ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిస్తున్న సమయంలో కచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యామో లేదో చెప్పలేము కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం 99 శాతం సరిగ్గా ఫలితాన్ని ఇస్తుంది.
Table of Contents
ప్రెగ్నెన్సీ కిట్ ఎలా పనిచేస్తుంది ?
ప్రెగ్నెన్సీ టెస్ట్ లో మీ శరీరంలో హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (HCG) అనే హార్మోన్ ఉందో లేదో టెస్ట్ చేయటం జరుగుతుంది. ఎగ్ ఫర్టిలైజ్ అయ్యిన తరవాత యూట్రస్ కు అతుక్కుంటుంది. ఫలితంగా ప్రెగ్నెన్సీ మొదలవుతుంది, ఇదే సమయంలో పిండం యొక్క బయటి భాగంలో ఉండే కణాలు ప్లాసెంటా ను తయారు చేస్తాయి.
ఈ ప్లాసెంటా ద్వారానే పిండానికి కావాల్సిన ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్లు అందుతాయి. ప్లాసెంటా నుంచి HCG హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది.
ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రకాలు ?
ప్రెగ్నెన్సీ టెస్ట్ రెండు రకాలుగా చేయటం జరుగుతుంది.
- మొదటి పద్దతిలో యూరీన్ ద్వారా టెస్ట్ చేయబడుతుంది.
- రెండవ పద్దతిలో బ్లడ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయబడుతుంది.
యురీన్ టెస్ట్ :
ఈ టెస్ట్ ను పీరియడ్స్ మిస్ అయిన ఒక వారం తరవాత చేయటం జరుగుతుంది. ఎక్కువ శాతం యూరీన్ టెస్ట్ ను ఇంట్లోనే చేయటం జరుగుతుంది. కిట్ పై ఇచ్చిన సూచనల ప్రకారం టెస్ట్ ను చేసినట్లయితే 99 శాతం సరిగ్గా ఫలితాన్ని చూపిస్తుంది.
యురీన్ టెస్ట్ ను ఎలా చేయాలి ?
మెడికల్ స్టోర్స్ లో మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రెగ్నెన్సీ కిట్ లు అందుబాటులో ఉంటాయి. మీరు పలుసార్లు టెస్ట్ చేయాలి అనుకుంటే సెట్ తీసుకోవచ్చు లేదా ఒకటే కిట్ ను తీసుకొని టెస్ట్ చేయవచ్చు.
యురీన్ టెస్ట్ ను కింది పద్దతులలో నుంచి ఒక పద్దతి లో చేయవచ్చు
- యురీన్ చేసేటప్పుడు స్టిక్ ను ఉంచటం
- యురీన్ ను ఒక కప్ లో సేకరించి అందులో స్టిక్ ను ఉంచటం
- యురీన్ ను ఒక కప్ లో సేకరించి అందులో నుంచి డ్రాపర్ ద్వారా స్టిక్ పై టెస్ట్ చేయటం
ఈ పద్దతులలో మీకు ఏ పద్దతి సులువుగా అనిపిస్తే ఆ పద్దతి ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. స్టిక్ పై ముందు నుంచే ఒక లైన్ ఉంటుంది, యురీన్ వేసిన తరవాత రెండు లైన్ లు కనిపిస్తాయి. రెండు లైన్ లు కనిపించినట్లైతే మీరు ప్రెగ్నెంట్ అని అర్థం.
టెస్ట్ తరవాత కూడా కేవలం ఒక్కటే లైన్ కనిపించినట్లైతే మీరు ప్రెగ్నెంట్ అవ్వలేదని అర్థం కొన్ని సార్లు టెస్ట్ సరిగా చేయకపోవటం వల్ల కూడా ఫలితం సరిగా చూపించదు. మీకు ఇంకా ఏదైనా సందేహం అనిపిస్తే మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు.
మార్కెట్ లో ప్రస్తుతం వివిధ రకాల కిట్ లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కిట్ లలో ప్రెగ్నెంట్ అయితే ప్లస్ సింబల్ వస్తుంది. ఇంకొన్ని కిట్ లలో ప్రెగ్నెంట్ అని రాసి వస్తుంది.
బ్లడ్ టెస్ట్ :
బ్లడ్ టెస్ట్ లో రెండు రకాలు ఉంటాయి
క్వాలిటేటివ్ hCG టెస్ట్ మరియు క్వాన్టిటేటివ్ hCG టెస్ట్
క్వాలిటేటివ్ hCG టెస్ట్ :
ఈ టెస్ట్ ద్వారా కూడా hCG హార్మోన్ ను గుర్తించటం జరుగుతుంది. యురీన్ టెస్ట్ కన్నా త్వరగా బ్లడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీ ను గుర్తిస్తుంది.
ఎగ్ మరియు వీర్యం ఫర్టిలైజ్ అయ్యిన 10 రోజుల తరవాతే ప్రెగ్నెన్సీ ను గుర్తిస్తుంది.
క్వాన్టిటేటివ్ hCG టెస్ట్ :
ఈ రకమైన టెస్ట్ లో hCG హార్మోన్ శరీరంలో ఎంత మొత్తంలో ఉందో కచ్చితంగా చూపిస్తుంది. hCG హార్మోన్ తక్కువ మొత్తంలో ఉన్నా కూడా గుర్తుపడుతుంది.
ఈ పద్దతిని సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే సమస్యలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ ను కూడా గుర్తించడానికి ఉపయోగించే అవకాశం ఉంది.
ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ లో పిండం యూట్రస్ లో కాకుండా ఫాలోపియన్ ట్యూబ్ లో ఎదుగుతుంది. ప్రెగ్నెన్సీ లో hCG క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఒక వేళా hCG హార్మోన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతే గర్భస్రావం (miscarriage) కూడా అయ్యి ఉండవచ్చు.
ఏ సమయంలో ప్రెగ్నన్సీ టెస్ట్ చేయటం మంచిది ?
పీరియడ్స్ మిస్ అయ్యిన తరవాత టెస్ట్ చేయటం వల్ల సరైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ అని వస్తే ఏమి చేయాలి ?
ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యారని అర్థం. ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసిన తరవాత డాక్టర్ ను సంప్రదించాలి.
ప్రెగ్నెన్సీ నెగటివ్ అని వచ్చిందంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వలేదని అర్థం.
కానీ కొన్ని సార్లు టెస్ట్ సరిగా చేయకపోవటం, చాలా త్వరగా టెస్ట్ చేయటం, కిట్ సరిగా పనిచేయకపోవడం వల్ల, కొన్ని మందుల ప్రభావం వల్ల మరియు టెస్ట్ కి ముందు ఎక్కువగా ఏదైనా ద్రవ పదార్థాలను తాగినప్పుడు టెస్ట్ తప్పు చూపించే అవకాశాలు ఉంటాయి.
మీ శరీరంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిస్తే టెస్ట్ ను రెండవ సారి చేయటం లేదా డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.
Sources : https://medlineplus.gov/lab-tests/pregnancy-test/ https://www.mayoclinic.org/healthy-lifestyle/getting-pregnant/in-depth/home-pregnancy-tests/art-20047940 https://my.clevelandclinic.org/health/articles/9703-pregnancy-tests#:~:text=Pregnancy%20tests%20work%20by%20reacting,positive%20result%20in%20unique%20ways. https://www.webmd.com/baby/guide/pregnancy-tests
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply