క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఒక భయంకరమైన వ్యాధి గా మారింది. చాలా మంది కి వయసుతో సంభందం లేకుండా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. హార్ట్ ఎటాక్ కేవలం గుండెకు సంభందించిన జబ్బు కానీ క్యాన్సర్ అలా కాదు, మన శరీరంలో దాదాపు అన్ని భాగాలలో ఇది వచ్చే అవకాశము ఉంటుంది.
మనలో చాలా మంది వేరు వేరు క్యాన్సర్ రకాల గురించి విని ఉంటాం, అయితే మొత్తం క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ?
Table of Contents
What is Cancer ? క్యాన్సర్ అంటే ఏమిటి ?
క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకునే ముందు క్యాన్సర్ ఎందుకని వ్యాపిస్తుందో తప్పకుండ తెలిసి ఉండాలి. మీకు స్పష్టం గా అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఉదాహరణ తో అర్థమయ్యేలా వివరిస్తాను. మీరు నల్లుల గురించి విని ఉంటారు, వినటం ఏంటి దాదాపు అందరు వీటిని చూసే ఉంటారు.
ఎక్కడైనా ఒక చిన్న నల్లుల గుంపు ఉందంటే కొన్ని రోజులలో అవి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెరుగుతాయి. మనము చాలా కష్టపడి అన్ని నల్లులను చంపాము అని అనుకుంటాము కానీ ఎక్కడో మిగిలిన కొన్ని నల్లులు మళ్ళి వేల సంఖ్యలో చేరుతాయి.
ఇలాగే మన శరీరంలో కొన్ని కణాలు డిఎన్ఏ లో కలిగిన కొన్ని మార్పుల వళ్ళ హద్దు లేకుండా పెరుగుతాయి. సాధారణంగా ఆరోగ్యవంతమైన మనిషి లో కణాలు నీర్ణిత స్థాయిలో పుడుతూ చనిపోతూ ఉంటాయి.
ఇలా కణాలు పుడుతూ చనిపోతూ ఉన్నంత వరకు ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ అసాధారణంగా పెరిగితే శరీరం లోని ఎదో ఒక అవయవం క్యాన్సర్ బారిన పడుతుంది.
క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి కానీ సాధారణంగా ఎక్కువగా కనిపించే రకాలు కొన్ని ఉన్నాయి.
1. మూత్రాశయ క్యాన్సర్ (Bladder cancer ) :
ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువగా వయసు పై బడిన వాళ్లలో వస్తుంది. ఆడవారి కన్నా మగవాళ్లలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ ను ముందుగానే అంటే ప్రారంభ దశలోనే గుర్తుపట్టవచ్చు. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, మూత్రవిసర్జన లో ఇబ్బంది కలగటం, అలసట మరియు బలహీనంగా ఉండటం, ఎముకల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2. బ్రెస్ట్ కాన్సర్ (Breast Cancer) :
మహిళలో వచ్చే క్యాన్సర్ రకాలలో స్కిన్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ కాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయ్ కానీ ఎక్కువగా స్త్రీలలో ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో రొమ్ము లో గడ్డలు ఏర్పడటం, రొమ్ము చర్మం మసకబారటం మరియు రొమ్ము పరిమాణం లో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
3. పెద్దప్రేగు క్యాన్సర్ (Colon Cancer) :
పెద్ద ప్రేగు లో అసాధారణంగా పెరిగిన కణితిలు పెద్ద ప్రేగు క్యాన్సర్ కి దారి తీస్తాయి. 50 సంవత్సరాలు దాటిన వారి కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే చెక్ అప్ చేసుకోవటం వళ్ళ ఈ రకమైన క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో మలబద్దకం, మలం లో రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
4. గర్భాశయ క్యాన్సర్ (Uterine cancer) :
గర్భాశయ క్యాన్సర్ ఎండోమెట్రియం లో కణాలు అసాధారణంగా పెరగటం వళ్ళ వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, యోనీ డిశ్చార్జ్, మూత్ర విసర్జన లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
5. కిడ్నీ క్యాన్సర్ (Kidney Cancer) :
కిడ్నీ క్యాన్సర్ చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు అందరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా 40 సంవత్సరాలు పై బడిన వారిలో ఎక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, ఆకలి వేయకపోవడం, మూత్ర విసర్జన లో రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
6. కాలేయ క్యాన్సర్ (Liver Cancer):
లివర్ కాన్సర్ లో ముఖ్యంగా 2 రకాల క్యాన్సర్ చాలా ప్రమాదకరం, ఒకటి హెపాటోసెల్లర్ కార్సినోమా రెండు బైల్ డక్ట్ కాన్సర్. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, కడుపు నొప్పి, అలసటగా మరియు బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
7. ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) :
లంగ్స్ అంటేనే శ్వాస కి సంబంధించినది, ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువగా ధూమపానం చేయటం వళ్ళ వస్తుంది. దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి చిన్నది కాని సెల్ లంగ్ కాన్సర్, రెండవది చిన్నదైనా సెల్ లంగ్ కాన్సర్. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, ఆకలి వేయకపోవడం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
8. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic cancer):
పాంక్రీయస్ మన శరీరంలో జీర్ణ వ్యవస్థ కోసం మరియు మన శరీరంలో ని షుగర్ ని శక్తి రూపంలో మార్చడానికి దోహద పడుతుంది. పాంక్రీయస్ కాన్సర్ బారిన పడితే గుర్తించటం చాలా కష్టం. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలో వ్యాపిస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, ఆయాసం, ఆకలి వేయకపోవడం, డయాబెటిస్ కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
9. ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate cancer):
ప్రోస్టేట్ మన శరీరంలో ఒక రకంగా వీర్యం రవాణా కొరకు సహాయపడుతుంది. ఈ రకమైన క్యాన్సర్ చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది, ఈ క్యాన్సర్ వ్యాపించక ముందు గుర్తు పట్టినా వైద్యం ద్వారా మెరుగు పడటం అంత సులువు కాదు. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో తరచుగా మూత్రం రావటం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలగటం, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
10. థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid cancer):
థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్స్ గుండె స్పందన రేటును, శరీర ఉష్ణోగ్రత, రక్త పోటు ని నియంత్రిస్తుంది. ఈ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డప్పుడు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ క్రమ క్రమంగా గొంతు వాపుకు గురవుతుంది.
11. లుకేమియా (Leukemia) :
లుకేమియా రక్తానికి సంబంధించిన క్యాన్సర్, ఈ క్యాన్సర్ రక్తంలో తెల్ల రక్త కణాలు పెరగటం వళ్ళ వస్తుంది.
లుకేమియా క్యాన్సర్ చాలావరకు చిన్నపిల్లలలో ఎక్కువగా వస్తుంది.
మన శరీరంలో తెల్ల రక్తకణాలు అసాధారణంగా పెరగటం వళ్ళ ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది.
లుకేమియా కాన్సర్ వచ్చిన వాళ్లలో జ్వరం రావటం, బరువు తగ్గటం, చర్మం పై ఎర్రటి మచ్చలు రావటం, ఎముకలలో నొప్పి కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
12. మెలనోమా (Melanoma) :
మెలనోమా అనేది చర్మానికి సంబంధించిన ప్రమాదకరమైన క్యాన్సర్. ఈ కాన్సర్ మెలనోసైట్స్ అనే కణాల నుంచి మొదలు అవుతుంది. ఈ క్యాన్సర్ యూవీ రేడియేషన్ వళ్ళ వస్తుంది.
ఈ క్యాన్సర్ చర్మం పై ఎక్కడైనా రావొచ్చు. ఈ క్యాన్సర్ వచ్చిన వారిలో శరీరం పై ముందు నుంచి ఉన్న మచ్చలలో తేడా కనిపిస్తుంది. చర్మం పై అసాధారణంగా మచ్చలు పెరగటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
13. నాన్-హాడ్కిన్ లింఫోమా (Non-Hodgkin Lymphoma):
లింఫోమా శోషరస వ్యవస్థ (lymphatic system) కు సంబంధించిన క్యాన్సర్, ఈ రకమైన క్యాన్సర్ రోగనిరోధక వ్యవస్థ ను దెబ్బ తీస్తుంది. లింఫోమా క్యాన్సర్ రెండు రకాలు 1. Non-Hodgkin 2. Hodgkin.
ఈ క్యాన్సర్ వచ్చిన వారిలో జ్వరం రావటం, కడుపు నొప్పి, బరువు తగ్గటం, ఛాతి లో నొప్పి కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply