ఒక నెల గడిచిన తరవాత పీరియడ్స్ మిస్ అవ్వటం లాంటి పెద్ద లక్షణం తో మీరు ప్రెగ్నెంట్ అయ్యారనే విషయం తెలిసిపోయింది.
రెండవ నెలలో ఉన్న నాలుగు వారాలలో బిడ్డలో మరియు తల్లి లో కలిగే మార్పులను చూద్దాం.
Table of Contents
ఐదవ వారం (week 5) :
ఐదవ వారంలో శరీరానికి ముఖ్యమైన అవయవాలు మరియు నాడీ వ్యవస్థ ఎదుగుతూ ఉంటాయి. న్యూరల్ ట్యూబ్ ద్వారా మెదడు,వెన్నెముక రూపం తీసుకుంటాయి.
ఇదే సమయంలో ముఖ్యమైన అవయవాలైన గుండె మరియు ఊపిరితిత్తులు కూడా క్రమంగా రూపం దాల్చుకుంటాయి.చేతులు కాళ్ళు కూడా మెల్లగా కనిపించటం మొదలవుతుంది. ఈ వారంలో ఎంబ్రియో గుమ్మడికాయ విత్తనం అంత పెద్దగా అవుతుంది.
ఆరవ వారం (week 6) :
ఈ వారంలో గుండె కొట్టుకోవటం ప్రారంభిస్తుంది, అల్ట్రా సౌండ్ లో కూడా హార్ట్ బీట్ ను వినే అవకాశాలు ఉన్నాయి. ఎంబ్రియో కు తోక ఉండటం వల్ల టాడ్పోల్ లాగ కనిపిస్తుంది.
నోరు, ముక్కు, చెవి మరియు కళ్ళు రూపం దాల్చుకుంటాయి. చేతులు మరియు కాళ్ళ నుంచి వేళ్లు బయటికి వస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఎంబ్రియో ఒక పలుచటి పారదర్శక పొరతో కప్పుకుంటుంది.
ఏడవ వారం (week 7 ) :
ఈ వారంలో ఎంబ్రియో 10 మిల్లి మీటర్ల పొడవు పెరుగుతుంది, ఒక బ్లూ బెర్రీ అంత సైజు అవుతుంది. తల మరియు మెదడు ఇతర అవయవాల కన్నా వేగంగా పెరుగుతాయి. కళ్ళు మరియు చెవులు కూడా పెరుగుతూ ఉంటాయి. చెవుల బయటి భాగం కన్నా లోపలి భాగం ముందుగా పెరుగుతుంది.
చేతులకు మరియు కాళ్లకు సంబంధించిన ఎముకలు మరియు కార్టిలేజ్ పెరుగుతుంది. చేతులు కూడా క్రమంగా ఆకారంలోకి రావటం జరుగుతుంది.
ఈ స్థాయిలో ఎముకలు గట్టిగా కాకుండా చాలా మృదువుగా ఉంటాయి. కనురెప్పలు తయారు అవుతాయి కానీ తెరుచుకోవు.
ఎనిమిదవ వారం (Week 8) :
ఈ వారం లో ఎంబ్రియో 1/2 అంగుళం పెరుగుతుంది. రెండవ నెలలో దాదాపు అన్ని ముఖ్యమైన అవయవాలు పెరగటం మొదలవుతాయి.
కాళ్ళు పెద్దగా అవ్వటం మొదలుపెడతాయి, నాడీ వ్యవస్థ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎనిమిదవ వారం వరకు మాత్రమే పిండాన్ని ఎంబ్రియో అని అంటారు. ఎనిమిది వారాల తరవాత ఫీటస్ అని పిలవటం జరుగుతుంది.
మీ శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి ?
రెండవ నెలలో మీ శరీరంలో ప్రెగ్నెన్సీ కి సంబంచిన లక్షణాలు ఎక్కువగా కనిపించటం మొదలవుతాయి.
- రొమ్ములను తాకినప్పుడు నొప్పిగా అనిపించటం
- యురీన్ ఎక్కువగా రావటం
- ఎక్కువగా అలిసిపోయినట్లు అనిపించటం
- వాంతి చేసుకోవటం లేదా వాంతి వచ్చినట్లు అనిపించటం
- మూడ్ బాగుండక పోవటం
- ఆహారం తినడానికి ఇష్టపడకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రెగ్నెన్సీ మొదలైన తరవాత గుండె ముందు కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ లో ముందు కన్నా ఎక్కువ రక్తం స్థాయి పెరుగుతుంది.
ప్రెగ్నెన్సీ లక్షణాలతో ఇబ్బంది కలిగినా అమ్మ అవ్వ బోతున్నామనే ఆనందం వీటిని ఎదుర్కోవడంలో సహాయపడుంది.
Sources : https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/8-weeks/ https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month/what-happens-second-month-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply