ఈ ట్రిమ్స్టర్లోనే మీరు మీ బిడ్డకు జన్మనివ్వ బోతున్నారు, ఈ ట్రిమ్స్టర్ మీ ప్రెగ్నెన్సీ యొక్క ఆఖరి మూడు నెలలు.
Table of Contents
ఇరవై ఎనిమిదవ వారం (Week 28) :
ఈ వారంలో మీ బిడ్డ 37.6cm ల పొడవు ఉంటుంది మరియు ఆకారంలో ఒక పైన్ ఆపిల్ పండంత ఉంటుంది. ఈ వారంలో ఫీటస్ యొక్క బరువు 1 KG ఉంటుంది.
ఈ వారంలో ఫీటస్ యొక్క గుండె నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. మీ భర్త బిడ్డ యొక్క చప్పుడును చెవి పెట్టి వినవచ్చు కానీ కొన్నిసార్లు ఇది కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు.
ఇరవై తొమ్మిదవ వారం (Week 29) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 38.6cm ఉంటుంది మరియు బరువు 1.2 kg లు ఉంటుంది. ఈ వారంలో మీ బిడ్డ దాదాపు పూర్తిగా అభివృద్ధి చెందింది.
గత వారాలలో ఫీటస్ ఒక తెల్లటి పొరతో కప్పబడి ఉండేది కానీ ఇప్పుడు ఆ పొర మాయమవుతుంది.
ముప్పైవ వారం (Week 30) :
ఈ వారం ఫీటస్ యొక్క పొడవు 39.9 cm లు ఉంటుంది మరియు ఆకారం ఒక క్యాబేజీ అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు 1.3kg లుగా ఉంటుంది.
ముప్పై ఒకటవ వారం (Week 31) :
ఈ వారం ఫీటస్ యొక్క పొడవు 41.1cm లు ఉంటుంది మరియు ఆకారం ఒక కొబ్బరి బొండమంతా ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు ఈ వారంలో 1.5kg లు ఉంటుంది. ఫీటస్ ఇప్పుడు చాలా ఆక్టివ్ గా, కదులుతూ ఉంటుంది.
ముప్పై రెండవ వారం (Week 32) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 42.4cm లు ఉంటుంది మరియు బరువు 1.7kg లుగా ఉంటుంది. ఈ వారంలో బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందింది. ఇక్కడి నుంచి బిడ్డ యొక్క బరువు పెరుగుతుంది. బిడ్డ పెరగటం వల్ల మీ కడుపులో చాలా తక్కువగా స్థలం ఇప్పుడు ఉంటుంది. బిడ్డ కూడా కడుపులో కదులుతూ ఉంటుంది.
మీ శరీరంలో కలిగే మార్పులు :
ఇరవై ఎనిమిదవ వారంలో అజీర్ణం మరియు గుండెలో మంట లాగా కూడా అనిపిస్తుంది. బిడ్డ యొక్క బరువు కూడ మోయటం వల్ల కూడా మీ వీపు వెనక భాగం నొప్పిగా అనిపించవచ్చు.
ఇరవైతొమ్మిదవ వారంలో కూడా మీకు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే బిడ్డ వల్ల ఊపిరితిత్తుల పై వత్తిడి పెరుగుతుంది. అలాగే బ్లాడర్ కూడా ఒత్తిడి కి గురిఅవ్వటం వల్ల తరచూ యూరీన్ వస్తుంది.
మీరు ఎలా అయితే పడుకొని లేస్తూ ఉంటారో అలాగే మీ బిడ్డ కూడా పడుకొని లేస్తూ ఉంటుంది. ముప్పైవ వారంలో మీకు నిద్ర కు సంబంధించిన సమస్యలు కూడా రావొచ్చు మరియు చెడు కళలు కూడా రావొచ్చు.
ముప్పై ఒకటవ వారంలో కొంత మంది లో బిడ్డ యొక్క తల కింది వైపు వస్తుంది డెలివరీ కి రెడీ గా అవుతుంది. కొంత మంది లో ఫీటస్ ఈ వారంలో తల కింది వైపుకు రాదు. పురిటి నొప్పులు వచ్చే సమయంలో ఫీటస్ యొక్క తల కింది వైపుకు వస్తుంది.
ముప్పై రెండవ వారం నుంచి మీ శరీర బరువు ప్రతి వారానికి అరా కేజీ పెరుగుతూ ఉంటుంది. మీ శరీరం తో పాటు బిడ్డ యొక్క శరీర బరువు మరియు కొవ్వు శాతం పెరుగుతుంది.
Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/1st-trimester/week-12/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/12-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి
Leave a Reply