అయిదవ నెలలో ప్రెగ్నెన్సీ లక్షణాలు – Fifth month pregnancy symptoms in Telugu

అయిదవ నెలలో ప్రెగ్నెన్సీ లక్షణాలు - Fifth month pregnancy symptoms in Telugu
Credit : Pixabay

రెండవ ట్రిమ్స్టర్ లోని మొదటి నెల పూర్తి చేసుకున్న తరవాత రెండవ నెలలో మీరు అడుగుపెడతారు. రెండవ నెలలో కూడా అయిదు వారాలు ఉంటాయి. 

పద్దెనిమిదవ వారం (Week 18) : 

ఈ వారంలో ఫీటస్ యొక్క పొడువు 14.2 cm ఉంటుంది మరియు ఆకారం రెడ్ పెప్పర్ (Red pepper) అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు 190 గ్రాములు ఉంటుంది. 

ఫీటస్ ఈ వారంలో వినటం, మింగడం మరియు పీల్చడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఫీటస్ కడుపులో అటూ ఇటూ కదులుతూ ఉంటుంది.     

పంతొమ్మిదవ వారం (Week 19) :

ఈ వారంలో ఫీటస్ 15.3cm పొడువు ఉంటుంది మరియు ఆకారం ఒక పెద్ద మామిడి పండంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు 240 గ్రాములు ఉంటుంది.

ఫీటస్ యొక్క బరువు క్రమ క్రమంగా పెరుగుతూ ఉంటుంది.    

ఇరవయ్యవ వారం (Week 20) :

ఈ వారంలో ఫీటస్ యొక్క పొడువు 25.6cm పొడువు ఉంటుంది మరియు ఆకారం ఒక అరటి పండు అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు 300 గ్రాములు ఉంటుంది. 

ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవును తల నుంచి పాదాల వరకు కొలుస్తారు. ఇంతకు ముందు వారాలలో కాళ్ళు ముడుచుకొని ఉంటాయి కాబట్టి తల నుంచి కింది భాగం వరకు మాత్రమే లెక్క బెడతారు. 

ఫీటస్ ఇప్పుడు ఒక తెల్లటి జిడ్డు పొర తో కప్పి ఉంచబడుతుంది. ఈ పొర ఫీటస్ యొక్క చర్మాన్ని పొడి బారకుండా ఉండేలాగా మరియు ఈ జిడ్డు పొర డెలివరీ సులువుగా అవ్వటానికి కూడా సహాయపడుతుంది.

బిడ్డ కాలితో తన్నటం లేదా చేతి పిడికిలితో కొట్టడం మీరు గమనించవచ్చు.

ఇరవై ఒకటవ వారం (Week 21):  

ఈ వారంలో ఫీటస్ పొడవు  26.7cm పొడువు ఉంటుంది మరియు ఆకారం క్యారెట్ అంత ఉంటుంది. ఇప్పుడు ఫీటస్ యొక్క బరువు 350 గ్రాములు ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు ప్లసెంటా కన్నా ఎక్కువగా ఉంటుంది.    

ప్లసెంటా ఫీటస్ కి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్లు అందిస్తూనే ఉంటుంది. ప్రెగ్నన్సీ మొత్తం సమయంలో ప్లసెంటా యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. 

ఫీటస్ పై ఉండే వెంట్రుకల యొక్క పొర మంచి ఉష్ణోగ్రత ను కలిగిస్తుంది. సరిగ్గా పుట్టే ముందు ఈ పొర మాయమవుతుంది.         

ఇరవై రెండవ వారం (Week 22) :

ఈ వారంలో ఫీటస్ 27.8cm ఉంటుంది మరియు ఆకారం బొప్పాయి పండు అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు 430 గ్రాములు ఉంటుంది. 

ఈ వారంలో ఊపిరితిత్తులు కూడా అభివృద్ధి చెందుతాయి, మెల్లగా శ్వాస తీసుకోవటానికి కూడా ప్రయత్నిస్తుంది. టేస్ట్ బడ్స్ కూడా మెల్లగా రూపం దాల్చుకుంటాయి.    

మీ శరీరంలో కలిగే మార్పులు : 

ఇది మీ మొదటి  ప్రెగ్నన్సీ అయితే రొమ్ములు పెద్దగా అవ్వటం గమనిస్తారు. కడుపు ఆకారం కూడా పెద్దగా అవుతుంది.      ఫీటస్ ఇంతకు ముందు నుంచి కదులుతున్నాఈ వారంలో ఫీటస్ కదలికలు మీరు ఎక్కువగా గమనించవచ్చు.  

కడుపు మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది, దీనినే లీనియా నిగ్రా (linea nigra) అని అంటారు. బిడ్డ పుట్టిన కొన్ని నెలల తరవాత  ఈ లైన్ మాయమవుతుంది. 

పద్దెనిమిదో వారంలో అనోమలీ స్కాన్ చేస్తారు, ఈ స్కాన్ ద్వారా ఫీటస్ సరిగ్గా పెరుగుతుందో లేదో చెక్ చేయటం జరుగుతుంది. 

ఇదే వారంలో సోనోగ్రాఫర్ స్కాన్ చేసి పుట్టబోయేది అబ్బాయా లేక అమ్మాయా చెప్పటం జరుగుతుంది. ప్రతి దేశంలో ఈ నియమాలు వేరు వేరుగా ఉంటాయి. మన దేశంలో మాత్రం లింగ నిర్ధారణ చేయటం నేరం.

పుట్టబోయే బిడ్డ ఆడ అని తెలిస్తే చాలా మంది ప్రెగ్నన్సీ రద్దు చేసుకుంటారు. అందుకే ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. పంతొమ్మిదవ వారంలో బిడ్డ యొక్క కదలికలు మీరు మంచిగా గమనించవచ్చు. 

ఇరవయ్యవ వారంలో రాత్రి సమయంలో  నొప్పి వల్ల అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచే అవకాశాలు ఉన్నాయి.  

ఇరవై ఒకటవ వారంలో కడుపు ఇంకా పెద్దగా అవుతుంది. కడుపులో ఉన్న ఫీటస్ ఎక్కువగా కదలటం మొదలుపెడుతుంది. ఇదే వారంలో ఫీటస్ పడుకోవటం మరియు లేవటం మొదలుపడుతుంది. 

మీరు పడుకొనే సమయం మరియు బిడ్డ పడుకునే సమయం వేరుగా ఉండవచ్చు కాబట్టి నిద్ర సరిగా రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీలు దొరికినప్పుడల్లా కాసేపు పడుకోవటం మంచిది.

ఇరవై రెండవ వారంలో మీ కడుపు పై స్ట్రెచ్ మర్క్స్ కూడా కనిపిస్తాయి. చర్మం ఎక్కువగా స్ట్రెచ్ అవ్వటం వల్ల స్ట్రెచ్ మర్క్స్ కనిపిస్తాయి. 

మీ రొమ్ములు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం రెడీ అవుతూ ఉంటాయి, రొమ్ములలో నుంచి స్రావం కారుతూ ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టడానికి మీ రొమ్ములు రెడీ అవుతూ ఉంటాయి.

Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/1st-trimester/week-12/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/12-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి

      

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.