What is periods in females in Telugu – మహిళలలో పీరియడ్స్ అంటే ఏమిటి ?

What is periods in Telugu - పీరియడ్స్ అంటే ఏమిటి ?
Image by Anastasia Golovina from Pixabay

వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల శరీరం పలు మార్పులకు దారి తీస్తుంది. యవ్వన వయసు కి వచ్చిన తరవాత ఆడపిల్లల శరీరం లో కలిగే ఒక మార్పు మెన్స్ట్రువల్ సైకిల్, దీనినే మనం సాధారణ భాషలో పీరియడ్స్ అని అంటాము.

ఈ విషయం చాలా సున్నితమైనది కాబట్టి  ఎవ్వరూ పెద్దగా దీని గురించి చర్చించడానికి ఇష్టపడరు. కొన్ని సార్లు తల్లి తండ్రులకు కూడా ఈ మార్పు గురించి వివరించటం కాస్త కష్టంగా అనిపిస్తుంది.

ఈ ఆర్టికల్ లో మనం పీరియడ్స్ అంటే ఏమిటి ? పీరియడ్స్ ఎందుకు వస్తాయి ? పీరియడ్స్ రాక పోవటానికి కారణాలు ? వంటి విషయాల గురించి చూద్దాము.

పీరియడ్స్ ఏ వయసులో ప్రారంభమవుతాయి ? 

అమ్మాయిలు యుక్త వయసుకి వచ్చినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడుతాయి, దీనినే ఇంగ్లీష్ లో ప్యూబర్టీ (Puberty) అనికూడా అంటారు. ఈ మార్పులలో ఒకటి పీరియడ్స్ (మెన్స్ట్రువల్ సైకిల్). 

సాధారణముగా 12 నుంచి 13 సంవత్సరాలున్న అమ్మాయిలలో పీరియడ్స్ ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాలలో 12 సంవత్సరాల కన్న ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

పీరియడ్స్  (మెన్స్ట్రువల్ సైకిల్) అంటే ఏమిటి ?

ఒక అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తరవాత మెదడు శరీరానికి హార్మోన్స్ తయారు చేయమని సిగ్నల్స్ ఇస్తుంది. ఇందులో నుంచి కొన్ని హార్మోన్స్ అమ్మాయిలలో ప్రతి నెల పీరియడ్స్ రావటం కోసం శరీరాన్ని తయారు చేస్తాయి.

ఇంకో విధంగా చెప్పాలంటే అమ్మాయి శరీరం ఇప్పుడు ప్రెగ్నన్సీ కోసం సిద్ధం అవుతుందని అని అర్థం. ప్రతి నెల పీరియడ్స్ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి దీనిని మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటారు.

హార్మోన్స్ యూట్రస్ యొక్క లైనింగ్ ను రక్తం మరియు టిష్యూ(కణజాలం) తో మందం గా మారుస్తుంది. యూట్రస్ కు ఇరువైపులా ఉన్న రెండు ఓవరీస్ లలో ఒక ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది, దీనినే ఒవ్యులేషన్ అని అంటారు. 

ఈ ఎగ్ ఓవరీ నుంచి ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా యూట్రస్ వైపుకి కదులుతుంది. ఈ సమయంలో ఎగ్ వీర్యంతో ఫెర్టిలైజ్ అవ్వక పొతే ప్రెగ్నన్సీ అవ్వదు. ఫలితంగా యూట్రస్ యొక్క లైనింగ్ విచ్చిన్నం అయ్యి వజైనా ద్వారా బయటికి వస్తుంది. ఇలా యూట్రస్ లైనింగ్ ద్వారా బయటికి వచ్చిన రక్తం మరియు టిష్యూ నే పీరియడ్స్ అని అంటారు.

పీరియడ్స్ ఎన్ని రోజుల దాకా ఉంటాయి ?

అమ్మాయిలకు మొదటి సారి పీరియడ్స్ మొదలైనప్పుడు ఎక్కువ రక్త స్రావం జరగదు మరియు ఎక్కువ రోజులు కూడా ఉండదు. సాధారణంగా చూసినట్లయితే 2 నుంచి 7 రోజుల మధ్యలో పీరియడ్స్ ఉంటాయి.

పీరియడ్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి ?

ఈ నెల లో రక్తస్రావం జరిగిన తేదీ నుంచి వచ్చే నెలలో రక్త స్రావం జరిగే మొదటి తేదీ వరకు వచ్చే రోజులనే మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటారు.  

సాధారణంగా ఎక్కువ శాతం 28 రోజులకు పీరియడ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కొంత మందికి 24 నుంచి 38 రోజుల మధ్య కూడా పునరావృతం అవుతూ ఉంటాయి.  ఈ రెండు సైకిల్స్ కూడా సాధారణం అని చెప్పవచ్చు.

ఈ విధంగా ఒక పీరియడ్ నుంచి మరొక పీరియడ్ కి కనీసం 24 రోజుల గ్యాప్ ఉండాలి కానీ ఈ గ్యాప్ 38 రోజుల కన్న ఎక్కువగా కూడా ఉండవద్దు.  

ఎక్కువ రోజులు పీరియడ్స్ రాకుండా ఉండటం polycystic ovary syndrome (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనే హార్మోనల్ డిసార్డర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో డాక్టర్ ను సంప్రదించడం మంచిది.  

అమ్మాయిలకు మొదటి సారి పీరియడ్స్ స్టార్ట్ అయిన 3 లేదా అంత కన్న ఎక్కువ సంవత్సరాల తరవాత రెగ్యులర్ గా పీరియడ్స్ రావటం ప్రారంభమవుతాయి.   

కొంత మంది మహిళలకు పీరియడ్స్ టైం కి క్రమం తప్పకుండా రావటం వల్ల పీరియడ్స్ వచ్చే రోజును ముందే అంచనా వేసుకుంటారు. ఇంకొందరు మహిళలు మాత్రం పీరియడ్స్ వచ్చే వారం ను ముందే అంచనా వేసుకుంటారు.  

వయసు పెరిగే కొద్దీ పీరియడ్స్ సైకిల్ ఎలా మారుతుంది ?

20 నుంచి 30 సంవత్సరాల వరకు మహిళలలకు పీరియడ్స్ రెగ్యులర్ గా క్రమం తప్పకుండా వస్తాయి కానీ వయసు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు కూడా వస్తాయి.  

మహిళలకు 40 సంవత్సరాలు వచ్చిన తరవాత పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఉండటం మొదలవుతుంది. కొన్ని సార్లు పీరియడ్స్ ఒక నెల లేదా కొన్ని నెలల వరకు ఆగి మళ్ళీ ప్రారంభమవుతాయి.

వయసు పెరిగే కొద్దీ పీరియడ్స్ ఒక సైకిల్ ముందు కన్న తక్కువగా లేదా ఎక్కువగా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే రక్తస్రావం కూడా ముందు కన్న ఎక్కువగా లేదా తక్కువగా అవ్వొచ్చు.

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 50 సంవత్సరాల తరవాత ఓవరీస్ ఎగ్స్ ను విడుదల చేయటం ఆపేస్తాయి. ఫలితంగా పీరియడ్స్ కూడా ఆగిపోతాయి.

పీరియడ్స్ ని కూడా ట్రాక్ చేయాలా ?

పీరియడ్స్ ని ట్రాక్ చేయటం వల్ల మనకు ప్రయోజనాలే ఉన్నాయి తప్ప ఎలాంటి నష్టం లేదు.

పీరియడ్స్ ని పేపర్ క్యాలెండర్ తో కూడా ట్రాక్ చేయవచ్చు, పీరియడ్స్ వచ్చిన రోజును ” x ” సింబల్ తో మార్క్ చేసుకోవటం వల్ల సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు.

ఇక మొబైల్ ఫోన్లు ఉన్నవారు కూడా క్యాలెండర్ ఆప్ లో మార్క్ చేసి పెట్టుకోవచ్చు లేదా ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని కూడా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.  

పీరియడ్స్ ట్రాక్ చేసుకోవటం వల్ల ప్రయోజనాలు ఏమిటి ?

పీరియడ్స్ ను ట్రాక్ చేసుకోవటం వల్ల ఎగ్స్ రిలీజ్ అయ్యే సమయం అంచనా వేయవచ్చు, ఫలితంగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఏ రోజులలో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 14 రోజుల ముందు ఓవరీస్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి.     

రక్త స్రావం మీరు అంచనా వేసిన తేదీ కన్న ముందు వచ్చిందా లేదా తరవాత వచ్చిందా  ?

సాధారణంగా అయ్యే బ్లీడింగ్ కన్నా ఎక్కువగా బ్లీడింగ్ జరిగిందా లేదా తక్కువ జరిగిందా ?

ఎంత మొత్తం లో మీరు ప్యాడ్స్, లేదా టాంపోన్ లు ఉపయోగించారు ?

సాధారణంగా పీరియడ్స్ ఉండే రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉందా లేకా తక్కువ రోజులు ఉందా ?

ఇలా మనము ట్రాక్ చేసుకోవటం వల్ల మన శరీరంలో కలిగే మార్పులను లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలను త్వరగా పసిగట్టి డాక్టర్ ను సంప్రదించవచ్చు. 

పీరియడ్స్ ఏ సందర్భాలలో రాకుండా ఉంటాయి ?

వయసు లో చాలా చిన్నగా ఉన్న అమ్మాయిలలో మరియు వయసులో 50 సంవత్సరాలకు పైబడి ఉన్న మహిళల లో పీరియడ్స్ రావు.

ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో కూడా పీరియడ్స్ రావు. కొన్ని సార్లు  ప్రెగ్నన్సీ తరవాత వెంటనే బ్రెస్ట్ ఫీడ్ (పాలు పట్టడం) చేయటం వల్ల కూడా పీరియడ్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి.

పీరియడ్స్ లో ఎంత మొత్తంలో రక్త స్రావం జరుగుతుంది ?

సాధారణంగా మహిళలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు వంద శాతంలో కేవలం 36% రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల రక్త స్రావం అవుతుంది.  మిగతా 64% టిష్యూ, యూట్రస్ లైనింగ్, మ్యూకస్, బ్లడ్ క్లాట్స్ ఉంటాయి.

ప్రతి అమ్మాయిలో రక్తస్రావం ఒకేలా ఉండదు కొందరికి ఎక్కువగా మరికొందరికి తక్కువగా కూడా ఉండొచ్చు. 

కొన్ని సందర్భాలలో హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ప్రతి గంట లేదా రెండు గంటలలో ప్యాడ్స్ లేదా టాంపోన్ మార్చాల్సి వచ్చినప్పుడు, బ్లీడింగ్ ఎనిమిది రోజుల కన్నా ఎక్కువగా అయినప్పుడు డాక్టర్ ను సంప్రదించటం మంచిది.     

పీరియడ్స్ కోసం ఎలాంటి ప్రొడక్ట్స్ ఉపయోగించాలి ?

పీరియడ్స్ లో ప్యాడ్స్, టాంపోన్, మెన్స్ట్రువల్ కప్స్ మరియు వాషబుల్ పీరియడ్ పాంటీస్ లాంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగించటం జరుగుతుంది.  

ప్యాడ్స్ ను ఎలా ఉపయోగించాలి ?

మార్కెట్ లో ప్యాడ్స్ వివిధ రకాల సైజు లలో మరియు వివిధ కంపెనీలకు చెందినవి దొరుకుతాయి. ప్యాడ్స్ పైనే ఎలా వినియోగించాలనే సూచనలు కూడా ఉంటాయి. 

టాంపోన్ లను ఎలా వినియోగించాలి ?

టాంపోన్ ను పీరియడ్స్ లో వజైనా లో పెడతారు. దీనికి బయటి వైపు ఒక థ్రెడ్ కూడా ఉంటుంది, థ్రెడ్ సహాయం తో బయటికి తీసేయవచ్చు.

టాంపోన్ ను 8 గంటల కన్నా ఎక్కువగా ఉపయోగించకూడదు, ఎక్కువ సేపు ఉంచటం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) అనే ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంది.  

మెన్స్ట్రువల్ కప్స్ ను ఎలా వినియోగించాలి ?

ప్యాడ్స్ మరియు టాంపోన్ లను ఒక సారి వినియోగించి పడేస్తారు. మెన్స్ట్రువల్ కప్స్ మాత్రం వాష్ చేసి మళ్ళీ ఉపయోగించవచ్చు. ఈ కప్ లను కూడా  టాంపోన్ లాగానే వజైనా లో పెడతారు. కొన్ని గంటల తరవాత కప్ ను ఖాళీ చేసి మంచిగా కడిగి మళ్ళీ వినియోగిస్తారు.   

పీరియడ్స్ చాలా సున్నితమైన విషయం కాబట్టి చాలా వరకు టాపిక్స్ ను ఈ ఆర్టికల్ లో కవర్ చేయటానికి ప్రయత్నించాము. మీకు పీరియడ్స్ కి సంభందించి ఎలాంటి సమస్య ఉన్న తల్లి తండ్రులతో లేదా డాక్టర్స్ తో తప్పకుండా షేర్ చేయాలి. 

ఇది అమ్మాయిలలో జరిగే ఒక సహజ ప్రక్రియ, దీని గురించి మాట్లాడటానికి అస్సలు ఇబ్బంది పడవద్దు.     

Sources :

https://www.womenshealth.gov/menopause/menopause-basics

https://www.acog.org/womens-health/faqs/your-first-period

https://www.womenshealth.gov/menstrual-cycle/your-menstrual-cycle

https://pubmed.ncbi.nlm.nih.gov/3969232/

https://www.healthline.com/health/how-much-blood-do-you-lose-on-your-period

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.