కొత్తగా పెళ్ళైన దంపతులు లేదా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రెగ్నన్సీ లక్షణాలు తెలిసి ఉండటం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్ చేయటం ఒక మంచి పద్దతి. 100 లో 90 శాతం ఈ టెస్టులు సరైన ఫలితాన్ని చూపిస్తాయి.
టెస్టు కన్నా ముందు మీ శరీరంలో వచ్చే మార్పులు మరియు లక్షణాలను బట్టీ కూడా ప్రెగ్నన్సీ అంచనా వేయవచ్చు.
ప్రెగ్నన్సీ లక్షణాలు (Pregnancy symptoms) :
పీరియడ్స్ రాక పోవటం :
మీరు గర్భవతి అయ్యినప్పుడు కనిపించే పెద్ద లక్షణం పీరియడ్స్ రాకుండా ఉండటం. ఒక్క సారి ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి యూట్రస్ లో ఇంప్లాంట్ అయ్యిన తరవాత శరీరంలో హార్మోన్ ఉత్పత్తి అయ్యి ఒవ్యులేషన్ అవ్వకుండా మరియు యూట్రస్ యొక్క లైనింగ్ విచ్చిన్నం అవ్వకుండా ఆపుతుంది.
ఒవ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారానే ప్రతి నెల ఎగ్ విడుదల అవుతుంది. ఒక్క సారి గర్భం దాల్చిన తరవాత ఎగ్ అవసరం ఉండదు కాబట్టి ఎగ్ విడుదల అయ్యే ప్రక్రియ ఆగిపోతుంది.
ఇక మీకు మళ్ళీ పీరియడ్స్ బిడ్డ పుట్టిన తరవాతనే రావటం జరుగుతుంది. పీరియడ్స్ రాలేదు అని అంటే అది కచ్చితంగా ప్రెగ్నెన్సీ అని అర్థం కాదు.
హార్మోన్ లలో కలిగే మార్పులు, స్ట్రెస్, ఎక్కువగా వ్యాయామం చేయటం మరియు డైటింగ్ వల్ల కూడా పీరియడ్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మెన్స్ట్రువల్ సైకిల్ సక్రమంగా లేనప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది.
వికారం లేదా వాంతికి వచ్చినట్లు అనిపించటం :
ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిలలో వికారం లేదా వాంతికి వచ్చినట్లు అనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్ లో దీనినే మార్నింగ్ సిక్ నెస్ (MorningSickness) అని కూడా అంటారు. మార్నింగ్ సిక్ నెస్ అంటే ఉదయం రావాలనే గ్యారంటీ లేదు. రోజు మొత్తంలో ఎప్పుడైనా రావొచ్చు.
ఈ లక్షణం కొంత మంది అమ్మాయిలలో ప్రెగ్నన్సీ మొదలైన 2 నుంచి 3 వారాలలో కనిపిస్తుంది. మరికొంతమంది అమ్మాయిలలో ప్రెగ్నెంట్ అయిన 1 నుంచి 2 నెలల తరవాత కనిపిస్తుంది. కొంత మందిలో వాంతి అవ్వకుండా కేవలం వికారం లాంటి ఫీలింగ్ అనిపించవచ్చు.
ప్రెగ్నెన్సీ మొదలైన సమయంలో వాంతులు ఎక్కువగా అవ్వటం వల్ల డీహైడ్రేషన్ వల్ల హైపెరెమెసిస్ గ్రావిడారం (hyperemesis gravidarum) అనే కండీషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో డాక్టర్ ను సంప్రదించటం మంచిది.
అలా అని అందరికి ఈ లక్షణం కచ్చితంగా కనిపించదు, కొంత మందిలో అస్సలు ఈ లక్షణం కనిపించదు.
యురీన్ ఎక్కువగా రావటం :
ప్రెగ్నెంట్ అయ్యిన తరవాత మీ శరీరంలో రక్తం యొక్క స్థాయి పెరుగుతుంది. రక్త పరిమాణం పెరగటం వల్ల కిడ్నీ కూడా ఎక్కువగా ఫిల్టర్ చేస్తుంది, ఫిల్టర్ చేసిన తరవాత మిగిలిన వేస్ట్ యురీన్ ద్వారా బయటికి వస్తుంది. ఈ కారణం వల్ల ప్రెగ్నెంట్ అయ్యిన తరవాత ముందుకన్నా ఎక్కువగా బాత్ రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది.
ఎక్కువగా అలసి పోవడం (fatigue) :
ప్రెగ్నెంట్ అయ్యిన తరవాత ఎందుకని ఎక్కువగా అలిసిపోతారో అన్న దానికి కచ్చితంగా సమాధానం లేదు. బహుశా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ మొత్తంలో ప్రొజెస్టెరోన్ విడుదల అవ్వడం వలన ఎక్కువగా అలిసిపోయినట్లు అనిపిస్తుంది. 3 నెలల తరవాత ఈ లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి.
రొమ్ములలో నొప్పి కలగటం :
ప్రెగ్నెంట్ అయ్యిన కొత్తలో రొమ్ములను తాకితే నొప్పిగా అనిపించటం మరియు రొమ్ముల యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఎక్కువ మొత్తంలో విడుదల అయ్యే హార్మోన్లకు మీ శరీరం అలవాటు పడ్డ తరవాత నొప్పి కూడా తగ్గిపోతుంది.
ఇవే కాకుండా కొన్ని ఇతర లక్షణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ ను అంచనా వేయవచ్చు.
మూడ్ స్వింగ్స్ : శరీరంలో కలిగే మార్పుల వల్ల మూడ్ లో చాలా మార్పులు గమనించటం జరుగుతుంది. భావోద్వేగానికి గురిఅవ్వటం మరియు ఏడుపు రావటం లాంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది.
స్పాట్టింగ్ : పీరియడ్స్ లో వచ్చే రక్తం లాగానే ప్రెగ్నన్సీ అయ్యిన తరవాత కూడా తేలికపాటి రక్తస్రావం అవుతుంది. ఎంబ్రియో యూట్రస్ యొక్క లైనింగ్ కి అతుక్కోవటం వల్ల ఇలా అవుతుంది. శృంగారంలో పాల్గొన్న పలురోజుల తరవాత ఎంబ్రియో యూట్రస్ లైనింగ్ కు అతుక్కుంటుంది.
సాధారణంగా అమ్మాయిలు దీనిని పీరియడ్స్ గా భావిస్తారు. ఈ స్పాట్టింగ్ లేదా తేలికపాటి రక్తస్రావం కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు కనిపించవచ్చు.
క్రామ్పింగ్ (Cramping) : పీరియడ్స్ సమయంలో అయ్యే క్రామ్ప్స్ లాగానే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అనిపిస్తుంది. క్రామ్ప్స్ కేవలం ఒకటే శరీర భాగంలో అనిపిస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అయ్యే అవకాశం ఉంది, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
మలబద్దకం (Constipation) : శరీరంలో కలిగే హార్మోన్ల మార్పు వల్ల జీర్ణ క్రియ నెమ్మదిస్తుంది ఫలితంగా మలబద్దకం అయ్యే అవకాశం ఉంది.
కడుపు ఉబ్బరం( Bloating ) : హార్మోన్ల వల్ల కలిగే మార్పుల కారణంగా పీరియడ్స్ సమయంలో అనిపించినట్లే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
ఆకలి : ప్రెగ్నెన్సీ మొదలయ్యిన తరవాత ప్రత్యేక రకమైన పదార్థాలు తినాలని అనిపించటం లేదా ఎక్కువగా ఆకలి వేయటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొంతమంది అమ్మాయిలలో మాత్రం నోటి యొక్క రుచి మారిపోతుంది. ఇంతకు ముందు ఇష్టంగా తినే ఆహార పదార్తాలు ఇప్పుడు నచ్చవు.
వీటితో పాటు తలనొప్పి,జలుబు చేయటం మరియు నోటి యొక్క రుచి మారటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే ప్రెగ్నెంట్ అయ్యినట్లేనా :
ప్రెగ్నెన్సీ సమయంలో కనిపించే లక్షణాలు దాదాపు పీరియడ్స్ లక్షణాల లాగానే ఉంటాయి. ఫలితంగా పీరియడ్స్ అవ్వబోతున్నాయో లేదా ప్రెగ్నెంట్ అయ్యారో చెప్పటం కష్టంగా మారుతుంది.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవటం వల్ల ప్రెగ్నెంట్ గా ఉన్నామో లేదో తెలిసిపోతుంది.
ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి ?
సాధారణంగా మెడికల్ స్టోర్స్ లో ప్రెగ్నెన్సీ చెక్ చేయటానికి కిట్ లు దొరుకుతాయి. ఈ కిట్ విలువ 100 రూపాయల లోపే ఉంటుంది.
ఈ కిట్ ప్రెగ్నెన్సీ సమయంలో విడుదల అయ్యే హార్మోన్ ను గుర్తిస్తుంది. దాదాపు 100 లో 99 శాతం కరెక్ట్ గా పనిచేస్తుంది.
కిట్ ని ఓపెన్ చేసినప్పుడు ఒక్క లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ కిట్ పై ఇచ్చిన సూచనల ప్రకారం యురీన్ యొక్క చుక్కలను వేయాలి, మీరు నిజంగానే ప్రెగ్నెంట్ అయితే కాసేపటి తరవాత రెండు లైన్ లు కనిపిస్తాయి.
ఒక్కసారి ప్రెగ్నెంట్ అయ్యారని రుజువు అయ్యిన తరవాత డాక్టర్ ను సంప్రదించాలి.
అంగన్ వాడి :
మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ వైద్య శాలలో ఎక్కడైనా డాక్టర్ ను సంప్రదించవచ్చు. మీరు తెలుగు రాష్ట్రాలలో ఉంటున్నట్లైతే అంగన్ వాడి లో మీ పేరు రాయించుకోవాలి.
పేరు రాయించటం వల్ల ప్రభుత్వం ఇచ్చే గుడ్లు మరియు పాలను మీరు తీసుకోవచ్చు. ఇవే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా మీకు చేరుతాయి.
డెలివరీ తరవాత కూడా బిడ్డకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి అంగన్ వాడి ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు.
Sources : https://www.acog.org/womens-health/faqs/morning-sickness-nausea-and-vomiting-of-pregnancy https://www.womenshealth.gov/pregnancy/youre-pregnant-now-what/stages-pregnancy https://my.clevelandclinic.org/health/articles/9709-pregnancy-am-i-pregnant https://www.mayoclinic.org/healthy-lifestyle/getting-pregnant/in-depth/symptoms-of-pregnancy/art-20043853
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
very much useful information for newlyweds