What is Surrogacy in Telugu – సరోగసి అంటే ఏమిటి ?

Image by Tumisu from Pixabay

ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయి కి ఒక వయసు వచ్చిన తరవాత తనకంటూ ఒక కుటుంబం ఉండాలి అని అనుకుంటారు. అందుకే మనుషులు పెళ్లి అనే ఒక బంధంతో తమ కుటుంబాన్ని ప్రారంభిస్తారు.  

పెళ్లి అయిన దంపతులకు మొదటిగా ఉండే ముఖ్య కోరిక సంతానం కలగటం. కొంత మంది దంపతులకు త్వరగా పిల్లలు పుడతారు మరి కొంత మంది మంది దంపతులకు పిల్లలు ఆలస్యంగా పుడతారు. 

బాధాకరమైన విషయం ఏమిటంటే కొంత మందికి ఎంతలా కోరుకున్న పిల్లలు పుట్టరు. కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలు పుట్టక పొతే అత్తా మామల నుంచి విపరీతమైన వత్తిడికి గురి అయ్యేవారు.

ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిన తరవాత పిల్లలు పుట్టని దంపతులకు కూడా పిల్లలు కలిగే  వసతి లభిస్తుంది.  

సరోగసీ పేరు వినే ఉంటారు, ఈ పద్దతి ద్వారా సంతానం కలగని దంపతులు సంతాన ప్రాప్తి చెందవచ్చు. 

What is Surrogacy? – సరోగసీ అంటే ఏమిటి ? 

కొన్నిఆరోగ్య కారణాల వల్ల దంపతులకు సంతానం కలగనప్పుడు ఒక ఆరోగ్యవంతమైన మహిళను తమకు బదులు గర్భం దాల్చడానికి ఎంచుకోవటాన్ని సరోగసీ అని అంటారు. ఈ ప్రక్రియ మహిళలు డబ్బులు తీసుకొని చేస్తారు.

 గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళను సర్రోగేట్ (surrogate) అని అంటారు. సరోగసీ ప్రక్రియను చేయాలనుకునే దంపతులను ఇంగ్లీష్ లో ఇంటెండెడ్ పేరెంట్స్ (Intended Parents – IP) అని అంటారు. కేవలం ఒక మగ వ్యక్తి సరోగసీ కావాలి అని అనుకుంటే తనని ఇంటెంటెడ్ ఫాదర్ (Intented father – IF) అని, అలాగే కేవలం ఒక మహిళ సరోగసీ కావాలి అనుకుంటే తనని ఇంటెంటెడ్ మదర్ (intented mother – IM) అని అంటారు.

సరోగసీ పద్దతిని ఎంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి  

  • పదే పదే గర్భస్రావం అవ్వటం వల్ల సంతాన లేమి సమస్య తో బాధపడే పెళ్ళైన దంపతులు
  • కొన్ని ఆరోగ్య కారణాల వల్ల  గర్భం దాల్చటం అసంభవం అయ్యినప్పుడు 
  • సర్జరీ లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల గర్భాశయం ను తొలిగించినపుడు  
  • తమ వంశంలో జన్యుపరమైన లోపాలు ఉన్న వారు 
  • స్వలింగ సంపర్కులైన మగ దంపతులు లేదా ఆడ దంపతులు తమకు సంతానం కావాలి అని అనుకున్నప్పుడు 
  • కేవలం ఒక మగ వ్యక్తి పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనాలి అని అనుకున్నప్పుడు 
  • కేవలం ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనాలి అని అనుకున్నప్పుడు సరోగసీ పద్దతిని ఎంచుకుంటారు 

సరోగసీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ట్రెడిషనల్ సరోగసీ రెండు జెస్టేషనల్ సరోగసీ.

 ట్రెడిషనల్ సరోగసీ (Traditional Surrogacy) : 

ఈ రకమైన సరోగసీ లో కేవలం భర్త యొక్క వీర్యంను గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ పద్దతిని ఇంట్రాయుటరైన్ ఇంసెమినషన్ ( intrauterine insemination – IUI) అని అంటారు. కొన్ని సందర్భాలలో భర్త వీర్యం కాకుండా డోనర్ వీర్యం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.  

సర్రోగేట్ 9 నెలలు మోసి బిడ్డను కంటుంది. ఈ ప్రక్రియ లో బాధాకరమైన విషయం ఏమిటంటే, పుట్టిన బిడ్డకు తల్లి గర్భం దాల్చిన మహిళ (సర్రోగేట్) అవుతుంది. ఒకవేళ భర్త వీర్యం కాకుండా డోనర్ వీర్యం తీసుకున్నట్లైతే జెనెటికల్ గా ఇద్దరూ కూడా తల్లి తండ్రులు అవ్వరు. 

జెస్టేషనల్ సరోగసీ (Gestational Surrogacy) :

 ఈ రకమైన సరోగసీ లో భర్త వీర్యం లేదా డోనర్ వీర్యం, భార్య ఎగ్స్ లేదా డోనర్ ఎగ్స్ తీసుకొని IVF (in vitro fertilization) అనే పద్దతి ద్వారా కృత్రిమంగా ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ను తయారు చేస్తారు. ఇలా తయారు అయిన బిడ్డను (ఎంబ్రియో) గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ కడుపులో పెంచుతారు.

ఈ ప్రక్రియలో పుట్టబోయే బిడ్డ ఇద్దరు దంపతులకు చెందుతుంది. గర్భం దాల్చిన సర్రోగేట్ జన్మనిచ్చిన తల్లి అయితే, ఎగ్స్ ఇచ్చిన భార్య లేదా డోనర్ పుట్టిన బిడ్డకు తల్లి అవుతుంది. 

సరోగసీ పెళ్లి కాని యువకుడు లేదా మహిళ కూడా చేసుకోవచ్చు. పెళ్లి ఇష్టం లేని వారు పిల్లల కోసం ఈ పద్దతిని ఉపయోగించి పిల్లలను కంటారు. 

స్వలింగ సంపర్కులు కూడా ఈ పద్దతిని ఎంచుకుంటారు. ట్రెడిషనల్ సరోగసీ ను ఉపయోగించి ఇద్దరిలో ఒకరి వీర్యాన్ని తీసుకొని intrauterine insemination పద్దతి ద్వారా తమ వీర్యాన్ని సర్రోగేట్ ఎగ్ ద్వారా ఫెర్టిలైజ్ చేయటం జరుగుతుంది.

ఈ దంపతులు సర్రోగేట్ ఎగ్స్ కాకుండా డోనర్ ఎగ్స్ తీసుకొని తమలో ఒకరి వీర్యం తో IVF పద్దతి ద్వారా ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ను సర్రోగేట్ కడుపులో పెంచటం జరుగుతుంది.  

ఈ కాలంలో షారుఖ్ ఖాన్, ఏక్తా కపూర్, కరణ్ జోహార్ లాంటి సెలెబ్రిటీలు సరోగసీ ద్వారానే తమ తమ పిల్లలను కన్నారు.

సర్రోగేట్ ను ఎలా కనిపెట్టాలి ?

మొదటి పద్దతి లో సర్రోగేట్ గా అవ్వటానికి మన ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ లో ఒకరి ని ఎంచుకోవచ్చు. సరోగసీ లో చాలా రకాల వైద్య ప్రక్రియలు మరియు చట్ట పరమైన సమస్యలు ఉండటం వల్ల ఫ్యామిలీ కి చెందిన లేదా ఫ్రెండ్స్ ఉంటె ఈ  ప్రక్రియ సులువుగా అయిపోతుంది.   

ఇక రెండవ పద్దతి ఏమిటంటే, ఈ రోజులలో సరోగసీ ఏజెన్సీలు లేదా హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళు మనకు ఒక సర్రోగేట్ ను ఎంచుకోవడానికి సహాయం చేస్తారు.   

సర్రోగేట్ ను ఎలా ఎంచుకోవాలి ?

మీరు సంతానం కోసం సరోగసీ కోసం మహిళను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి

  • సర్రోగేట్ యొక్క వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి.
  • సర్రోగేట్ ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీసం ఒక్క డెలివరీ అయిన చేసి ఉండాలి. ఇందులో మరొక విషయం ఏమిటంటే సర్రోగేట్ ఇంతకు ముందు 5 నార్మల్ డెలివెరీలు లేదా 2 ఆపరేషన్ డెలివెరీల కన్నా తక్కువగా చేసి ఉండాలి.
  • సర్రోగేట్ కు మత్తు పదార్థాలు లేదా మద్యం అలవాటు లేకుండా చూసుకోవాలి.
  • లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల కోసం టెస్టులు చేయించాలి.
  • ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఇలాగే మెంటల్ హెల్త్ గురించి కూడా టెస్ట్ లు చేయించాలి. సర్రోగేట్ 9  నెలలు తన కడుపు లో బిడ్డను మోస్తుంది కాబట్టి ఎమోషనల్ గా పుట్ట బోయే బిడ్డకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • సర్రోగేట్ మరియు దంపతుల మధ్య ఒక కాంట్రాక్టు తయారు చేసుకోవటం. ఈ కాంట్రాక్టు లో సర్రోగేట్ యొక్క నియమాలు మరియు బాధ్యతలు ఉంటాయి.  
  • 3 సార్ల కంటే ఎక్కువగా ఒక మహిళ సర్రోగేట్ గా ఉండకూడదు. 

సర్రోగేట్ కాకుండా ఇంటెండెడ్ పేరెంట్స్ కూడా కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంటుంది.

  • జన్యుపరమైన రోగాలకు సంబంచిన టెస్టులు 
  • అంటువ్యాధులకు సంబంచిన టెస్టులు 
  • విజయవంతంగా IVF ప్రక్రియను పూర్తి చేయటం
  • దంపతుల యొక్క మెడికల్ హిస్టరీ ను చెక్ చేయటం లాంటివి చేయాల్సి ఉంటుంది. 

సరోగసీ ప్రక్రియ లో ఎంత ఖర్చు అవుతుంది ?

సాధారణంగా ఒక మహిళ డెలివరీ చేసుకుంటే దాదాపుగా ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కానీ సరోగసీ పద్దతిలో మాత్రం 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ ఖర్చు మీరు ఉంటున్న రాష్ట్రం లేదా దేశం పై ఆధారపడి ఉంటుంది. 

నార్మల్ డెలివరీ కి అదనపు ఖర్చు ఉండదు కానీ ఆపరేషన్ లేదా సిసేరియన్ కి అదనంగా 1 నుంచి రెండు లక్షలు ఖర్చు అవుతుంది.   

ఈ ప్రక్రియ లో కొన్ని సార్లు కవలలు కూడా పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు పెరిగే అవకాశాలు ఉంటాయి. మా దగ్గర చాలా ఆస్తి ఉంది కానీ సంతానం లేదు అని బాధ పడేవారికి ఖర్చు పెద్ద సమస్య ఏమి కాదు.

జెస్టేషనల్ సరోగసీ కన్నా ట్రెడిషనల్ సరోగసీ లో ఖర్చు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇందులో IVF ప్రక్రియ ఉండదు కాబట్టి       

 ట్రెడిషనల్ సరోగసీ దశల వారిగా ఎలా జరుగుతుంది  

  1. హాస్పిటల్ లేదా ఫ్యామిలీ ద్వారా సర్రోగేట్ ను ఎంచుకోవటం. 
  2. దంపతులు మరియు మరియు సర్రోగేట్ ఒక లీగల్ కాంట్రాక్టు ను తయారు చేసుకోవాలి. 
  3. దంపతులలో భర్త లేదా డోనర్ వీర్యం తీసుకొని ఇంట్రాయుటరైన్ ఇంసెమినషన్ (IUI) ప్రాసెస్ ను చేయాలి.
  4. కొన్ని సార్లు సర్రోగేట్ గర్భం దాల్చినపుడు ఈ ప్రక్రియ విజయవంతం అవ్వదు అందుకే మళ్ళీ రెండవ సారి ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.
  5. పైన తెలిపిన ప్రక్రియ విజయవంతం అయ్యిన తరవాత పుట్టిన బిడ్డ కాంట్రాక్టు ప్రకారం దంపతులకు చెందుతుంది.      

 జెస్టేషనల్ సరోగసీ దశల వారిగా ఎలా జరుగుతుంది  

  1. మొదట ఒక సర్రోగేట్ ను ఎంచుకోవాలి
  2. దంపతులు మరియు మరియు సర్రోగేట్ ఒక లీగల్ కాంట్రాక్టు ను తయారు చేసుకోవాలి. 
  3. దంపతులలో భర్త యొక్క వీర్యం మరియు భార్య యొక్క ఎగ్ తీసుకొని IVF ద్వారా ఎంబ్రియో తయారుచేయటం. 
  4. IVF ద్వారా ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోను సర్రోగేట్ కడుపులో ఉంచటం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రక్రియ విజయవంతం కాక పొతే మళ్ళీ ఇంకొక IVF ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.
  5. పుట్టిన బిడ్డ జెనెటికల్ గా మరియు కాంట్రాక్టు పరంగా దంపతులకు చెందుతుంది.  

చట్టపరమైన సమస్యలు : 

భారతదేశం లో ఉన్న సరోగసీ చట్టం ప్రకారం పుట్టబోయే బిడ్డకు చెందిన పూర్తి అధికారం ఇంటెండెడ్ పేరెంట్స్ కు మాత్రమే దక్కుతుంది. వీర్యం మరియు ఎగ్ ల కోసం ఎంచుకున్న డోనర్ల యొక్క సమాచారం ను బిడ్డ నుంచి గోప్యంగా ఉంచాలి.

సరోగసీ ప్రక్రియను చేసే క్లినిక్ లు ప్రజలను ఆకట్టుకోవడానికి తప్పుడు ప్రచారాలు చేయవద్దు. సరోగసీ ప్రక్రియ లో ఆడ లేదా మగ బిడ్డను ఎంచుకునే అధికారం చట్ట బద్దంగా ఉండదు.  

సరోగసీ గురించి కొన్ని చేదు నిజాలు : 

పైన చెప్పిన విధంగా సరోగసీ కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి కానీ ఈ డబ్బును కొన్ని సందర్భాలలో  మధ్యవర్తులు తీసుకోవటం జరుగుతుంది.

ఇండియా లో సరోగసీ కోసం ఎక్కువగా పేద మహిళలలను తీసుకోవటం జరుగుతుంది. వీరి భర్తలు లేదా మధ్యవర్తులు సరోగసీ కోసం ఒప్పించటం జరుగుతుంది. తన శరీరాన్ని ఒక బిడ్డను జన్మను ఇవ్వటానికి స్వీకరించినా తగిన డబ్బును వీరు పొందరు.

సరోగసీ గురించి మతాలు ఏమి చెబుతున్నాయి ?

భారతదేశంలో ముఖ్యంగా పెద్ద మొత్తంలో ప్రజలు హిందూ, ఇస్లాం మరియు క్రైస్తవ  మతాలకు చెందిన వారు ఉన్నారు. 

ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు సరోగసీ పద్దతి ని అంగీకరించవు ఎందుకంటే ఒక స్త్రీ లో ఇతర పురుషుడి యొక్క వీర్యం కానీ లేదా ఇతర మహిళ ఎగ్ ను ప్రెవేశ పెట్టి పిల్లలను పుట్టించడాన్ని తమ మతం యొక్క పుస్తకాల ఆధారంగా ఖండిస్తారు.

హిందూ మతంలో సరోగసీ కి వ్యతిరేకంగా ఇప్పటివరకైతే ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు.    

FAQ :

సరోగసీ కి ఎంత ఖర్చు అవుతుంది ?

ఇండియా లో అయితే సరోగసీ ప్రక్రియ లో 10 నుంచి 15 లక్షల దాకా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ డబ్బు ప్రతి రాష్ట్రం లేదా దేశంలో వేరు వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంత అవుతుందని చెప్పలేము.     

ఎందుకని సరోగసీ ప్రక్రియను పెళ్లి అయిన వారు ఎంచుకుంటారు ?

కొంత మంది దంపతులకు పెళ్ళై ఎంత కాలమైనా పిల్లలు కలగరు లేదా కొన్ని ఆరోగ్య కారణాల వల్ల సంతానానికి దూరం అవుతారు. ఇలాంటి వారు సరోగసీ ప్రక్రియను ఎంచుకుంటారు.    

సరోగసీ భారతదేశంలో చట్టపరమేనా (లీగల్) ?

ప్రస్తుతం సరోగసీ కి చెందిన బిల్లు మరియు అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ (ART bill ) పై చర్చ జరుగుతుంది, ప్రభుత్వం కమర్షియల్ సరోగసీ ను పూర్తి గా రద్దు చేయాలని ఆలోచిస్తుంది.

పుట్టబోయే బిడ్డ పై ఎవరి అధికారం ఉంటుంది ?

పుట్టబోయే బిడ్డ పై పూర్తి అధికారం ఇంటెండెడ్ పేరెంట్స్ కు చెందుతుంది, సర్రోగేట్ మరియు డోనర్ కి ఎలాంటి అధికారం ఉండదు.   

సరోగసీ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది?

ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. ఒక్క సారి సర్రోగేట్ గర్భవతి అయ్యిన తరవాత దాదాపు ఒక సంవత్సరం పడుతుంది.     

మీకు ఇంకా ఏదైనా సరోగసీ గురించి ఏదైనా సందేహాలు ఉంటె దయచేసి కింద కామెంట్ చేయండి.  

Sources :

  1.  https://main.icmr.nic.in/sites/default/files/guidelines/b.pdf 
  2.  https://resolve.org/what-are-my-options/surrogacy/ 
  3. https://www.reproductivefacts.org/news-and-publications/patient-fact-sheets-and-booklets/documents/fact-sheets-and-info-booklets/gestational-carrier-surrogate/
  4. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3531011/ 
  5. https://en.wikipedia.org/wiki/Surrogacy
  6. https://www.worldwidesurrogacy.org/parents/faqs
  7. https://indianexpress.com/article/india/surrogacy-regulation-bill-art-bill-passed-by-rajya-sabha-7663054/

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

6 Comments

Leave a Reply

Your email address will not be published.