ఆపిల్ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు – 10 Apple health benefits in Telugu.

Image by Mircea Ploscar from Pixabay

“One apple a day keeps the doctor away” (రోజు ఒక సేబు పండు డాక్టర్ ని దూరం గా ఉంచుతుంది) అనే మాట మనం విని ఉంటాము. చాలా మంది పేషెంట్స్ కి డాక్టర్స్ ఆపిల్ తినమని సలహా ఇస్తుంటారు. మనలో చాలా మంది కి ఆపిల్ లేదా సేబు పండు తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలియవు. అసలు ఎందుకు ఆపిల్ ని డాక్టర్స్ తినమని సలహా ఇస్తుంటారు ?

ఇప్పుడు ఆపిల్ లో ఉండే 10 ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము.

ఆపిల్ లో విటమిన్ సి ఉంటుంది అందుకే ఇది ఒక ఆంటియాక్సిడెంట్ లాగా పని చేస్తుంది.ఆపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదల కి దోహద పడుతుంది. ఇంతే కాకుండా ఆపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల రోగాలు రాకుండా సహాయ పడుతుంది. ఒక మీడియం ఆపిల్ లో 95 కెలోరీలు ఉంటాయి.

ఒక 100 గ్రాముల సేబు పండు లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి (1).  

పేరుమొత్తం
శక్తి (Energy)52kcal
నీరు (Water)85.6g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)13.8g
షుగర్ (Sugar)10.4g
ఫైబర్ (Fiber)2.4g
ప్రోటీన్ (Protein)0.26g
Total lipid (fat)0.17g
పొటాషియం (Potassium)107mg
ఫాస్ఫరస్ (Phosphorus)11mg
కాల్షియం (Calcium)6mg
మెగ్నీషియం (Magnesium)5mg
Vitamin C4.6mg
కోలిన్ (Choline)3.4mg
సోడియం (Sodium)1mg
Vitamin E0.18mg
ఐరన్ (Iron)0.12mg
Vitamin B-60.041mg
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin)29µg
కెరోటిన్ (Carotene)27µg

1. బరువు తగ్గటం (Weight Loss) :

ఆహారం తీసుకునే ముందు ఆపిల్ ని తిన్నట్లయితే కడుపు నిండినట్లు అయి తక్కువగా తింటాము. ఆపిల్ లో తక్కువ కెలోరీలు మరియు ఫైబర్ కూడా మంచి మోతాదులో ఉండటం వల్ల బరువు తగ్గడానికి దోహద పడుతుంది.

తినే ముందు ఆపిల్ ని తినడం వల్ల దాదాపు మనము 200 కెలోరీలు తక్కువ తినే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం తీసుకునే అరగంట ముందు పండ్లు తినడం మంచిది (2). 

బ్రెజిల్ లో 49 ఊబకాయ మహిళల పై 10 వారాల పాటు జరిగిన పరిశోధనలో రోజూ 300 గ్రాముల ఆపిల్ పండును ఇవ్వటం జరిగింది. 10 వారాల తరవాత ఈ మహిళలలో 1.3 కిలో గ్రాముల బరువు తగ్గినట్లుగా గుర్తించటం జరిగింది (3).

2. గుండె ఆరోగ్యం (Good for heart) :

ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది, కొంత మంది శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సేబు పండు గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

ఈ కాలంలో ఎక్కువ మోతాదులో మనుషులు చనిపోయే వ్యాధులలో గుండె కు సంబంధించిన వ్యాధి ఒక పెద్ద కారణం అని చెప్పవచ్చు. మన డైట్ లేదా రోజు మనం తినే ఆహార పదార్థాలు కూడా గుండె కు సంబంధిన వ్యాధులలో పెద్ద పాత్రను పోషిస్తాయి. 

ఒక పరిశోధన ప్రకారం 71 గ్రాముల కన్నా ఎక్కువగా ఆపిల్ పండును తిన్న మహిళలను ఆపిల్ తినని మహిళతో పోల్చినప్పుడు 43% గుండె కు సంబంచిన వ్యాధుల రిస్క్ తగ్గినట్లు గమనించటం జరిగింది. 

ఇలాగే 54 గ్రాముల కన్న ఎక్కువగా ఆపిల్ పండును తిన్న పురుషులను తినని వారితో పోల్చినప్పుడు 19% రిస్క్ తగ్గినట్లు గమనించటం జరిగింది (4).  

3. మధుమేహం (Diabetes) :

ఈ రోజుల్లో చిన్న వయసునుండి ముసలి వాళ్ళ దాక తేడా లేకుండా షుగర్ లేదా డయాబెటిస్ అనే రోగం బారిన పడుతున్నారు.ప్రస్తుత కాలంలో డయాబెటిస్ తో పాటు టైపు 2 డయాబెటిస్ బాధ పడేవారిని చూస్తూ ఉంటాము.

మహిళలపై జరిగిన ఒక పరిశోధనలో ప్రతి రోజు ఒక ఆపిల్ పండు ను తినే వారిలో 28% టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని గమనించటం జరిగింది (5).  

 షుగర్ వ్యాది  ఇన్సులిన్ తగ్గడం వల్ల వస్తుంది. ఇన్సులిన్ ని పాంక్రియాస్ (pancreas) లో ఉండే బీటా సెల్స్ ఉత్పత్తి చేస్తాయి.అయితే ఈ బీటా సెల్స్ కి నష్టం కలగకుండా ఆపిల్ లో ఉండే పోలీఫెనోల్స్ (Poly phenols) కాపాడుతాయి. 

ఇదే కాకుండా తిన్న తరవాత శరీరంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో కూడా మంచి పాత్ర నిర్వహిస్తుంది (5.1).

4. క్యాన్సర్ (Cancer) :

ప్రపంచంలో మనుషుల చావుకు కారణమయ్యే వ్యాధులలో కాన్సర్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మంచి డైట్ మరియు  పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు కాన్సర్ నుంచి కాపాడే అవకాశాలు ఉన్నాయి (6).  

టెస్ట్ ట్యూబ్ మరియు జంతువుల మీద చేసిన పరిశోధనల ప్రకారం ఆపిల్ పండు పెద్ద ప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుందని అని తేలింది (7) (8) (9). 

5. ఎముకల సామర్థ్యం (Bone Health) :

మన వయసు పెరిగే కొద్దీ మన ఎముకల సామర్థ్యం తగ్గుతుంది, నేల పై కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది అందుకే చాలా మంది కుర్చీల పైనే కూర్చోవడానికి ఇష్టపడతారు.

పండ్లు మరియు కూరగాయల్లో ఉండే న్యూట్రియంట్లు ఎముకల ఆరోగ్యాన్నిపెంచటంలో మరియు ఎముకల నుంచి కాల్షియం ఎక్కువ మోతాదులో నష్ట పోకుండా ఉండటానికి కాపాడుతాయి (10) (11).  

ఆపిల్స్ లో Antioxidants మరియు anti-inflammatory  సమ్మేళనాలు ఎముకల సామర్థ్యాన్ని పెంచుతుంది అని చెప్పవచ్చు.

15 మంది మహిళలపై జరిపిన ఒక పరిశోధనలో తాజా ఆపిల్ పండ్లని తినడానికి ఇవ్వటం జరిగింది. ఫలితంగా ఆపిల్ తిన్న వారిలో తినని వారి కన్న తక్కువ కాల్షియం శరీరం నుంచి బయటికి వెళ్లినట్లు గమనించటం జరిగింది (12).  

6. మెదడు (Brain) :

చిన్న పిల్లలు ఏదైనా చూసిన విన్నా త్వరగా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది,కాని అదే వయసు పై బడిన వారి లో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గి పోతూ ఉంటుంది కానీ ఆపిల్ తినే వారిలో మాత్రం మెదడు కి సంభందించిన రోగాల నుండి కాపాడుతుందని చెప్పొచ్చు.

ఒక పరిశోధన లో ఎలుకలకు 1 నెల వరకు ఆపిల్ జ్యూస్ ఇవ్వటం జరిగింది. ఫలితంగా వయస్సు తో పాటు వచ్చే కాంగ్నిటివ్ (Congnitive) సమస్యలను మెరుగుపరిచింది. ముసలి వాళ్ళలో ఆపిల్ బహుశా జ్ఞాపక శక్తి ని పెంచుతుందని చెప్పవచ్చు (13).  

ఇంకొక జంతువు పరిశోధన లో ఎలుకలకు ఒక నెల ఆపిల్ జ్యూస్ కాన్సంట్రేట్ ఇవ్వటం జరిగింది. ఫలితంగా మెదడు యొక్క కణజాలాన్ని (tissue) ను నష్టపరిచే రియాక్టీవ్ ఆక్సిజన్ స్పీసీస్ (ROS) యొక్క తీవ్రతను తగ్గించింది మరియు కాంగ్నిటివ్ స్థాయిలను తగ్గకుండా కాపాడింది (14).

ఆపిల్ జ్యూస్ కాన్సంట్రేట్ వయసు తో పాటు తగ్గే ఎసిటైల్కోలిన్ (acetylcholine) అనే న్యూరో ట్రాన్స్మిటర్ ను తగ్గకుండా ఉండటంలో కాపాడుతుంది. ఇంతే కాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా కాపాడుతుందని చెప్పవచ్చు. 

ఈ పరిశోధనల వల్ల తెలిసే విషయం ఏమిటంటే అంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలైన ఆపిల్ ను తీసుకోవటం వల్ల వయసు తో పాటు వచ్చే జ్ఞాన పరమైన సమస్యలనుంచి కాపాడుతుందని చెప్పవచ్చు (15).

7. ఆస్థమా (Asthama) :

మనం తినే ఆహారంలో సరైన మోతాదులో అంటి యాక్సిడెంట్ లు లేకపోవటం వల్ల ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి (16). 

68,535 మహిళలపై చేసిన ఒక పరిశోధన లో ఆపిల్ పండు ఆస్థమా తీవ్రతను తగ్గించినట్లు గమనించటం జరిగింది. 31 గ్రాముల కన్న ఎక్కువగా ఆపిల్ తిన్న వారిలో ఆస్థమా వచ్చే అవకాశాన్ని 10 % తగ్గించింది (17). 

8. జీర్ణ సమస్యలు (Digestion and gut health) :

కొన్ని అధ్యయనాల ప్రకారం ఆపిల్ పండు హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే గ్యాస్ట్రిక్ అల్సర్ (జీర్ణాశయంలో కలిగే పుండు) నుంచి కాపాడుతుందని గమనించటం జరిగింది. ఇదే కాకుండా శరీరంలో ఏర్పడే మ్యుటేషన్స్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడే అవకాశాలు ఉన్నాయి (18) (19).  

9. మలబద్దకం సమస్యలు (Constipation) :

కొంత మందికి మలం సరిగా రాదు, వచ్చినట్లు అనిపిస్తుంది కాని రాదు ఇలాంటి వారు ఆపిల్ తిన్నట్లైతే మలబద్దకం (constipation) సమస్య ఉండదు. ఆపిల్ లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ (soluble fiber) శరీరంలో జీర్ణ సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది(20) (21).

10. శరీరం లోని కొవ్వు (Cholesterol) :

మనలో చాలా మంది జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు ఫలితంగా శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఇలా పెరిగిన కొవ్వు గుండె పోటు కి కూడా దారి తీయవచ్చు. ఆపిల్ తినడం వల్ల శరీంలో మరియు రక్తం లోని కొవ్వు నియంత్రణలో ఉంటుంది.

జంతువుల పై చేసిన ఒక పరిశోధన ప్రకారం ప్రతి రోజు 2 పెద్ద ఆపిల్ పండ్లు లేదా ఆపిల్ జ్యూస్ ను 12 వారాల వరకు ఇవ్వటం జరిగింది. 12 వారాల తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్లు గమనించటం జరిగింది (22). 

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.