కొన్ని రోజుల క్రితం మన ఇండియా కు చెందిన కోవిషీల్డ్ వాక్సిన్ కు సంబంధించిన ఫేక్ వ్యాక్సిన్ లు ఆఫ్రికా లో కనిపించాయి అని WHO ప్రకటించింది.
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు అయినా కొంత మంది దీనిని ఒక బిసినెస్ గా మార్చుకుంటున్నారు. ఫేక్ వ్యాక్సిన్ లు తయారు చేసి వేరు వేరు దేశాలకు సరఫరా చేస్తున్నారు.
కానీ మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రోజుకి మన దేశంలో లక్షల సంఖ్య లో వాక్సినేషన్ జరుగుతుంది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒరిజినల్ అని ఎలా గుర్తు పట్టాలి :
కోవిషీల్డ్ మన ఇండియా లో సీరం ఇన్స్టిట్యూట్ వారు తయారు చేస్తున్నారు.
1. లేబుల్ కలర్ ముదురుఆకుపచ్చ రంగు లో ఉంటుంది మరియు అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ యొక్క రంగు కూడా ముదురు ఆకుపచ్చ రంగు లో ఉంటుంది.
2. ఒరిజినల్ వాక్సిన్ మీద బ్రాండ్ పేరు మరియు ట్రేడ్ మార్క్ పేర్కొన బడి ఉంటుంది.
3. వ్యాక్సిన్ మీద రాసే అక్షరాలను సులువుగా చదవటం కోసం ఒక ప్రత్యేక వైట్ ఇన్క్ ను వినియోగించటం జరిగింది. జనరిక్ పేరు మాత్రం బోల్డ్ లో ఉండదు.
4. ఒరిజినల్ వ్యాక్సిన్ పై “CGS NOT FOR SALE” అని ఉంటుంది దీని అర్థం ఇది అమ్మటానికి కాదు అని అర్థం.
5. SII లోగో ఒక ప్రత్యేక ఆంగిల్ లో ప్రింట్ చేయబడి ఉంటుంది. ఈ ప్రత్యేక ఆంగిల్ అనేది కొంత మందికి మాత్రం తెలుసు.
6. మొత్తం లేబుల్ కి ఒక ప్రత్యేక హనీకంబు ఎఫెక్ట్ (Honeycomb) ఇవ్వటం జరుగుతుంది, ఇది ఒక ప్రత్యేక ఆంగిల్ లోనే కనిపిస్తుంది. అయితే ఈ ఎఫెక్ట్ ని కావాలనే కొన్ని చోట్ల మార్చారు.
కో వ్యాక్సిన్ ఒరిజినల్ అని ఎలా గుర్తు పట్టాలి :
1. కో వ్యాక్సిన్ పైన కనిపించని UV హెలిక్స్ లేదా DNA లాగా ఒక ఆకారం ఉంటుంది. ఇది కేవలం యూవీ లైట్ లోనే కనిపిస్తుంది.
2 . లేబుల్ లో మైక్రో టెక్స్ట్ డాట్ ల రూపంలో ఉంటుంది, ఈ టెక్స్ట్ తో కో వ్యాక్సిన్ అని రాసి ఉంటుంది.
3. కో వ్యాక్సిన్ పై Holographic ఎఫెక్ట్ కూడా ఉంటుంది. (1) (2)
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply