కరోనా వైరస్ మొదలు అయినప్పటి నుంచి మనము వివిధ వేరియంట్ ల గురించి వింటున్నాం. అసలు వేరియంట్ అంటే ఏమిటి ? వేరియంట్ ఎలా పుడుతుంది?
Table of Contents
వేరియంట్ అంటే ఏమిటి ?
ప్రస్తుతం ఉన్న రూపం యొక్క ఇతర వెర్షన్ లను మనము వేరియంట్ లు అని అంటాము. వైరస్ కూడా మ్యుటేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా వివిధ రూపాలుగా లేదా వెర్షన్ లు గా మారుతుంది (1).
మ్యుటేషన్ అంటే ఏమిటి ?
ప్రతీ ప్రాణం ఉన్న జీవి కణాలతో నిర్మించబడి ఉంటుంది,ప్రతీ కణం లో DNA ఉంటుంది. ప్రతీ జీవిలో కణాలు విభజింపబడుతూ ఉంటాయి. ఇవి పుడుతూ చనిపోతూ ఉంటాయి.
అయితే కణాలు విభజింపబడ్డప్పుడు కణాలలో ఉండే DNA కాపీ చేయబడుతుంది. కొన్ని సార్లు DNA కోడ్ సరిగ్గా కాపీ అవ్వక పోవటం వల్ల DNA కోడ్ లో కొన్ని మార్పులు ఏర్పడుతాయి. దీనినే మనము మ్యుటేషన్ అని అంటాము
ఈ మ్యుటేషన్ లు మంచి మరియు చెడు ప్రభావాలని చూపించవచ్చు.కొన్ని సార్లు మ్యుటేషన్ వల్ల ఎలాంటి ప్రభావం కలగక పోవచ్చు. (2).
ఉదాహరణ కి ఒక సాఫ్ట్ వేర్ మనము ఇంస్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని రోజుల తరవాత ఒక కొత్త అప్ డేట్ వస్తుంది. ఈ కొత్త అప్ డేట్ ను మనం ఒక వేరియంట్ లేదా వెర్షన్ అని పిలుస్తాం.
సాఫ్ట్ వేర్ పనిచేస్తున్నాడు, సాఫ్ట్ వేర్ కోడ్ లో వచ్చే మార్పుల వల్ల వైరస్ బారిన పడుతుంది. దీనిని మ్యుటేషన్ అని అనవచ్చు.
చదవండి : డిఎన్ఏ అంటే ఏమిటి ? అది ఎలా పనిచేస్తుంది ?
కరోనా వైరస్ ఎలా మ్యుటేట్ అవుతుంది ?
వైరస్ లు కూడా తరచుగా మ్యుటేషన్ కి గురి అవుతూ ఉంటాయి. మ్యుటేషన్ వైరస్ యొక్క రూపం మరియు హోస్ట్ పై చూపించే ప్రభావాన్ని మారుస్తుంది.
మనుషులలో DNA ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు మ్యుటేషన్ కి గురి అవ్వదు కానీ వైరస్ లలో RNA ఉంటుంది కాబట్టి చాలా సార్లు మ్యుటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది.
వైరస్ లు హోస్ట్ ల పై ఆధారపడి ఉంటాయి. మనిషి లేదా జంతువు శరీరం పై దాడి చేసి వీరిలో ఉండే కణాలలో వైరస్ తన RNA జెనెటిక్ మెటీరియల్ ను రేప్లికేట్ (కాపీ) చేస్తుంది. ఇలా వైరస్ లు తమ సంఖ్య ను పెంచుంకుంటూ పోతాయి.
రేప్లికేషన్ ప్రాసెస్ లో జరిగే చిన్న మార్పుల వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. కానీ కొన్ని సార్లు రేప్లికేషన్ అంటే కాపీ చేసే ప్రక్రియ లో పెద్దమొత్తం లో మార్పులు జరగటం వల్ల వైరస్ ఒక భయంకర మైన వేరియంట్ గా మారుతుంది.
అన్ని వైరస్ ల లాగా కరోనా వైరస్ కూడా మ్యుటేట్ చెందుతూ ఉంటుంది అందుకే మనం వివిధ రకాల వేరియంట్ లను చూస్తున్నాము (3).
కరోనా వైరస్ యొక్క వేరియంట్ రకాలు (How many Variants in Corona Virus) :
కరోనా వైరస్ యొక్క వేరియంట్ లు వచ్చే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు ముందే అంచనా వేశారు. కొన్ని కరోనా వేరియంట్ లు ముందు వేరియంట్ ల కన్నా ఎక్కువ వేగంగా వ్యాప్తిచెందుతాయి అందుకే కరోనా కేసులు పెరగటం కూడా ఆస్కారం ఉంటుంది. (4)
ప్రస్తుతం కరోనా వైరస్ వేరియంట్ లను 3 రకాలుగా విభజించారు.
1. వేరియంట్ అఫ్ ఇంటరెస్ట్ (Variant of Interest)
2. వేరియంట్ అఫ్ కన్సర్న్ (Variant of Concern)
3.వేరియంట్ అఫ్ హై కాన్సిక్వెన్స్ (Variant of High Consequence)
వేరియంట్ అఫ్ ఇంటరెస్ట్ (Variant of Interest) : వేరియంట్ అఫ్ కన్సర్న్ తో పోల్చుకుంటే వేరియంట్ అఫ్ ఇంటరెస్ట్ కొంచెం తక్కువ ప్రమాదకరం అని చెప్పవచ్చు.
పేరు | దేశం | గుర్తించిన తేది |
Eta (B.1.525) | వివిధ దేశాలు | డిసెంబర్ 2020 |
Iota (B.1.526) | అమెరికా | నవంబర్ 2020 |
Kappa (B.1.617.1) | ఇండియా | అక్టోబర్ 2020 |
Lambda (C.37) | పెరు | డిసెంబర్ 2020 |
Mu (B.1.621) | కొలంబియా | జనవరి 2021 |
వేరియంట్ అఫ్ కన్సర్న్ (Variant of Concern) : ఈ రకమైన వేరియంట్లు చాలా త్వరగా మరియు వేగంగా వ్యాపిస్తాయి. అంతే కాకుండా వీటి వల్ల వ్యాధి తీవ్రత కూడా పెరుగుతుంది.
పేరు | దేశం | గుర్తించిన తేది |
Alpha (B.1.1.7) | యునైటెడ్ కింగ్ డమ్ | సెప్టెంబర్ 2020 |
Beta (B.1.351) | సౌత్ ఆఫ్రికా | మే 2020 |
Gamma (P.1) | బ్రెజిల్ | నవంబర్ 2020 |
Delta (B.1.617.2) | ఇండియా | అక్టోబర్ 2020 |
వేరియంట్ అఫ్ హై కాన్సిక్వెన్స్ (Variant of High Consequence) : ప్రస్తుతానికి వీటికి సంభందించిన వేరియంట్ లు నమోదు కాలేదు.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply