మూడవ ట్రిమ్స్టర్ లోని రెండవ నెలలో కూడా 5 వారాలు ఉంటాయి. ఇది మీ ప్రెగ్నెన్సీ యొక్క ఎనిమిదవ నెల.
Table of Contents
ముప్పై మూడవ వారం (Week 33) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 43.7cm లు ఉంటుంది మరియు ఆకారం పైన్ఆపిల్ అంత ఉంటుంది. ఫీటస్ యొక్క బరువు 1.9 kg లు ఉంటుంది.
ఈ వారంలో మెదడు మరియు నాడీ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. బిడ్డ యొక్క శరీరంలో ని ఎముకలు గట్టిపడటం మొదలవుతుంది. కేవలం పుర్రె యొక్క ఎముకలు మృదువుగా ఉంటాయి. బిడ్డ 12 నుంచి 18 నెలల వచ్చే వరకు పుర్రె తల భాగానికి చెందిన ఎముకలు మృదువుగా ఉంటాయి.
ముప్పై నాల్గవ వారం (Week 34) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 45cm ఉంటుంది మరియు బరువు 2.1 kg లుగా ఉంటుంది. బిడ్డ పెద్దగా అవ్వటం వల్ల కడుపులో పెద్దగా స్థలం ఉండదు. ఫీటస్ కడుపులో అటూ ఇటూ కదులుతూ ఉంటుంది, మీ కడుపు పై కలిగే మార్పులను కూడా గమనించవచ్చు.
ముప్పై అయిదవ వారం (Week 35) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 46.2cm లుగా ఉంటుంది మరియు బరువు 2.4 kg లుగా ఉంటుంది. బిడ్డ యొక్క శరీరం కొంచెం లావుగా అవుతుంది, ఫలితంగా శరీర ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉంటుంది.
ముప్పై ఆరవ వారం (Week 36) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 47.4cm లు ఉంటుంది మరియు బరువు 2.6 kg గా ఉంటుంది. బిడ్డ యొక్క ఊపిరితిత్తులు ఇప్పుడు బయటి వాతావరణంలోకి వచ్చిన తరవాత శ్వాస తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. డెలివరీ తరవాత బయటికి వచ్చిన తరవాత తల్లి పాలు జీర్ణం చేసుకోగలిగే సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటుంది.
ముప్పై ఏడవ వారం (Week 37) :
ఈ వారంలో ఫీటస్ యొక్క పొడవు 48.6cm లుగా ఉంటుంది మరియు బరువు 2.9 Kg లుగా ఉంటుంది. ఈ వారంలో మీ బిడ్డ ముఖం పై పలు ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి, ఉదాహరణకి స్మైల్ చేయటం లేదా బాధపడటం. ఈ ఎక్స్ప్రెషన్స్ బిడ్డ యొక్క కంట్రోల్ లో ఉండవు.
మీ శరీరంలో కలిగే మార్పులు :
ముప్పై మూడవ వారంలో మీరు చాలా అలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. మీ కడుపు ఇప్పుడు డెలివరీ కోసం తయారు అవుతుంది.
మీ బిడ్డ యొక్క తల కింది భాగం లోకి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ యొక్క కొన్ని లక్షణాలు మాయమవుతాయి. ఈ స్థాయి లో రొమ్ముల నుంచి పసుపు రంగులో పాలు రావటం గమనిస్తారు. ఈ పాల వల్ల బిడ్డకు మంచి అంటి బాడీస్ అందుతాయి.
ముప్పై ఆరవ వారంలో డాక్టర్ మీ బ్లడ్ ప్రెషర్, కడుపు యొక్క సైజు మరియు బిడ్డ ఎటు వైపు తిరిగి ఉందొ కూడా చెక్ చేయటం జరుగుతుంది.
ముప్పై ఏడవ వారంలో మీ వజైనా నుంచి ఇంకా ఎక్కువగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది.
వాటర్ కూడా బ్రేక్ అవుతుంది,ఈ వాటర్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ వాటర్ క్లియర్ గా కూడా ఉంటుంది.
కడుపులో ఉండే బిడ్డ యొక్క స్థానం మారటం వల్ల మీకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది.
బ్లాడర్ ఎక్కువగా ప్రెస్ అయ్యి ఉండటం వల్ల ఎక్కువగా యురీన్ వస్తుంది.
Sources : https://www.nhs.uk/start4life/pregnancy/week-by-week/1st-trimester/week-12/#anchor-tabs https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/12-weeks/ https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-third-month-pregnancy https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply