ప్రెగ్నెన్సీ ఎలా ఏర్పడుతుంది – How pregnancy happens step by step in Telugu ?

Pixabay

ప్రెగ్నన్సీ అవ్వాలంటే ఒక ఆడ మరియు మగ శృంగారంలో పాల్గొనాలి. శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషాంగం నుంచి వీర్యం వజైనా లోపలికి వెళుతుంది. ఫాలోపియన్ ట్యూబ్ లో  వీర్యం ఎగ్ తో ఫర్టిలైజ్ అయ్యి యూట్రస్ లో ఇంప్లాంట్ (నాటుకుంటుంది) అవుతుంది. శృంగారంలో పాల్గొన్న రోజు నుంచి రెండు నుంచి మూడు వారాల తరవాత  ప్రెగ్నన్సీ మొదలవుతుంది.

పురుషుడి లో ఉండే వీర్యం మరియు మహిళలలో ఉండే ఎగ్స్ ప్రెగ్నన్సీ ఏర్పడటానికి ముఖ్య కారణం. ఈ రెండు కణాలను రీ ప్రొడక్టివ్ సెల్స్ (పునరుత్పత్తి కణాలు) అని అంటారు. 

వీర్య కణం కన్నా ఎగ్ 10,000 రెట్లు పెద్దదిగా ఉంటుంది. శృంగారం లో పాల్గొన్న ప్రతిసారి పురుషుడి నుంచి మిలియన్ల కొద్దీ వీర్య కణాలు బయటికి వస్తాయి. 

ఆడవారిలో నెలకు కేవలం ఒక ఎగ్ మాత్రమే విడుదల అవుతుంది దీనినే ఒవ్యులేషన్ అని అంటారు. 

ఒవ్యులేషన్ అంటే ఏమిటి ?

అందరు అమ్మాయిలలో మెన్స్ట్రువల్ సైకిల్ వేరు వేరు గా ఉంటుంది. కొందరికి 28 రోజులు ఉంటె మరి కొందరికి 35 రోజులు ఉంటుంది. 

ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో  ఓవరీ నుంచి ఒక మెచూర్ ఎగ్ (పరిపక్వ గుడ్డు) విడుదల అయ్యి ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళుతుంది. ఇలా ఎగ్ ఓవరీ నుంచి బయటికి రావటాన్ని ఒవ్యులేషన్ అని అంటారు. 

ఉదాహరణకి 28 రోజుల మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న మహిళలలో ఎక్కువ శాతం 14 వ రోజున ఒవ్యులేషన్ జరుగుతుది.   

సాధారణం గా మానవుల కణాలలో 46 క్రోమోసోములు ఉంటాయి కానీ రీ ప్రొడక్టివ్ కణాలలో కేవలం 23 క్రోమోసోములు ఉంటాయి.              

ఈ ప్రెగ్నన్సీ దశల వారీగా ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాము.

Step 1 : 

అమ్మాయిల శరీరంలో మెన్స్ట్రువల్ సైకిల్ ను కంట్రోల్ చేసే హార్మోన్ కారణంగా ప్రతి నెలా ఒక ఓవరీ నుంచి ఒక మెచూర్ ఎగ్ విడుదల అవుతుంది. రెండు ఓవరీలు ఉన్నా కూడా కేవలం ఒక ఓవరీ నుంచి మాత్రమే ఎగ్ విడుదల అవుతుంది.    దీనినే ఒవ్యులేషన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ యూట్రస్ యొక్క లైనింగ్ ను కూడా ప్రెగ్నన్సీ కోసం మందంగా చేస్తుంది.  

ఒవ్యులేషన్ ద్వారా బయటికి వచ్చిన ఎగ్ 12 నుంచి 24 గంటల వ్యవధి లో ఫాలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణం చేస్తూ యూట్రస్ వైపు కి వెళుతుంది. 

Step 2  :  మిలియన్ల సంఖ్యలో వీర్య కణాలు వజైన లోకి ప్రవేశించిన తరవాత ఎగ్ తో ఫర్టిలైజ్ అవ్వటానికి ఫాలోపియన్ ట్యూబ్ వైపుకు ప్రయాణిస్తాయి. వీర్య కణాలు దాదాపు 5 రోజుల వరకు బతికి ఉంటాయి. ఈ 5 రోజులలో ఎగ్ విడుదల అయితే వీర్యం ఎగ్ తో ఫర్టిలైజ్ అవుతుంది.  

అన్నీ వీర్య కణాల యొక్క లక్ష్యం ఒక్కటే, ఎగ్ తో ఫర్టిలైజ్ అవ్వటం. కణాలు రెండు ఓవరీల వైపు కి వెళతాయి కానీ ఎగ్ మాత్రం కేవలం ఒక్క ఓవరీ నుంచి విడుదల అవుతుంది.

 ఫాలోపియన్ ట్యూబ్ లో ఉన్న ఎగ్ వైపుకు వీర్య కణాలు ఫర్టిలైజ్ అవ్వటానికి వెళతాయి. ఇంత పెద్ద మొత్తంలో కణాలు ఉన్నా కేవలం ఒక్క వీర్య కణం మాత్రమే ఎగ్ తో ఫర్టిలైజ్ అవుతుంది.   

ఒక్క వీర్య కణం ఎగ్ లోపలికి ప్రవేశించిన తరవాత మిగతా వీర్య కణాలు ఎగ్ లోపలికి ప్రవేశించలేవు. వీర్య కణం ఎగ్ లోపలి వెళ్లిన తరవాత ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి యూట్రస్ వైపుకు ప్రయాణిసిస్తుంది.

 ఒక వేళా ఎగ్ ఫర్టిలైజ్ అవ్వకపోతే ఎగ్ చనిపోతుంది. ఫలితంగా యధావిధిగా పీరియడ్స్ వస్తాయి. 

Step 3 : ఫర్టిలైజ్ అయ్యిన తరవాత వేగంగా కణాల విభజన మొదలవుతుంది. విభజించబడ్డ కణాల మొత్తం ఒక బంతి ఆకారంలో కనిపిస్తాయి, దీనినే బ్లాస్టోసిస్ట్ అని అంటారు. ఫర్టిలైజ్ అయ్యిన తరవాత బంతి ఆకారంలో ఉన్న కణాలు 3 నుంచి 4 రోజుల తరవాత యూట్రస్ వరకు చేరుకుంటుంది.

Step 4 : యూట్రస్ లో చేరిన బ్లాస్టోసిస్ట్ 2 నుంచి 3 రోజుల తరవాత యూట్రస్ యొక్క లైనింగ్ కి అతుక్కొని నాటుకుంటుంది, దీనినే ఇంప్లాంటేషన్ అని అంటారు. ప్రెగ్నన్సీ లో ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. ఇంప్లాంటేషన్ ప్రక్రియ కూడా పూర్తి అవ్వటానికి 3 నుంచి 4 రోజులు పడుతుంది. 

Step 5 : బ్లాస్టోసిస్ట్ లోపలి భాగంలో ఉన్న కణాల నుంచి ఎంబ్రియో (పిండం) ఎదుగుతుంది, బ్లాస్టోసిస్ట్ బయటి వైపు ఉన్న కణాల ద్వారా ప్లాసెంటా అభివృద్ధి చెందుతుంది. 

ప్లాసెంటా ద్వారా నే పిండానికి ఆక్సిజన్, న్యూట్రియంట్లు మరియు హార్మోన్స్ చేరుతాయి. ఒక రకంగా లైఫ్ సపోర్ట్ సిస్టం అని చెప్పవచ్చు.    

ఇంప్లాంటేషన్ విజయవంతం అయ్యిన తరవాత hCG అనే హార్మోన్  విడుదల అయ్యి పీరియడ్స్ అవ్వకుండా ఆపేస్తాయి.  

ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ కూడా hCG అనే హార్మోన్ ను డిటెక్ట్ చేస్తాయి. ఈ హార్మోన్ ఉందని డిటెక్ట్ అయ్యిందంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యారని అర్థం.  

ఇక్కడినుంచి ప్రెగ్నెన్సీ మొదలయ్యింది అని చెప్పవచ్చు. 

ప్రెగ్నన్సీ మొదలవ్వగానే వాటి లక్షణాలు మీరు గమనించవచ్చు. 

  • పీరియడ్స్ రాకుండా ఉండటం
  •  వాంతికి వచ్చినట్లు అనిపించటం
  •  మలబద్దకం అవ్వటం
  • రొమ్ములను తాకినప్పుడు నొప్పిగా అనిపించటం 
  • అలసి పోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 

లక్షణాలతో పాటు ప్రెగ్నన్సీ టెస్ట్ చేసిన తరవాతే గర్భం దాల్చినట్లు నిర్ధారించుకోవటం మంచిది.    

Sources :

https://www.plannedparenthood.org/learn/pregnancy/how-pregnancy-happens

https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy#:~:text=How%20does%20pregnancy%20begin%3F,cell%20divides%20into%20multiple%20cells.

https://www.uofmhealth.org/health-library/tw9234

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.