రెండవ ట్రిమ్స్టర్ లో రెండు నెలలు పూర్తి చేసుకున్న తరవాత ఇప్పుడు మీరు మూడవ నెలలో అడుగు పెడతారు. మొదటి ట్రిమ్స్టర్ మరియు రెండవ ట్రిమ్స్టర్ కలిపి మొత్తం ఆరు నెలలు పూర్తి చేసుకున్నారు. ఈ నెలలో కూడా మొత్తం 5 వారాలు ఉంటాయి. 22 వ వారం నుంచి 27 వ వారం వరకు రెండవ ట్రిమ్స్టర్ యొక్క ఆఖరి నెల ఉంటుంది.
Table of Contents
ఇరవై మూడవ వారం (Week 23) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడువు 28.9cm ఉంటుంది మరియు ఆకారం స్క్వాష్ అంత ఉంటుంది. ఈ వారంలో ఫీటస్ యొక్క బరువు 500 గ్రాములు ఉంటుంది. కొన్ని వారాల వరకు కడుపులో బిడ్డ తన్నటం మీరు గమనిస్తూ ఉంటారు.
ఒక వేళ మీ బిడ్డ కడుపులో తన్నడం ఆపినట్లు గమనించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
ఇరవై నాల్గవ వారం (Week 24) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడువు 30cm లు ఉంటుంది మరియు ఆకారం మొక్కజొన్న అంత ఉంటుంది. ఈ వారం ఫీటస్ యొక్క బరువు 600 గ్రాములు ఉంటుంది.
ఏదైనా అనుకోని కారణాల వల్ల బిడ్డ ఈ వారంలో జన్మిస్తే బతికే అవకాశం ఉంటుంది ఎందుకంటే బయటి ప్రపంచంలో బతకడానికి కావలసిన అవయవాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఉంటాయి.
త్వరగా బిడ్డ పుట్టడం వైకల్యానికి దారి తీస్తుంది. 37 వ వారం కి ముందు బిడ్డ పుట్టినట్లైతే దానిని ప్రీ మెచూర్ లేబర్ అని అంటారు.
ఇరవై అయిదవ వారం (Week 25) :
ఈ వారంలో మీ బిడ్డ యొక్క పొడవు 34.6 cm ఉంటుంది మరియు ఆకారం కాలీఫ్లవర్ అంత ఉంటుంది. ఈ వారంలో ఫీటస్ యొక్క బరువు 660 గ్రాములు ఉంటుంది.
ఈ వారంలో ఫీటస్ చాలా ఆక్టివ్ గా ఉంటుంది. బయట చేసే శబ్దాలకు స్పందిస్తూ ఉంటుంది. ఫీటస్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లో యూరీన్ చేస్తూ ఉంటుంది. ఫీటస్ చుట్టూ ఉండే యూరీన్ బిడ్డ కు మంచి ఉష్ణోగ్రతను అందజేస్తుంది.
ఇరవై ఆరవ వారం (Week 26) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 35.6cm ల పొడవు ఉంటుంది మరియు బరువు 760 గ్రాములు ఉంటుంది. ఈ సమయంలో మొదటి సారి ఫీటస్ కళ్ళను తెరుస్తుంది. బిడ్డ మొదటిసారి కళ్ళను ఎలా తెరవాలో మరియు మూయాలో నేర్చుకుంటుంది.
ఫీటస్ గా ఉన్న సమయంలో బిడ్డ యొక్క కళ్ళ రంగు నీలం రంగు గా ఉంటుంది కానీ పుట్టిన తరవాత తల్లి తండ్రుల జెనెటిక్స్ ప్రకారం కళ్ళ యొక్క రంగు మారుతుంది.
ఇరవై ఏడవ వారం (Week 27) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 36.6cm ల పొడవు ఉంటుంది మరియు బరువు 875 గ్రాములు ఉంటుంది.
ఈ వారంలో ఫీటస్ యొక్క అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఫీటస్ యొక్క ఊపిరితిత్తులు కూడా శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
మీ శరీరంలో కలిగే మార్పులు :
ఈ వారంలో మీ రొమ్ముల నుంచి పాలు లీక్ అవ్వటం కూడా గమనిస్తారు. తల్లి పాలు బిడ్డకు మంచి అంటువ్యాధుల నుంచి కాపాడటంలో ఇమ్మ్యూనిటీ ను పెంచుతుంది.
ఇరవై మూడవ వారంలో మీ కడుపు పెద్దగా అవుతుండటం వల్ల రిబ్స్ లో నొప్పి గా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవటం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఇరవై నాల్గవ వారంలో మీకు చాలా ఆకలిగా అనిపించవచ్చు. మూడవ ట్రిమ్స్టర్ వరకు ఎక్కువగా తినకపోవడం మంచిది ఎందుకంటే ఎక్కువగా తినటం వల్ల శరీర బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఇరవై అయిదవ వారంలో మీ ముఖం, చేతులు మరియు కాళ్ళు కొంచెం లావుగా అయినట్లు అనిపిస్తుంది. ఈ కండిషన్ సాధారణమైనదే కానీ ఈ విషయాన్ని డాక్టర్ తో కూడా షేర్ చేయాలి.
ఈ కండిషన్ లో డాక్టర్ మీ బ్లడ్ ప్రెషర్ ను కూడా చెక్ చేస్తారు. మీకు ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్ కు తెలియ చేయాలి.
ఇరవై ఆరవ వారంలో ఎక్కువగా కాళ్లలో నొప్పి కలుగుతుంది. రాత్రి పడుకునే సమయంలో ఈ నొప్పి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఇరవై ఏడవ వారంలో మీ శరీర బరువు పెరిగినట్లు గమనిస్తారు అలాగే మలబద్దకం సమస్య కూడా ఏర్పడుతుంది. ఎదిగే బిడ్డ వల్ల కడుపు వత్తిడి కి గురయ్యి ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎక్కువగా నీరు తాగటం మంచి ఆహారం తీసుకోవాలి.
Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/1st-trimester/week-12/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/12-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి
Leave a Reply