How to get pregnant in Telugu – ప్రెగ్నెంట్ అవ్వటం ఎలా ?

How to get pregnant in Telugu - ప్రెగ్నెంట్ అవ్వటం ఎలా ?
Image by Anastasia Golovina from Pixabay

పెళ్ళైన తరవాత ఎదో ఒక రోజు అమ్మాయిలు గర్భవతులు అవుతారు. కొంతమంది వెంటనే ప్రెగ్నెంట్ అవుతారు, ఇంకొంతమంది ప్లాన్ చేసుకొని పిల్లలను కంటారు. 

కానీ అందరికి ఇంత సులువుగా పిల్లలు పుట్టరు, ఎంత కోరికతో పిల్లలు కావాలనుకున్న కొంత మంది అమ్మాయిలకు పిల్లలు పుట్టరు.కొన్ని నెలల నుంచి మొదలుపెట్టుకొని సంవత్సరాల వరకు ప్రెగ్నెంట్ అవ్వటం కోసం ఎదురుచూస్తారు.   

ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వారు ముందు ఒవ్యులేషన్ గురించి తెలుసు కోవాలి.

ఒవ్యులేషన్ అంటే ఏమిటి – What is Ovulation ?

ప్రతి నెల ఓవరీ నుంచి ఒక మెచూర్ ఎగ్ విడుదల అవుతుంది. ఓవరీ నుంచి విడుదలైన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ గుండా యూట్రస్ కి చేరుకుంటుంది.    

అయితే ఫాలోపియన్ ట్యూబ్ లో ఈ ఎగ్ దాదాపు 12 నుంచి 24 గంటలు ఉంటుంది. ఈ సమయంలో ఎగ్ వీర్యం ద్వారా ఫర్టిలైజ్ అవుతుంది. ఓవరీ నుంచి ఎగ్ విడుదల అయ్యే సమయంలో శృంగారంలో పాల్గొన్నట్లైతే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం చాలా వరకు పెరుగుతుంది.

వీర్యం కూడా వజైన లోపల సరైన పరిస్థులలో 5 రోజుల వరకు జీవించే అవకాశం ఉంది. ఎగ్ విడుదల అయ్యే సమయం లో  వీర్యం అక్కడ ఉన్నట్లయితే ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెంట్ అవుతారు.   

ఒవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో ఎలా తెలుసుకోవాలి ?

ఒవ్యులేషన్ సమయం మెన్స్ట్రువల్ సైకిల్ పై ఆధార పడి ఉంటుంది.  ప్రతి అమ్మాయి లో జరిగే మెన్స్ట్రువల్ సైకిల్ వేరు వేరు గా ఉంటుంది. కొందరికి 28  రోజులకే ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. మరి కొందరిలో 28 రోజుల కన్నా ఎక్కువగా ఉంటుంది. 

ఉదాహరణకి 28 రోజుల మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న మహిళలలో ఒవ్యులేషన్  పీరియడ్స్ అవ్వడానికి 14 (28-14=14) రోజుల ముందు అవుతుంది. అంటే ప్రెగ్నెంట్ అవ్వటానికి 12 ,13, 14 రోజులు బెస్ట్ అని అర్థం.

అందరికి 28 రోజుల మెన్స్ట్రువల్ సైకిల్ ఉండదు కాబట్టి 35 రోజుల మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న అమ్మాయి లో (35-14 = 21) 21 వ రోజు ఒవ్యులేషన్ జరుగుతుంది. అంటే 19,20,21  రోజులు ప్రెగ్నెంట్ అవ్వటానికి బెస్ట్ అని అర్థం.       

కొంతమందికి కేవలం 22 రోజుల మెన్స్ట్రువల్ సైకిల్ ఉండవచ్చు, వీరిలో (22-14 = 8) 8 వ రోజున ఒవ్యులేషన్ అవుతుంది. 6,7,8 రోజులలో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్ ప్రతీ నెల వేరు వేరుగా ఉంటె సగటుగా ఎన్ని రోజులు అవుతాయో లెక్క పెట్టుకోవాలి. 

ఉదాహరణకి మొదటి నెల 28  రోజులు, రెండవ నెల 35 రోజులు మూడవ నెల 21 రోజులు ఉన్నప్పుడు ఈ మూడు నెలల సగటు 28 అవుతుంది. 

మూడు నెలల మొత్తం : 28+35+21 = 84 

సగటు :  84/3 = 28  రోజులు అవుతుంది.  

మెన్స్ట్రువల్ సైకిల్ కి సంబంధించిన ఇంకా సమస్యలు ఉంటే డాక్టర్ తో సంప్రదించటం మంచిది. 

ఒవ్యులేషన్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి ?

ఒవ్యులేషన్ కి ముందు వజైనా లో నుంచి సాగే గుణం కల స్రావాలు రావటం గమనించవచ్చు,దీనినే సర్వికల్ మ్యూకస్ (cervical mucus) అని అంటారు.  ఒవ్యులేషన్ తరవాత  సర్వికల్ మ్యూకస్ క్రమ క్రమంగా తగ్గిపోతుంది.

శరీర ఉష్ణోగ్రత సహాయం తో కూడా ఒవ్యులేషన్ ను అంచనా వేయవచ్చు. ఓవరీ నుంచి ఎగ్ విడుదల అయ్యే సమయం కన్నా కాస్త ముందు శరీర ఉష్ణోగ్రత లో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తుంది.

ఒవ్యులేషన్ తరవాత మళ్ళీ ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. ఎగ్ విడుదల అయిన తరవాత ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్ శరీరాన్ని ప్రెగ్నన్సీ కోసం ఒక రకంగా తయారు చేస్తుంది. ప్రొజెస్టెరోన్ హార్మోన్ వల్లనే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. 

సాధారణంగా మనం జ్వరం వస్తే చెక్ చేసే ఉష్ణోగ్రతలా కాకుండా  దీని కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ థర్మామీటర్ ను ఉపయోగించాలి. దీనినే బేసల్ బాడీ టెంపరేచర్ అని అంటారు.   

బేసల్ బాడీ టెంపరేచర్ అంటే శరీరం రెస్ట్ లో ఉన్నప్పుడు ఉండే టెంపరేచర్. ఈ టెంపరేచర్ ను చెక్ చేయటానికి ఉదయం నిద్రలేవగానే ఏమి మాట్లాడకుండా ఏ పని చేయకుండా టెంపరేచర్ ను చెక్ చేయాలి. ఇలా చెక్ చేసిన టెంపరేచర్ ను రాసి పెట్టుకోవాలి.

శరీరంలో స్వల్పంగా ఉష్ణోగ్రత తగ్గితే ఒవ్యులేషన్ మొదలవ్వ బోతుంది అని అర్థం. 

ఒవ్యులేషన్ ముందు టెంపరేచర్ 97°F (36.1°C) నుంచి 97.5°F (36.4°C) మధ్యలో ఉంటుంది. ఒవ్యులేషన్ తరవాత 97.6°F (36.4°C) నుంచి 98.6°F (37°C) మధ్య ఉంటుంది.  

ఒకవేళ ఎగ్ ఫర్టిలైజ్ అవ్వకపోతే  ప్రొజెస్టెరోన్ హార్మోన్ మరియు బేసల్ బాడీ టెంపరేచర్ రెండూ పీరియడ్స్ కి ముందు సాధారణ స్థాయిలకు వచ్చేస్తాయి. 

ఇక మూడో పద్దతి లో ఒవ్యులేషన్ కిట్ ద్వారా ఎగ్ విడుదల అయ్యే సమయాన్ని అంచనా వేయవచ్చు. ప్రెగ్నెన్సీ కిట్ మాదిరి గానే ఒవ్యులేషన్ కిట్ దొరుకుతుంది. ఈ కిట్ లో 5 నుంచి 7 స్టిక్స్ ఉంటాయి.  

 ఈ కిట్ ను ఉపయోగించి యురీన్ లో లూటినైజింగ్ హార్మోన్ (LH) అనే హార్మోన్ ను టెస్ట్ చేయటం జరుగుతుంది. ఒవ్యులేషన్ కు ముందు శరీరంలో LH హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి, అందుకే ఈ కిట్ ద్వారా ఒవ్యులేషన్ అయ్యే సమయం తెలుసుకోవచ్చు.  

ఈ కిట్ ఎలా పనిచేస్తుంది : ఈ కిట్ లో రెండు లైన్ లు ఉంటాయి ఒకటి కంట్రోల్ లైన్ మరొకటి టెస్ట్ లైన్. యురీన్ ఉన్న కప్ లో ఈ స్టిక్ ను పెట్టినప్పుడు కంట్రోల్ లైన్ కన్నా టెస్ట్ లైన్ లైట్ గా కనిపిస్తే ఇంకా ఒవ్యులేషన్ మొదలు అవ్వలేదని అర్థం.

ఒకవేళ టెస్ట్ లైన్ కంట్రోల్ లైన్ కన్నా డార్క్ గా కనిపిస్తే మీ శరీరంలో ఒవ్యులేషన్ అవ్వబోతుందని అర్థం. ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చిన 24 నుంచి 36 గంటలలో ఆవులేషన్ అవుతుంది.  

ఈ టెస్ట్ ఏ రోజులలో చేయాలి : ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రతి అమ్మాయి మెన్స్ట్రువల్ సైకిల్ వేరు వేరుగా ఉంటుంది. మీకు పీరియడ్స్ రావటానికి ఇంకా 17 రోజులు ఉన్నప్పుడు ఈ టెస్ట్ ను చేయాలి. ఈ రోజులు మీకు తెలిసి ఉండాలంటే క్యాలెండర్ ద్వారా మీ మెన్స్ట్రువల్ సైకిల్ ను గుర్తుపెట్టుకోవాలి.  

ఉదాహరణకి మీ మెన్స్ట్రువల్ సైకిల్ 28 రోజులది అయినప్పుడు 11 వ రోజు నుంచి 3 లేదా 5 రోజుల వరకు ఈ టెస్ట్ ను చేయాలి.    

 ఇంతవరకు చెప్పిన పద్దతులతో పాటు ఒక రోజు విడిచి (alternate day) శృంగారంలో పాల్గొనటం, ఒవ్యులేషన్ అయ్యే సమయంలో శృంగారంలో పాల్గొనటం మరియు శరీర బరువును నియంత్రించుకోవాలి. మరీ ఎక్కువ బరువు ఉన్నా లేక మరీ తక్కువ బరువు ఉన్నా ఒవ్యులేషన్ లో సమస్యలు వస్తాయి.

త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వారు కొన్ని చెడు అలవాట్లను వదులుకోవాలి. ఉదాహరణకి స్మోక్ చేయకుండా ఉండటం, కెఫిన్ వినియోగం ఎక్కువగా చేయటం, మద్యం సేవించటం మరియు కఠోర మైన వ్యాయామాలు చేయటం.  

సంతానం కలగకపోవడం లో ఆడ మరియు మగ ఇద్దరిలో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానోత్పత్తి సమస్య గా మారినప్పుడు డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స ను మొదలుపెట్టాలి.

Assisted Reproductive Technologies :

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం సంతానోత్పత్తికోసం వివిధ రకాల  పద్ధతులు ఉన్నాయి. వీటినే అసిస్టెడ్ రీప్రోడక్టీవ్  టెక్నాలజీస్ (Assisted Reproductive Technologies) అని అంటారు.

వీటిలో ముఖ్యంగా ఎక్కువ దంపతులు ఉపయోగించే పద్ధతులు IVF మరియు సరోగసీ.

IVF అంటే ఏమిటి ?

కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఎగ్ ఫర్టిలైజ్ అవ్వదు, ఇంకొన్ని సమయాలలో ఫాలోపియన్ ట్యూబ్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో IVF ను ఎంచుకోవటం జరుగుతుంది.

ఈ ప్రక్రియ లో ఓవరీ నుంచి ఎగ్స్ ను తీసుకొని ల్యాబ్ లో వీర్యం తో ఫర్టిలైజ్ చేస్తారు. ల్యాబ్ లో తయారైన ఎంబ్రియో ను తిరిగి యూట్రస్ లో పెడతారు.

ఆ తరవాత ఎంబ్రియో యూట్రస్ పై ఇంప్లాంట్ (నాటుకొని)  అయ్యి ప్రెగ్నన్సీ మొదలవుతుంది. 

సరోగసీ అంటే ఏమిటి ?

బలమైన ఆరోగ్య సమస్యల కారణంగా గర్భం దాల్చటం అసంభవం అయినప్పుడు సర్రోగేట్ మహిళను ఎంచుకోవటం జరుగుతుంది.

ఈ సర్రోగేట్ మహిళ మీకు బదులుగా గర్భం దాల్చుతుంది. భర్త యొక్క వీర్యం మరియు భార్య యొక్క ఎగ్స్ ను తీసుకొని ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేస్తారు. ఫర్టిలైజ్ అయిన ఎగ్ ను సర్రోగేట్ గర్భంలో ఉంచటం జరుగుతుంది.

ఫలితంగా మీ బిడ్డ మీ గర్భంలో కాకుండా ఒక అద్దె గర్భంలో పెరుగుతుంది. తొమ్మిది నెలల తరవాత కాంట్రాక్టు ప్రకారం మీరు మీ బిడ్డను తీసుకుంటారు. 

చివరి మాట : 

ఒక అమ్మాయి కి అమ్మ తనం ఎంత ముఖ్యమో మాటలలో చెప్పలేము, అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు కడుపులో మోసి కనటం ఓక అమ్మకు చాలా తృప్తి ను ఇస్తుంది.

కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ప్రెగ్నన్సీ ఆలస్యం అవ్వొచ్చు అలా అని నిరాశ పడొద్దు. మన సమాజంలో ఉండే కొంత మందికి కొన్ని సంవత్సరాల తరవాత పిల్లలు పుట్టారు. ఇక పిల్లలు పుట్టరు అని ఆశ వదులుకున్న తరవాత పిల్లలు పుట్టారు, ఇది కచ్చితంగా ఒక వరం అని చెప్పవచ్చు.

ఎలాంటి నిరుత్సహానికి గురి అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేయండి మంచి డాక్టర్ తో సలహా తీసుకోండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది.          

Sources :

https://www.mayoclinic.org/healthy-lifestyle/getting-pregnant/in-depth/how-to-get-pregnant/art-20047611

https://www.yourfertility.org.au/everyone/timing

https://medlineplus.gov/ency/article/007062.htm

https://www.sart.org/patients/a-patients-guide-to-assisted-reproductive-technology/general-information/assisted-reproductive-technologies/

https://www.uofmhealth.org/health-library/hw202058#:~:text=Before%20ovulation%2C%20a%20woman’s%20BBT,before%20getting%20out%20of%20bed.

https://www.sciencedirect.com/topics/nursing-and-health-professions/basal-body-temperature

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.