బ్లాక్ బెర్రీ వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు – 10 Health benefits of Blackberry in Telugu

Blackberry benefits in Telugu

బ్లాక్ బెర్రీ ను చాలా మంది బ్లాక్ రాస్బెర్రీ తో కన్ఫ్యుజ్ అవుతుంటారు. వీటిలో ఉండే ముఖ్య తేడా ఏమిటంటే బ్లాక్ బెర్రీ ను సగం కోసినప్పుడు మధ్యభాగంలో ఖాళి ఉండదు కానీ  రాస్బెర్రీ ను సగం గా కోసినప్పుడు పండు మధ్యభాగం ఖాళీగా ఉంటుంది.  

ఈ పండును దాదాపు 2500 సంవత్సరాల నుంచి తింటూ వస్తున్నారు, ఇది మిగతా బెర్రీస్ లాగా చాలా రుచిగా ఉంటుంది. 17  వ శతాబ్దంలో బ్లాక్ బెర్రీ లను వైన్ తయారీ కోసం వినియోగించటం మొదలుపెట్టారు.

ఈ పండును తినే పదార్థాలైనా పై (pie), జెల్లీ (jelly) మరియు జామ్(Jam) ల తయారీ లో కూడా ఉపయోగిస్తారు. 

ఈ పండు చూడటానికి చిన్నదిగ ఉన్నా వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పలు దేశాలలో బ్లాక్ బెర్రీ ను వైద్య పరంగా ఒక ఔషధం లాగా కూడా వినియోగిస్తారు.     

ఇప్పుడు బ్లాక్ బెర్రీ వల్ల కలిగే 7 ప్రయోజనాలను చూద్దాము 

1. బ్లాక్ బెర్రీస్ లో పుష్కలంగా పోషకవిలువలు ఉంటాయి  

ఒక 100 గ్రాముల బ్లాక్ బెర్రీ లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి.

పేరుమొత్తం
శక్తి (Energy) 43kcal
Vitamin A, IU214IU
నీరు  (Water)88.2g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)9.61g
ఫైబర్  (Fiber)5.3g
షుగర్  (Sugars)4.88g
ఫ్రూక్టోజ్ (Fructose)2.4g
గ్లూకోజ్ (Glucose)2.31g
ప్రోటీన్ (Protein)1.39g
కొవ్వు (fat)0.49g
పొటాషియం (Potassium)162mg
కాల్షియం (Calcium)29mg
ఫాస్ఫరస్ (Phosphorus)22mg
Vitamin C21mg
మెగ్నీషియం  (Magnesium)20mg
కోలిన్ (Choline)8.5mg
Vitamin E 1.17mg
సోడియం (Sodium)1mg
కెరోటిన్ (Carotene)128µg
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin)118µg
Vitamin K 19.8µg

2. బ్లాక్ బెర్రీస్ డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది 

బ్లాక్ బెర్రీస్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు అయిన ఆంథోసైనిన్స్ మరియు ఈ పండు లో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు డయాబెటిస్ భాదపడుతున్న వారికి ఇన్సులిన్ రెసిస్టన్స్ ను మరియు కొవ్వు శాతాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది.

3. బ్లాక్ బెర్రీస్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడుతుంది

బ్లాక్ బెర్రీస్ లో ఫైబర్ మంచి మోతాదులో ఉంటుంది, ఈ పండులో ఉండే ఇన్ సాల్యుబుల్ ఫైబర్ (insoluble fiber) అంటే కరగని పీచు పదార్థము జీర్ణ క్రియకి చాలా బాగా దోహదపడుతుంది. మలాన్ని సులువుగా కదలడానికి కూడా దోహదపడుతుంది.

ఇంతేకాకుండా కడుపుకు సంబంధించిన మలబద్దకం (constipation) సమస్య నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.   

4. బ్లాక్ బెర్రీస్ లో మంచి ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి 

బ్లాక్ బెర్రీస్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు అయిన ఆంథోసైనిన్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో సహాయపడతాయి. 

ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో దీర్ఘ కాలిక వ్యాధులకు దారి తీస్తాయి. ఆంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల పలు రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు   

5. బ్లాక్ బెర్రీస్ లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది 

ఒక 100 గ్రాముల బ్లాక్ బెర్రీ లో 21 మిల్లీ గ్రాముల విటమిన్ C ఉంటుంది. విటమిన్ C మన శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ C కొల్లాజిన్అనే ప్రోటీన్ తయారీకి దోహదపడుతుంది. కొల్లాజిన్ మన శరీరంలో ఎముకల ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.   

6. బ్లాక్ బెర్రీస్ మెదడు యొక్క ఆరోగ్యానికి  సహాయపడుతుంది 

బెర్రీస్ వయసు తో పాటు వచ్చే మతిపరుపు లాంటి సమస్యలను అధిగమించడంలో దోహదపడుతుంది. ఇంకా వయసు తో పాటు వచ్చే జ్ఞాన పరమైన సమస్యలనుంచి కూడా కాపాడుతుంది. 

7. బ్లాక్ బెర్రీస్ పంటి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది 

 బెర్రీస్ లో ఉండే ఆంటీ బాక్టీరియల్ మరియు ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పంటి రోగాలకు కారణమయ్యే బాక్టీరియా నుంచి కాపాడుతుంది.

బ్లాక్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ నోటికి సంబంధించిన చిగుళ్ల సమస్యలు మరియు కావిటీస్ (cavities) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. 

Sources: https://pubmed.ncbi.nlm.nih.gov/22082199/

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6115824/

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3282468/

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4127818/

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.