గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన 7 ప్రయోజనాలు-Green tea health benefits in Telugu..

మనకు రోజు ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది టీ తాగటం వల్ల చాలా సైడ్ఎఫెక్ట్స్ ఉన్నాయని అనుకుంటారు. అందుకే గ్రీన్ టీ తాగి ఆరోగ్యవంతంగా ఉండాలని అనుకుంటారు.

నిజంగా టీ తాగటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నేను ఇంతకు ముందే టీ గురించి రాసాను.  మీరు ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి చదవచ్చు. 

Also read : రోజు ఛాయ్ తాగడం మంచిదేనా ?

గ్రీన్ టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు వేడి నీళ్లు మరియు ఒక గ్రీన్ టీ బ్యాగ్. అంతే  మన వేడి వేడి గ్రీన్ టీ తయారు అయిపోయింది.

గ్రీన్ టీ టేస్ట్ చాలా చేదుగా ఉంటుంది కానీ ఇది తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ టీ వల్ల కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలను చూద్దాం.

1. టైప్ 2 డయాబెటిస్ (Type 2 Diabetes) :  

డయాబెటిస్ ఈ రోజుల్లో చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు అందరికి వస్తుంది. 

ఈ డయాబెటిస్ రావటానికి ముఖ్య కారణం మన శరీరం ఇన్సులిన్ ను తక్కువగా ఉత్పత్తి చేయటం. గ్రీన్ టీ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కి దోహదపడుతుంది. ఫలితంగా శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

2. బరువు తగ్గడం (Weight loss) : 

ఈ రోజుల్లో మనం తినే ఆహారం మరియు మనము చేసే ఉద్యోగాల వల్ల మన బరువు హద్దు లేకుండా 

పెరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. గ్రీన్ టీ పొట్ట వద్ద ఉన్నకొవ్వు ను తగ్గించడానికి మరియు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. 

3.   మెదడు చురుకుదనం (Sharp Brain) :  

గ్రీన్ టీ లో L-theanine అనే ఎమైనో ఆమ్లము ఉండటం వల్ల ఇది మెదడు చురుకుగా పనిచేయడానికి దోహద పడుతుంది. కాఫీ లో ఉండే కెఫిన్ మోతాదు కన్న గ్రీన్ టీ లో కెఫిన్ తక్కువగా ఉంటుంది ఫలితంగా ఇది మనము చురుకుగా ఉండి పనిచేయదని సహాయపడుతుంది.  

4. క్యాన్సర్ నివారణ (Reduce risk of Cancer):  

క్యాన్సర్ మన శరీరంలోని కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు ఏర్పడుతుంది. ఈ కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు కణితి గా కనిపిస్తాయి వీటినే రోజు వారి భాషలో క్యాన్సర్ గడ్డలు అని కూడా అంటారు.

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుతుంది. 

5.  అల్జీమర్స్ (Alzheimer’s)  :

అల్జీమర్స్ వ్యాధి మన జ్ఞాపక శక్తిని దెబ్బ తీస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా వయసు పై బడుతున్న వారిలో ఎక్కువగా వస్తుంది. గ్రీన్ టీ అల్జీమర్స్ వ్యాధి ని రాకుండా కొంతవరకు నివారిస్తుంది.

శాస్త్రవేత్తల జరిపిన పరిశోధనల ప్రకారం గ్రీన్ టీ లో ఉండే కాటెచిన్ (Catechin) అల్జీమర్స్ వ్యాధి నుంచి కాపాడుతుందని చెప్పడం జరిగింది .

6. గుండె కు సంబంధించిన వ్యాధులు (Cardiovascular disease): 

ప్రపంచంలో ఎక్కువ మరణాలు గుండెకు సంభందించిన వ్యాధుల వల్ల అవుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రకమైన వ్యాధులు ఒక రకంగా మన శరీరం లోని కొవ్వు పెరగటం వల్ల వస్తాయి. 

గ్రీన్ టీ  మన శరీరంలో ని యాంటీ ఆక్సిడెంట్స్ ను పెంచుతుంది. ఫలితంగా మన శరీరంలోని కొవ్వు నియంత్రించబడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.    

7. చర్మ సౌందర్యం (Photoaging) :   

గ్రీన్ టీ మన చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. దీనికి కారణం గ్రీన్ టీ లో ఉండే  యాంటీ ఆక్సిడెంట్స్. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం ఇది రుజువు అయ్యింది. 

Source : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6412948/#B82-nutrients-11-00474

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Leave a Reply

Your email address will not be published.