రోజు ఉదయం లేవగానే చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ళ వరకు ఛాయ్ తాగడం మనందరికి అలవాటుగా మారింది. ఇంకా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు కాని లేదా చుట్టాలని కలిసినప్పుడు మనము అడిగే మొదటి విషయం ” టీ , కాఫీ తీసుకుంటారా ?”
అయితే ఇలా రోజుల తరబడి ఛాయ్ ని తాగడం మన ఆరోగ్యానికి మంచిదేనా ? ఎక్కువగా తాగటం వళ్ళ మనము ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం ? రోజుకు ఎన్ని కప్పుల ఛాయ్ తాగడం మనకు ప్రమాదకరం ?
పూర్వము మన పూర్వికులకి ఛాయ్ అంటే ఏంటో తెలియదు. బ్రిటిష్ వాళ్ళు మన భారత దేశానికి వచ్చినప్పుడు చైనా నుండి ఈ ఛాయ్ కల్చర్ ని తీసుకు వచ్చారు. చైనాలోనే మొదటి సారిగా ఛాయ్ ని తాగటం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఛాయ్ ని కేవలం వైద్య పరంగా మాత్రమే తాగేవారు కాని క్రమంగా అది ఒక వ్యసనంగా , అలవాటు గా మారింది.
మనం ఉపయోగించే ఛాయ్ పత్తి కామోల్లియా సినెన్సిస్ (Camellia sinensis) అనే మొక్క నుండి తయారు చేయబడుతుంది. ఈ ఛాయ్ పత్తి లో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆందోళన (anxiety), ఒత్తిడి (stress),నిద్రలేమి (insomnia), చిరాకు (irritability) , అజీర్ణము (Upset stomach) వంటి సమస్యలు దారితీయవచ్చు.
మన దేశంలో చాలా వరకు ఛాయ్ ని పాలతో కలిపి తయారు చేస్తారు. పాలు, కెఫిన్ కలవటం వల్ల మన కడుపులో గ్యాస్ తయారు అవుతుంది. అందుకే ఎక్కువగా ఛాయ్ తాగేవాళ్ళకి అజీర్ణ సమస్యలు ఎదురుఅవుతాయి. ఈ కెఫిన్ ని రోజు తాగటం వల్ల అదొక వ్యసనంగా మారుతుంది. కొంత మంది అయితే ఒక్క రోజుకి 4 నుండి 5 కప్పుల ఛాయ్ తాగుతారు. ఇలా తాగటం మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
ఇంకా కడుపుతో ఉన్నవారు మాత్రం ఛాయ్ విషయం లో జాగ్రత్త గా ఉండాలి. కొన్ని సార్లు మనము ఛాయ్ మానేద్దాం అని అనుకుంటాం కాని అది చాలా కష్టం గా మారిపోతుంది.కొన్నిరోజులు మానివేసిన తర్వాత మొదటి కన్నా ఎక్కువ మోతాదులో ఛాయ్ తాగడం ప్రారంభిస్తాం .
మరి ఇన్ని చెడు ప్రభావాలు ఉన్న ఛాయ్ తో ఎలాంటి ఉపయోగాలు లేవా అంటే కొన్ని మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఛాయ్ తాగినప్పుడు మన మెదడు చురుకుగా పనిచేస్తుంది,కొన్ని రకాల కాన్సర్ ని రాకుండా కాపాడుతుంది, గుండె పోటు రాకుండా కూడా కాపాడుతుంది. ఇక గ్రీన్ టీ బరువు తగ్గటానికి కూడా ఉపయోగ పడుతుంది.
కాని పరిశోధనల ప్రకారం ఈ ఉపయోగాలు పూర్తిగా రుజువు అవ్వలేదు. అయితే మనం ఛాయ్ తాగాలా వద్దా ? ఛాయ్ ని తక్కువ మోతాదులో తాగటం వల్ల ఎక్కువగా నష్టం లేదు కానీ ఎక్కువగా తాగటం చాలా ప్రమాదకరం ఏదైనా లిమిట్ లో తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply