ప్రెగ్నెంట్ అవ్వటం ఒక అమ్మయికి తియ్యని అనుభూతి. కొంతమంది అమ్మాయిలలో ఉండే ఆరోగ్య సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ప్రెగ్నన్సీ ను రద్దు చేయాల్సి వస్తుంది. ఇలాంటిదే ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ, యూట్రస్ లో పెరగాల్సిన పిండం వేరే ప్రదేశంలో పెరగటం వల్ల ఈ ప్రెగ్నన్సీ ఏర్పడుతుంది.
Table of Contents
ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అంటే ఏమిటీ ?
సాధారణంగా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలంటే ప్రతి నెల అమ్మాయి ఓవరీ నుంచి బయటికి వచ్చే ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ లో వీర్యం తో ఫర్టిలైజ్ అవ్వాలి. ఇలా ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ప్రయాణించి యూట్రస్ పై ఇంప్లాంట్ (నాటుకుంటుంది) అవుతుంది.
ఇలా మొదటి నెల నుంచి తొమ్మిదవ నెల వరకు ప్రెగ్నన్సీ కొనసాగుతుంది.
ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ లో పిండం యూట్రస్ లో కాకుండా ఇతర భాగాలలో ఫర్టిలైజ్ అయ్యి పెరగటం మొదలవుతుంది. 100 లో 90% ఈ ప్రెగ్నన్సీ ఫాలోపియన్ ట్యూబ్ లో ఏర్పడుతుంది.
ఈ ప్రెగ్నన్సీ నే ట్యూబల్ ప్రెగ్నన్సీ అని కూడా అంటారు. ఇంకొన్ని సందర్భాలలో ఈ ప్రెగ్నన్సీ ఫాలోపియన్ ట్యూబ్ లో కాకుండా ఓవరీ, అబ్డోమినల్ కావిటీ మరియు కార్విక్స్ లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
యూట్రస్ కాకుండా ఇతర భాగాలలో పిండం ఎదగదు. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే ఎదిగే పిండం వల్ల ప్రాణానీకే ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ కి కారణాలు ఏమిటి ?
ఇంతకు ముందు చెప్పిన విధంగా ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ ఎక్కువ శాతం ఫాలోపియన్ ట్యూబ్ లో ఏర్పడుతుంది. ఈ ప్రెగ్నన్సీ కచ్చితంగా ఈ కారణం వల్ల జరుగుతుందని చెప్పలేము కానీ కొన్ని కారణాలను అంచనా వేయటం జరిగింది.
- హార్మోన్ లలో ఇంబ్యాలెన్స్ (అసమతుల్యత) కలగటం వల్ల
- ఫాలోపియన్ ట్యూబ్ వాపు కి గురి అయ్యి డ్యామేజ్ అయ్యినప్పుడు
- ఇంతకు ముందు ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అయితే మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుంది.
- ప్రెగ్నెంట్ అయ్యే ముందు సిగరెట్ స్మోక్ చేయటం వల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ వచ్చే ఆస్కారం ఉంది. ఎంత ఎక్కువగా సిగరెట్ తాగితే అంత రిస్క్ పెరుగుతుంది.
- ఫాలోపియన్ ట్యూబ్ కి ఇంతకు ముందు ఏదైనా సర్జరీ జరిగినప్పుడు
- ప్రెగ్నన్సీ కోసం IVF పద్దతిని ఎంచుకున్నప్పుడు
- లైంగికంగా సంక్రమించే గోనేరియా (gonorrhea ) లేదా క్లామిడియా (chlamydia) లాంటి వ్యాధుల బారిన పడ్డప్పుడు
- పిల్లలు కలగకుండా ఉండటానికి ఇంట్రాయుటరైన్ డివైస్ ని ఉపయోగించినా కూడా ప్రెగ్నెంట్ అయ్యినప్పుడు
- 35 సంవత్సరాలకు పైగా వయసు అయ్యినప్పుడు
- ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క ఆకారం సరిగా లేనప్పుడు ఈ ప్రెగ్నన్సీ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి ?
ఈ ప్రెగ్నన్సీ యొక్క లక్షణాలు సాధారణ ప్రెగ్నన్సీ లాగానే ఉంటాయి. పీరియడ్స్ రాకుండా ఉండటం, రొమ్ము లో నొప్పి కలగటం, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.
ఫర్టిలైజ్ అయిన ఎగ్ యూట్రస్ లో కాకుండా ఫాలోపియన్ ట్యూబ్ లో ఎదిగినా, కిట్ ద్వారా టెస్ట్ చేస్తే ప్రెగ్నన్సీ ఉందనే చూపిస్తుంది.
ఇవే కాకుండా వజైనా లో నుంచి తక్కువ మొత్తం లో రక్త స్రావం జరగటం, పెల్విక్ ఏరియా లో నొప్పి కలుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్ నుంచి రక్త స్రావం జరిగినప్పుడు భుజం నొప్పి కలుగుతుంది. అందరు మహిళలకు ఇవే లక్షణాలు ఉంటాయి అని కూడా చెప్పలేము.
ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ లోనే పెరిగినట్లైతే ట్యూబ్ ను నాశనం చేసే ఆస్కారం ఉంది. ఫలితంగా ఎక్కువ మొత్తంలో రక్త స్రావం జరుగుతుంది.
ఇలా ఎక్కువగా రక్తస్రావం అవ్వటం, కడుపులో ఎక్కువగా నొప్పి కలగటం, తల తిరగటం లాంటి లక్షణాలను చూసినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించటం మంచిది.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందని నిర్దారణ ఎలా అవుతుంది ?
ఈ రకమైన కండిషన్ లో ప్రెగ్నన్సీ ఉందని చెప్పగలము కానీ అది కచ్చితంగా ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అని తెలియడానికి డాక్టర్ ను సంప్రదించాలి.
డాక్టర్ కూడా ముందుగా పెల్విక్ ప్రదేశాన్ని పరిశీలించి టెస్ట్ లు చేయించుకోమని చెప్పటం జరుగుతుంది. ఈ టెస్ట్ లలో ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ మరియు అల్ట్రా సౌండ్ టెస్ట్ లు ఉంటాయి.
ముందుగా ప్రెగ్నన్సీ టెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ టెస్ట్ ద్వారా మన శరీరంలో ఉన్న హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (HCG) అనే హార్మోన్ లెవెల్ లను పరిశీలించటం జరుగుతుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ హార్మోన్ యొక్క స్థాయిలు పెరుగుతాయి.
ఇంటివద్ద చెక్ చేసే కిట్ లు కూడా HCG హార్మోన్ ను డిటెక్ట్ చేసే ప్రెగ్నన్సీ ఉందొ లేదో చెప్పడం జరుగుతుంది.
ప్రెగ్నన్సీ ఉందని నిర్థారించిన తరవాత ట్రాన్స్ వజైనల్ అల్ట్రా సౌండ్ ద్వారా ఒక పలుచటి డివైస్ ను వజైనా లోపలికి ప్రెవేశపెట్టి పిండం ఎక్కడ ఎదుగుతుందో చూడటం జరుగుతుంది.
కొన్ని సందర్భాలలో అబ్డోమినల్ అల్ట్రా సౌండ్ ద్వారా డివైస్ ను కడుపు పై తిప్పి ప్రెగ్నన్సీ మరియు రక్త స్రావం ను గమనించటం జరుగుతుంది.
లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, రక్త స్రావం ఎక్కువగా జరగటం లాంటి లక్షణాలు గమనిస్తే పైన చెప్పిన విధంగా కాకుండా వెంటనే సర్జరీ చేసే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో ఫాలోపియన్ ట్యూబ్ కూడా రప్చర్ (పగిలిపోయే) ప్రమాదం ఉంటుంది అందుకే వెంటనే చికిత్స చేయటం జరుగుతుంది.
ఈ సర్జరీ లో లాపరోస్కోపీ అనే పద్దతి ద్వారా కడుపులో ఒక చిన్న రంద్రం చేసి దాని ద్వారా సర్జరీ చేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఫాలోపియన్ ట్యూబ్ కి ఎలాంటి నష్టం కలగదు కానీ ఒకవేళ ట్యూబ్ రప్చర్ అయితే మాత్రం తొలగించే అవకాశాలు ఉంటాయి.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క చికిత్స ఎలా చేయటం జరుగుతుంది ?
ఇంతకు ముందు చెప్పిన విధంగా ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ సాధారణ ప్రెగ్నన్సీ లా జరగదు పైగా కొన్ని సందర్భాలలో తల్లి ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ ప్రెగ్నన్సీ ను మెడిసిన్ సహాయం తో లేదా లాపరోస్కోపిక్ సర్జరీ (laparoscopic) ద్వారా తొలగించడం జరుగుతుంది.
ప్రెగ్నన్సీ కచ్చితంగా ఎక్టోపిక్ అని నిర్ధారించిన తరవాత చికిత్స మొదలవుతుంది. లక్షణాలు తీవ్రంగా లేనట్లయితే మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మెడిసిన్ పిండం ఎక్కువగా పెరగకుండా మరియు పిండాన్ని తొలగించటానికి పనిచేస్తుంది.
మెడిసిన్ ఇచ్చిన తరవాత HCG టెస్ట్ చేయటం జరుగుతుంది. టెస్ట్ పనిచేస్తుందా లేదా కూడా తెలుసుకోవటం జరుగుతుంది.
కొన్ని సందర్భాలలో డాక్టర్స్ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ లో కడుపులో ఒక చిన్న రంద్రం చేసి ఆ రంద్రం ద్వారా కెమెరా అమర్చబడి ఉన్న ఒక డివైస్ ను లోపలి ప్రవేశ పెట్టి ప్రెగ్నన్సీ ను తొలగించటం జరుగుతుంది.
ప్రెగ్నన్సీ ను తొలగించే క్రమంలో ట్యూబ్ ను కూడా తీసేయటం జరుగుతుంది, కొన్ని సందర్భాలలో ట్యూబ్ ను తొలగించనూ పోవక వచ్చు.
సర్జరీ తరవాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
డాక్టర్ సలహా మేరకు సర్జరీ జరిగిన ప్రాంతాన్ని శుభ్రంగా, తడి గా ఉండకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవాలి.
బ్లీడింగ్ జరగటం, వాపు కి గురి అవ్వటం మరియు ఎర్రగా మారటం లాంటి లక్షణాలు ఇన్ఫెక్షన్ కి దారి తీస్తాయి.
సర్జరీ తరవాత ఎక్కువ బరువును ఎత్తకుండా ఉండటం, శృంగారంలో పాల్గొన కుండా ఉండటం మరియు మలబద్దకం సమస్య రాకుండా ఉండటానికి ఎక్కువ నీరు ను తాగాలి.
మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
చివరి మాట :
అమ్మాయిలకు మాతృత్వం ఒక తియ్యని అనుభూతి కానీ ఇలాంటి సందర్భాలలో మానసికంగా చాలా భాదపడుతారు. వీరికి ధైర్యం చెప్పి సపోర్ట్ చెయ్యాలి.
ప్రస్తుతం జరిగిన దాని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. డాక్టర్ తో టచ్ లో ఉండి ఆరోగ్య పరమైన సమస్యలను దూరం చేసుకోవాలి.
Sources :
https://www.mayoclinic.org/diseases-conditions/ectopic-pregnancy/diagnosis-treatment/drc-20372093 https://www.acog.org/womens-health/faqs/ectopic-pregnancy?utm_source=redirect&utm_medium=web&utm_campaign=otn https://my.clevelandclinic.org/health/diseases/9687-ectopic-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply