క్యాన్సర్ అంటే ఏమిటి ? అది ఎలా వ్యాపిస్తుంది ? What is cancer in Telugu ?

Image credit : Pixabay

క్యాన్సర్ అనగానే చాల మందికి భయమేస్తుంది. మనలో కొంత మందికే కాన్సర్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్ వల్లనే  చాలా మంది చనిపోతున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి ?

మన శరీరం 36 ట్రిలియన్ల కణాలతో తయారు చేయబడింది. ఈ కణాలలో ఒక్క కణం కూడా అసాధారణంగా పెరగటం ప్రారంభిస్తే అది క్యాన్సర్ వ్యాధి కి దారి తీస్తుంది. అసలు ఎందుకు కణాలు అసాధారణంగా పెరుగుతాయి.

Also read : క్యాన్సర్ ఎన్ని రకాలు? Types of cancers in Telugu

క్యాన్సర్ ఎలా మొదలవుతుంది ?

మన శరీరం లోని ప్రతి కణం ఎప్పుడు రెండు కణాలుగా విభజింప బడుతుంది. ఈ కణాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి కానీ కొన్ని కణాలు చనిపోకుండా అలానే ఉంటాయి ఇది మన శరీరం లో జరిగే మ్యుటేషన్ వల్ల ఇవి చనిపోకుండా అలానే ఉంటాయి.

మరి మ్యుటేషన్ అంటే ఏంటి ?  మ్యుటేషన్ ఏంటంటే మన శరీరంలోని ప్రతి కణం లో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ నే కణానికి ఎలా విధులు నిర్వర్తించలో సూచిస్తుంది. కానీ డిఎన్ఏ లో కలిగే కొన్ని మార్పుల వల్ల ఇవి మ్యుటేషన్ కి దారి తీస్తాయి.

మరి డిఎన్ఏ లో ఎందుకు మార్పులు వస్తాయి?  దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని సార్లు మన తల్లి తండ్రుల నుంచే ఈ మార్పులు మనకు వస్తాయి. కొన్ని సార్లు మనం పుట్టిన తర్వాత ఈ మార్పులు మన శరీరం లో ఏర్పడుతాయి. మనం పుట్టిన తర్వాత డిఎన్ఏ లో కలిగే మార్పులకు మన అలవాట్లు కారణం కావొచ్చు. ఉదాహరణకి స్మోకింగ్, రేడియేషన్ , లావుగా పెరగటం, వ్యాయామం చెయ్యక పోవడం వంటి వాటి వాళ్ళ డిఎన్ఏ లో మార్పులు వస్తాయి.

మన శరీరం లో రక రకాల కణాలు పరిమిత మైన సంఖ్యలో పుడుతూ చనిపోతూ ఉంటాయి కానీ డిఎన్ఏ లో కలిగిన మార్పుల వల్ల ఏర్పడిన  మ్యుటేషన్ కణాలని అదుపు లేకుండా పెరిగేలా చేస్తుంది. సాధారణంగా మన శరీరం లోని కణాలకి ఎంత సంఖ్యలో అవి ఉండాలో తెలిసి ఉంటుంది. కానీ డిఎన్ఏ మార్పుల వల్ల ఏర్పడిన కణాలకి అవి ఎంత సంఖ్యలో ఉండాలో అన్న  విషయం తెలియక పోవడం వల్ల విపరీతంగా పెరుగుతూ పోతాయి.

ఇలా విపరీతంగా పెరిగిన కణాలే కణితి ( ట్యూమర్ ) గా మారుతాయి.  మన శరీరంలో డిఎన్ఏ ని మరమ్మత్తు చేసే జన్యువులు డిఎన్ఏ లో వచ్చే లోపాలని సరిచేస్తాయి. ఎప్పుడైతే డిఎన్ఏ జన్యువు మ్యుటేషన్ కి గురవుతుందో అప్పుడు అది డిఎన్ఏ లోపాలని సరిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అప్పుడు ఈ కణజాలన్నికలిసి కణితి గా మారుతాయి.

క్యాన్సర్ రకాలు :

ఇలా ఏర్పడిన కణతిలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కేన్సరేతర కణితి (Benign) , రెండు కాన్సర్ కు సంబంధించిన కణితి (Malignant). 

క్యాన్సరేతర కణితి  (Benign) ప్రమాదకరమైనది కాదు ఎందుకంటే ఇది ఒకటే  స్థలంలో ఉంటుంది శరీరంలోని శరీర భాగాలకు వ్యాపించదు. ఒక్కసారి తీసేస్తే మళ్ళీ రాదు .

కానీ రెండవ రకం (Malignant) కణితి క్రమంగా పెరుగుతూ ఇతర కణజాలాలకి వ్యాపిస్తుంది.ఈ రకం కణాలు రక్తం ద్వారా ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ కణితిలు వ్యాపించేటప్పుడు ఇతర శరీర భాగాలలో కూడా కణితులను తయారు చేస్తాయి.

క్యాన్సర్ లక్షణాలు :

క్యాన్సర్ రావడానికి ముందు మన శరీరంలో కొని లక్షణాలు మనకు కనిపిస్తాయి.

1 . అలిసిపోవడం.

2 . శరీర బరువులో తీవ్ర మార్పులు రావటం.

3 . నిరంతర దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండటం.

4 . శరీరంలో చర్మం కింద గడ్డలాగా అనిపించడం.

5 . చర్మం రంగు మారటం.

ఇలాంటి లక్షణాలతో మనకు క్యాన్సర్ అనే భయంకర రోగాన్ని ముందు పసిగట్టవచ్చు.

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

1 Comment

  1. క్యాన్సర్ ఉందని అనుమానం వచ్చిన తర్వాత, ఆ అనుమానాన్ని నిర్ధారించగలగే లేదా తిరస్కరించగలిగే పరీక్షలు అవసరమవుతాయి. మరిన్ని వివరాలకోసం క్యాన్సరిన్ఫో వెబ్సైటును వీక్షించండి https://cancerinfo.co.in/te/

Comments are closed.