కోవిడ్ – 19 వైరస్ ఈ ప్రపంచంలో 2020 నుంచి ఇప్పటి వరకు అనేక మందిని బలి తీసుకుంది. ఇప్పటివరకు కూడా ఈ వైరస్ కు ఎలాంటి మందు కనుగొన లేదు.
ఇలాంటి సమయంలో మన శరీరంలో ఆంటీబాడీస్ ను తయారు చేసుకోవటం ఒక్కటే దారి. కరోనా ను అంతం చేసే ఆంటీబాడీస్ ను నాచురల్ గా కానీ లేదా ఆర్టిఫీషియల్ గా మన శరీరంలో తయారు చేసుకోవచ్చు.
హెర్డ్ ఇమ్మ్యూనిటి ద్వారా మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం ఆంటీబాడీస్ ను నాచురల్ గా తయారు చేసుకుంటుంది. నాచురల్ గా ఆంటీబాడీస్ ను తయారుచేయటం అందరి వల్ల సాధ్యం కాదు. అందరి ఇమ్మ్యూనిటి బలంగా ఉండదు అందుకే ఇది ప్రమాదకరం.
ఆర్టిఫీషియల్ గా ఆంటీబాడీస్ ను వ్యాక్సిన్ ద్వారా తయారు చేయవచ్చు. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చూడటం మరియు న్యూస్ చూసి వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఆలోచించటం మొదలుపెట్టారు.
వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ? వ్యాక్సిన్ కు సంభందించి మనలో ఉన్న 10 అపోహల గురించి చూద్దాము.
Table of Contents
1. వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతారు (Vaccine causes death):
వ్యాక్సిన్ ను తయారు చేయడానికి వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ను తీసుకోవడం జరుగుతుంది. ఈ జెనెటిక్ మెటీరియల్ ను గుర్తించి మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం ఆంటీబాడీస్ ను తయారు చేయడం మొదలుపెడుతుంది.
వ్యాక్సిన్ లో ఒక మనిషిని చంపడానికి కారణమయ్యే ఎలాంటి పదార్థలను ఉపయోగించడం జరగదు.
2. వ్యాక్సిన్ లో చిప్ ఉంటుంది (Vaccine contains RFID chip) :
ఈ రెండవ అపోహ ప్రకారం బిల్ గేట్స్ అన్ని రకాలైన వ్యాక్సిన్లలో RFID చిప్ ను ఉంచడం జరిగింది. RFID చిప్ ద్వారా ప్రభుత్వం మరియు బిల్ గేట్స్ మనల్ని ట్రాక్ చేస్తారు.
ప్రస్తుతం ఉన్న అన్ని వ్యాక్సిన్లను వివిధ కంపెనీలు తయారు చేస్తాయి. బిల్ గేట్స్ కి ఈ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదు.
వ్యాక్సిన్ లో వైరస్ కు చెందిన చిన్న జెనెటిక్ మెటీరియల్ తప్ప ఏమి ఉండదు.
3. వ్యాక్సిన్ జనాభా ను తగ్గిస్తుంది (Vaccine causes depopulation):
ప్రస్తుతం ప్రపంచం లో అతి పెద్ద సమస్య జనాభా, అన్ని దేశాలు జనాభాను తగ్గించటానికి ప్రణాలికను చేసారు. మనలో కొంత మంది కోవిడ్ – 19 వ్యాక్సిన్ ను జనాభాను తగ్గించడానికి వివిధ దేశాలు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఒక అబద్దం మరియు అవాస్తవం.
మనలో చాలా మంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వీరికి కొన్ని సంవత్సరాల వరకు వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు అన్ని వ్యాక్సిన్లు చిన్న పిల్లలను భయంకర మైన రోగాలతో కాపాడాయి తప్ప ఎవరి ప్రాణాలు తీయలేదు.
ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఈ మహమ్మారి నుంచి కాపాడటానికి సహాయ పడుతుంది.
4. వ్యాక్సిన్ ఒక మతం వారిని టార్గెట్ చేస్తుంది (Vaccine causes infertility):
మన దేశం లో ఉండే కొన్ని మతాల వారు ప్రభుత్వం పై ఆరోపణలు ఎం చేస్తున్నారంటే వ్యాక్సిన్ కేవలం తమ మతం వారిని నపుంసకులను చేయడానికి ఉపయోగిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.
వాస్తవం ఏంటంటే వ్యాక్సిన్లను తయారు చేసే వివిధ కంపెనీలు మతం ను ఆధారం చేసుకొని వ్యాక్సిన్లను తయారు చెయ్యరు. వ్యాక్సిన్ వేసేటప్పుడు మతం అడిగి వ్యాక్సిన్ వెయ్యరు.
వ్యాక్సిన్ ను కేవలము కరోనా రోగాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది.
5. వ్యాక్సిన్ డిఎన్ఏ ను మారుస్తుంది (Vaccine changes DNA) :
వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లిన తరవాత అది మన DNA ను మారుస్తుందని కొందరు నమ్ముతున్నారు . డిఎన్ఏ మార్పు చెందటం వల్ల మనుషులు మృగాలుగా, జంతువులుగా, జాంబీస్ గా మారుతారని అని అపోహలు ఉన్నాయి.
వ్యాక్సిన్ కేవలం ఆంటీబాడీస్ ను తయారు చేయటం లో మాత్రమే సహాయపడుతుంది. వ్యాక్సిన్ వల్ల డిఎన్ఏ లో ఎలాంటి మార్పులు కలగవు.
6 . వ్యాక్సిన్ వల్లనే కరోనా వ్యాధి వ్యాపిస్తుంది (Vaccine spreads Covid -19 ):
కరోనా వ్యాధి వైరస్ వల్ల కాకుండా వ్యాక్సిన్ వల్ల వ్యాప్తి చెందుతుందని కొందరు నమ్ముతున్నారు. వ్యాక్సిన్ లో వైరస్ కు సంభందించిన జన్యువు పదార్థము ఉంటుంది అంతే తప్ప వ్యాక్సిన్ వైరస్ ను వ్యాప్తి చెయ్యదు.
7. కరోనా వైరస్ ద్వారా వ్యాక్సిన్ అమ్మడానికి కొంత మంది కుట్ర (Vaccine is conspiracy theory)
ఈ వైరస్ ను కావాలనే సృష్టించారని, వైరస్ అన్ని దేశాలను వ్యాప్తి చెందిన తరవాత వ్యాక్సిన్ అమ్మి డబ్బు సంపాదించాలని కొంత మంది ధనికులు ఇలా చేసారని వాట్సాప్ లో చూసి కొంత మంది నమ్ముతున్నారు.
కరోనా కారణంగా అన్ని దేశాలకు దెబ్బ పడింది, చాలా మంది చనిపోయారు. ఇలా ఎవరైనా కుట్ర చేసారు అనేదానికి ఆధారాలు లేవు.
ప్రస్తుతం మనము ఎలాంటి అపోహలను నమ్మకుండా వ్యాక్సిన్ ను తీసుకోవటం వల్ల ఈ రోగం బారి నుండి బయట పడవచ్చు.
Disclaimer (గమనిక ): తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Sources : 1. https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/facts.html
2. https://www.muhealth.org/our-stories/covid-19-vaccine-myths-vs-facts
3. https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/coronavirus/covid-19-vaccines-myth-versus-fact
Leave a Reply