోర్ట్ ఇవ్వబోయే ప్లసెంటా కూడా వేగంగా పెరుగుతుంది.  ముఖంలో ఉండే ఎముకలు కూడా క్రమంగా రూపం దాల్చుకుంటాయి. చెవులు కూడా క్రమంగా పెరుగుతూ ఉంటాయి.   

కడుపులో ఉండే బిడ్డ ఈ వారంలో కాళ్లతో తంతూ కూడా ఉంటుంది కానీ మీరు కొన్ని వరాల వరకు ఇది గమనించలేరు.   

పన్నెండవ వారం (Week 12) :

ఇంతవరకు పిండం లేదా ఫీటస్ యోక్ సాక్ (yolk sac) ద్వారానే ఆహారాన్ని తీసుకుంటుంది. ఈ వారంలో పూర్తిగా తయారైన ప్లసెంటా ఇప్పుడు ఫీటస్ కి కావాల్సిన ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్లు చేరవేస్తుంది. 

ఈ వారంలో బిడ్డ ప్లమ్ పండు సైజు అంత ఉంటుంది మరియు బరువు 18 గ్రాములు ఉంటుంది అంటే దాదాపు 3 ద్రాక్ష పండ్ల బరువు. 

ఆల్ట్రాసౌండ్ స్కాన్ లో ఇప్పుడు గుండె చప్పుడు వినవచ్చు. శరీరంలో ఉండే అస్థిపంజరం ఇప్పుడు గట్టిగా ఎముకగా మారుతుంది. బిడ్డ యొక్క లింగాన్ని నిర్ధారించే అవయవాలు కూడా ఏర్పడుతాయి, కానీ ఇప్పుడే లింగ నిర్ధారణ చేయటం కష్టం.            

మీ శరీరం కలిగే మార్పులు : 

  మొదటి రెండు నెలలలో కనిపించే ప్రెగ్నెన్సీ లక్షణాలే మూడవ నెలలో కూడా కొనసాగుతాయి.  

ఈ వారంలో మీ రొమ్ములు పెద్దగా అవ్వటం గమనిస్తారు మరియు నిప్పల్ చుట్టూ ఉండే భాగం నల్లగా అవ్వటం గమనిస్తారు .మీ మూడ్ లో మార్పులు కూడా కనిపిస్తాయి. ఒక్కసారి ఆనందంగా మరియు ఒకసారి బాధగా కూడా అనిపించవచ్చు.  

శరీరంలో కలిగే మార్పుల వల్ల తలనొప్పిగా కూడా అనిపిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో కెఫిన్ పరిమాణం తగ్గించటం వల్ల గర్భ స్రావం జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి మరియు బిడ్డ యొక్క బరువు కూడా తగ్గ కుండా ఉంటుంది. 

ఎక్కువ శాతం గర్భస్రావం మొదటి ట్రిమ్స్టర్  ఆఖరి లో  అంటే మూడవ నెలలో జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అందుకే జాగ్రత్తగా కూడా ఉండాలి. 

మొదటి మూడు నెలలలో శరీర బరువు అంత ఎక్కువగా కూడా అవ్వదు దాదాపు 1 Kg పెరుగుతారు. డాక్టర్ తో సంప్రదించి శరీర బరువును ఎలా కాపాడుకోవాలో  తెలుసుకోవాలి.  

మీ నడుము సైజు ఇప్పుడు పెరగటం కూడా గమనిస్తారు. ప్రతి మహిళలో ఈ సైజు వేరు వేరుగా ఉంటుంది కాబట్టి ఇతర మహిళలతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. 

ఈ నెల ఆఖరిలో మీలో మలబద్దకం సమస్య కూడా కనిపించవచ్చు. కడుపులో నొప్పి  మరియు కండరాలలో నొప్పి  కూడా గమనిస్తారు.    

ఇలా మీ మూడు నెలల ప్రయాణం పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు నాల్గవ నెల లేదా సెకండ్ ట్రిమ్స్టర్ లోకి అడుగు పెట్టబోతున్నారు.   

Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/1st-trimester/week-12/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/12-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.