సాధారణంగా ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించిన తరవాత ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ పాజిటివ్ అని వచ్చిన తరవాత ప్రెగ్నెంట్ గా ఉన్నారని నిర్ధారించబడుతుంది.
జీవితంలో మొదటిసారి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలకు అమ్మ తనం అనే అనుభూతి కలుగుతుంది. తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు.
ఈ ఆర్టికల్ లో ప్రెగ్నెన్సీ యొక్క మొదటి నెలలో మీ శరీరం లో కలిగే మార్పులు అలాగే మీ కడుపులో ఉండే బిడ్డ యొక్క ఎదుగుదల గురించి తెలుసుకుందాం.
ప్రెగ్నెంట్ అయ్యిన తరవాత డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు డాక్టర్ పరీక్షలు చేసి మీకు డ్యూ డేట్ ఎప్పుడో చెబుతారు. డ్యూ డేట్ అంటే మీకు డెలివరీ ఎప్పుడు అవ్వబోతుందో అని ఒక డేట్ తెలియజేస్తారు.
Table of Contents
డ్యూ డేట్ ను ఎలా లెక్క పెట్టాలి ?
డ్యూ డేట్ ను లెక్కపెట్టడానికి పలు రకాలు ఉన్నాయి కానీ ఒక సింపుల్ మెథడ్ తో మీరు డ్యూ డేట్ ను అంచనా వేయవచ్చు.
స్టెప్ 1 : డ్యూ డేట్ అంచనా వేయటానికి ముందుగా గత నెల మీకు పీరియడ్స్ ఎప్పుడు మొదలైన డేట్ తెలిసి ఉండాలి.
స్టెప్ 2 : ఆ డేట్ నుంచి 3 నెలలు వెనక్కి లెక్కబెట్టాలి.
స్టెప్ 3 : చివరిగా 1 సంవత్సరం మరియు 7 రోజులు జోడించాలి.
ఉదాహరణకి ఒక అమ్మాయి మెన్స్ట్రువల్ సైకిల్ 28 రోజులు అనుకుందాం, ఈ అమ్మాయికి గత నెల పీరియడ్స్ జనవరి 1 వ తారీఖున వచ్చాయి.
జనవరి 1 నుంచి 3 నెలలు వెనక్కి లెక్కపెట్టాలి, అప్పుడు అక్టోబర్ 1 తారీకు వస్తుంది.
ఇప్పుడు అక్టోబర్ 1 వ తారీఖు కు 1 సంవత్సరం మరియు 7 రోజులు జోడించాలి. ఫలితంగా అక్టోబర్ 7 వ తారీఖు డ్యూ డేట్ అవుతుంది.
ఈ పద్దతిని నేగల్ (Naegele) రూల్ అని అంటారు.
ప్రెగ్నెన్సీ ను సాధారణంగా మూడు రకాలుగా లెక్కబెడతారు.
1) వారాల ప్రకారం : ఒక్క నెలలో 4 వారాల చొప్పున మొత్తం 36 వారాలు అవుతాయి కానీ నిజానికి ప్రెగ్నెన్సీ లో మొత్తం 40 వారాలను లెక్కబెడతారు. ఒక్క నెలలో కచ్చితంగా 4 వారాలు ఉండవు అంతకంటే కాస్త ఎక్కువగా (4.3 వారాలు) ఉంటుంది.
మీకు ప్రెగ్నెన్సీ కన్నా ముందు పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయో ఆ డేట్ నుంచి ప్రెగ్నెన్సీ ను లెక్క బెట్టడం జరుగుతుంది అందుకే మొత్తం పది నెలలు అంటే 40 వారాలు అవుతాయి.
2) నెలల ప్రకారం : వారాలను లెక్క పెట్టినట్లే నేలలను కూడా పీరియడ్స్ మొదలైన తేదీ నుంచి లెక్కబెడతారు. ఇలా ప్రెగ్నెన్సీ లో మొత్తం 10 నెలలు అవుతాయి.
3) త్రైమాసికం (Trimester) : మూడు నెలల కంటే కొంచెం ఎక్కువ వ్యవధిని కలిపితే ఒక్క ట్రిమ్స్టర్ లేదా త్రైమాసికం అవుతుంది. ఇలా మూడు ట్రిమ్స్టర్ లేదా త్రైమాసికాలను కలిపితే మొత్తం పది నెలలు అవుతుంది.
ఈ ఆర్టికల్ లో మాత్రం మనం ప్రతి వారంలో శరీరంలో కలిగే మార్పులు మరియు పిండం యొక్క ఎదుగుదలను తెలుసుకుందాం.
మొదటి వారం (Week 1) :
మొదటి వారంలో ఫర్టిలైజషన్ జరుగుతుంది, అంటే ఫాలోపియన్ ట్యూబ్ లో వీర్యం మరియు ఎగ్ కలిసి ఒక కణం లాగా ఏర్పడుతాయి. ఇలా ఏర్పడిన కణాన్ని జైగోట్ అని అంటారు.
ఫర్టిలైజ్ అయిన తరవాత జైగోట్ క్రమంగా యూట్రస్ వైపుకు కదులుతుంది, ఇదే సమయంలో జైగోట్ మరింతగా విభజింప బడుతుంది. ముందుగా ఒక జైగోట్ రెండు కణాలుగా, రెండు కణాలు 4 కణాలుగా, 4 కణాలు 8 కణాలుగా వేగంగా విభజింపబడతాయి.
రెండవ వారం (Week 2) :
ఒక వారం తరవాత వేగంగా కణాలుగా విభజింపబడుతున్న ఒక బాల్ యూట్రస్ వద్దకి వచ్చి నాటుకుంటుంది, దీనినే ఇంప్లాంటేషన్ అని అంటారు. ఈ బాల్ నే బ్లాస్టో సిస్ట్ (Blastocyst) అని అంటారు. ఈ బ్లాస్టో సిస్ట్ బయటి వైపు ఉన్న కణాలు ప్లసెంటా ను తయారు చేస్తాయి.
ఇదే సమయంలో ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఒక ముఖ్యమైన హార్మోన్ హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోఫిన్ (hCG) విడుదల అవుతుంది. ప్రెగ్నెన్సీ కిట్ కూడా ఇదే హార్మోన్ ఆధారంగానే ప్రెగ్నెంట్ అయ్యారని నిర్ధారిస్తుంది.
ప్లసెంటా ఎదిగే పిండం యొక్క లైఫ్ సపోర్ట్ గా ఉంటుంది. ప్లసెంటా ద్వారానే పిండానికి ఆక్సిజన్ మరియు ఇతర న్యూట్రియంట్లు అందుతాయి.
మూడవ వారం (Week 3):
మూడవ వారంలో hCG హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అవుతుంది. ఇకపై ఓవరీల నుంచి ఎగ్ విడుదల అవ్వకుండా ఉండటానికి ఈ హార్మోన్ సంకేతాన్ని ఇస్తుంది. ఇదే సమయంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ లు కూడా విడుదల అయ్యి పీరియడ్స్ అవ్వకుండా ఆపుతాయి, ప్లసెంటా కూడా క్రమంగా ఎదుగుతుంది.
నాల్గవ వారం (Week 4) :
బ్లాస్టో సిస్ట్ లో ఉండే కణాలు ఇప్పుడు ఎంబ్రియో గా మారుతాయి. ఎంబ్రియో నుంచే ఒక జీవితం మొదలవుతుంది. ఇదే ఎంబ్రియో తరవాత ఫీటస్ గా మారుతుంది.
ఎంబ్రియో లోపల మొదట 2 పొరలు ఏర్పడుతాయి ఆ తరవాత 3 పొరలు గా ఏర్పడుతాయి. ఈ మూడు పొరలు పిండంలో వివిధ అవయవాలుగా మారుతాయి.
మొదటి పొర శ్వాస తిసువోటానికి మరియు జీర్ణ వ్యవస్థ గా మారుతుంది. జీర్ణ వ్యవస్థ లో భాగంగా ఊపిరితిత్తులు, కడుపు, గట్, మూత్రాశయం తయారు అవుతాయి.
రెండవ పొర గుండె, రక్త నాళాలు, ఎముకలు, కండరాలుగా మారుతుంది.
ఇక మూడవ పొర మెదడు, నాడీ వ్యవస్థ, కండ్లు, పళ్ళు, చర్మం మరియు గొర్ల లాగా మారుతుంది.
ఈ వారంలో మీ బిడ్డ గసగసాల విత్తనాల (poppy seed) పరిమాణంలో ఉంటుంది.
మీ శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి ?
ప్రెగ్నెన్సీ యొక్క మొదటి నెలలో కనిపించే లక్షణాలు దాదాపు పీరియడ్స్ కి ముందు వచ్చే లక్షణాల లాగానే ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ను అంచనా వేయటం కాస్త కష్టం అవుతుంది.
ఎంబ్రియో యూట్రస్ లో ఇంప్లాంట్ అయిన తరవాత తేలికపాటి రక్తస్రావం గమనించటం జరుగుతుంది. తరవాత మీ శరీరంలో కనిపించే ఒక పెద్ద లక్షణం పీరియడ్స్ రాకుండా ఉండటం.
పీరియడ్స్ మిస్ అయిన తరవాత ప్రెగ్నన్సీ టెస్ట్ చేసినప్పుడు 99 శాతం సరైన ఫలితాన్ని చూపిస్తుంది. ప్రెగ్నన్సీ యొక్క కొన్ని లక్షణాలు అందరిలో కనిపించక పోవచ్చు.
ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తేలిన తరవాత వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన మందులను మరియు సలహాలను పాటిస్తూ ప్రెగ్నెన్సీ యొక్క రెండవ నెలలో అడుగుపెట్టాలి.
Sources :
https://www.stanfordchildrens.org/en/topic/default?id=calculating-a-due-date-85-P01209
https://www.nhs.uk/pregnancy/week-by-week/1-to-12/1-2-3-weeks/
https://www.plannedparenthood.org/learn/pregnancy/pregnancy-month-by-month
https://www.acog.org/womens-health/faqs/how-your-fetus-grows-during-pregnancy
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply