నార్మల్ డెలివరీ మరియు సిజేరియన్ డెలివరీ మధ్య తేడా ఏమిటి ? ఏది బెస్ట్ ? Normal delivery vs cesarean delivery

నార్మల్ డెలివరీ మరియు సిజేరియన్ డెలివరీ మధ్య తేడా ఏమిటి ? ఏది బెస్ట్ ? Normal delivery vs cesarean delivery
Image by Sanjasy from Pixabay

 ఒక అమ్మాయి తొమ్మిది నెలలు గర్భం దాల్చిన తరవాత ఆతృతగా డెలివరీ కోసం ఎదురుచూస్తారు. పుట్టబోయేది పాపో లేక బాబో అని ఉత్సాహం తో ఉంటారు.

సాధారణంగా డెలివరీలు రెండు రకాలు 

1) నార్మల్ డెలివరీ లేదా వజైనల్ డెలివరీ 

2) ఆపరేషన్ లేదా సిజేరియన్ డెలివరీ  

నార్మల్ డెలివరీ : 

నార్మల్ డెలివరీ లో ఒక అమ్మాయి ముందుగా గమనించేది నొప్పులు రావటం.  కొంత మందికి హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కొన్ని గంటలలోనే డెలివరీ అవుతుంది కానీ మరికొంత మందికి మాత్రం వారు ఉన్న పరిస్థితి ని బట్టి కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇలాంటి సమయంలోనే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి.

ఈ మొత్తం డెలివరీ ప్రాసెస్ ను మూడు దశలుగా విడదీయవచ్చు.

మొదటి దశ :

ఈ మొదటి దశ లో మీకు నొప్పులు రావటం కొనసాగుతుంటాయి అలాగే సర్విక్స్ (cervix) నెమ్మదిగా తెరుచుకుంటూ ఉంటుంది. సర్విక్స్ ను తెలుగులో గర్భాశయ ముఖద్వారం అని కూడా అంటారు. 

మొదటి సారి జన్మనిచ్చే తల్లికి ఈ స్టేజ్ దాదాపు 6 నుంచి 36 గంటల వరకు ఉంటుంది. మూడు స్టేజ్ లలో మొదటి స్టేజ్ పూర్తి అవ్వటానికి చాలా సమయం పడుతుంది. 

ఈ స్టేజ్ ను మళ్ళీ రెండు దశలుగా విడదీయవచ్చు 

1) Early లేబర్ 

2) Active లేబర్ 

ఎర్లీ లేబర్ (Early labor) :

ఎర్లీ లేబర్ స్టేజ్ లో కొంత మందికి తేలిక పాటి నొప్పులు పీరియడ్స్ లో వచ్చే నొప్పుల లాగా వస్తాయి. మరికొంత మందికి ఎక్కువగా నొప్పులు కలుగుతాయి. ఈ సమయంలో నొప్పులు సక్రమంగా రావు, ఒకసారి నిమిషానికి ఒకసారికి వస్తే మరోసారి 5 నిమిషాలకు ఒకసారి నొప్పులు వస్తాయి. ఇదే సమయంలో సర్విక్స్ క్రమ క్రమంగా తెరుచుకుంటుంది. 

సర్విక్స్ తెరుచుకున్న తరవాత వజైనా నుంచి పింక్ కలర్ లేదా తేలికపాటి రక్తం తో కూడిన మ్యూకస్ డిశ్చార్జ్ అవుతుంది. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఇదే మ్యూకస్ సర్వైకల్ ఓపెనింగ్ ను అడ్డుకొని ఉంటుంది. 

 మొదటి సారి ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయిలకు Early Labor కొన్ని గంటలనుంచి రోజుల వరకు కూడా ఉండవచ్చు. కానీ తరవాత అయ్యే డెలివరీలలో మాత్రం సమయం తక్కువగా పడుతుంది. 

ఈ కండీషన్ లో కలుగుతున్న నొప్పుల సమయంలో నడవటం, స్నానం చేయటం, మ్యూజిక్ వినటం లాంటివి చేయటం వల్ల  కాస్త ఉపశమనం పొందవచ్చు.  

Active లేబర్ :   

Active లేబర్ సమయంలో సర్విక్స్ 6 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు తెరుచుకుంటుంది. నొప్పులు క్రమ క్రమంగా పెరుగుతాయి మరియు రెగ్యులర్ గా రావటం ప్రారంభమవుతాయి. ఇదే సమయంలో వాటర్ బ్రోక్ అవ్వటం కూడా మీరు గమనించవచ్చు. 

ప్రెగ్నన్సీ లో మీ బిడ్డ అమ్నియోటిక్ సంచి లో ఉంటుంది. లేబర్ సమయంలో అమ్నియోటిక్ సంచి రప్చర్ అయ్యి వాటర్ బ్రోక్ అవ్వటం మొదలవుతుంది.    

ఇంతవరకు మీరు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేదంటే ఈ సమయంలో వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలి. సాధారణంగా ఈ దశ 4 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ప్రతి గంటకి 1 cm చొప్పున సర్విక్స్ తెరుచుకుంటూ ఉంటుంది.    

ఈ దశలో కొన్ని సమయాలలో మీ డాక్టర్ నడవటం, బర్తింగ్ బాల్, స్నానం చేయటం లాంటివి చేయమని చెప్పవచ్చు.    చివరిగా మీ డాక్టర్ సర్విక్స్ సరిగ్గా తెరుచుకుందో లేదో చెక్ చేసి అప్పుడే డెలివరీ కోసం తయారు చేస్తారు. సర్విక్స్ సరిగా తెరుచుకోక పొతే మీ డాక్టర్ ఇంకాస్త సమయం తీసుకొనే అవకాశాలు ఉంటాయి.

నార్మల్ డెలివరీ లో ఏదైనా ఆటంకం లాంటిది అనిపించినప్పుడు మీ డాక్టర్ సిజేరియన్ ఆపరేషన్ చేయాలనీ చెప్పటం జరుగుతుంది.  

రెండవ దశ : 

ఈ దశలో మీరు మీ బిడ్డను పుష్ చేస్తూ ఉండాలి. ముందుగా మీ బిడ్డ యొక్క తల బయటికి వస్తుంది తరవాత మెల్లగా మిగతా శరీరం కూడా బయటికి వస్తుంది. పుష్ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా పుష్ చేయమని లేదా పుష్ చేయటం ఆపమని కూడా చెప్పవచ్చు, ఇలా చేయటం వల్ల వజైనా స్ట్రెచ్ అవ్వటానికి సమయం దొరుకుతుంది. 

బిడ్డ డెలివర్ అయ్యిన తరవాత అంబిలికల్ కార్డ్ వెంటనే కట్ చేయకుండా కొన్ని నిముషాలు అలాగే ఉంచుతారు. ఇలా ఉంచటానికి గల కారణం ఏమిటంటే ప్లసెంటా నుంచి న్యూట్రియంట్ లతో కూడిన రక్తం ప్లసెంటా నుంచి బిడ్డకు చేరుతుంది. 

మూడవ దశ : 

ఈ దశ లో మీ బిడ్డ ను మీ కడుపు పై ఉంచటం జరుగుతుంది. మీ బిడ్డ యొక్క ఆనందం మీరు ఈ దశలో పొందుతారు. చివరిగా మీ మూడవ దశలో ప్లసెంటా ను డెలివర్ చేస్తారు. 

బిడ్డను జన్మనిచ్చిన తరవాత ఇంకాస్త తేలికపాటి నొప్పులు కలుగుతాయి. ఈ నొప్పులు ప్లసెంటా యొక్క డెలివరీ కి సహాయపడతాయి. చివరి సారిగా మీ డాక్టర్ జాగ్రత్తగా ఇంకొక సారి పుష్ చేయమని అడుగుతారు, ఫలితంగా ప్లసెంటా డెలివరీ చేయబడుతుంది. 

ప్లసెంటా కి సంబంచిన చిన్న భాగాలు మిగిలి ఉంటే యూట్రస్ నుంచి తీసివేయటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల బ్లీడింగ్ మరియు ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడవచ్చు. 

ప్లసెంటా డెలివరీ చేసిన తరవాత యూట్రస్ తిరిగి సాధారణ స్థితి కి తిరిగి వస్తుంది. నార్మల్ డెలివరీ లో బిడ్డను పుష్ చేస్తున్న సమయంలో వజైనా చిరిగి పోయే అవకాశం ఉంటుంది. ఒక వేళ వజైన చిరిగిపోతే డాక్టర్ వజైన చిరిగినా ప్రాంతాన్ని కుట్టడం జరుగుతుంది. 

ఆపరేషన్ లేదా సిజేరియన్ డెలివరీ :

ఈ డెలివరీ లో సర్జరీ ద్వారా బిడ్డను డెలివరీ చేయటం జరుగుతుంది. ఈ పద్ధతిలో కడుపును అడ్డంగా లేదా నిలువుగా కోసి డెలివరీ చేయటం జరుగుతుంది.

సిజేరియన్ చేయటానికి గల కారణాలు : 

మీ డాక్టర్ నార్మల్ డెలివరీ చేయటానికి వీలు కానప్పుడు ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయటం జరుగుతుంది. 

  • మీకు సరిగా నొప్పులు రాకపోవటం లేదా సర్విక్స్ సరిగా తెరుచుకొని ఉండక పోవటం
  • మీ కడుపులో ఉండే  బిడ్డ డిస్ట్రెస్ లేదా భాధ లో ఉండటం, బిడ్డ యొక్క హార్ట్ బీట్ లో మార్పు రావటం 
  • బిడ్డ యొక్క పోసిషన్ సరైన స్థానం లో ఉండకపోవటం అంతే కాకుండా ఒకటి కన్నా ఎక్కువ బిడ్డలు (కవలలు) మీ కడుపులో ఉండటం 
  • ప్లసెంటా యూట్రస్ యొక్క పై భాగం లో ఉండకుండా కింది భాగం లో ఆంటే సర్విక్స్ ను కవర్ చేసి ఉండటం 
  • మీ శరీరంలో గుండె కు లేదా మెదడు కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండటం 
  • డెలివరీ సమయంలో బిడ్డ కన్నా ముందు అంబిలికల్ కార్డ్ సర్విక్స్ నుంచి బయట రావటం 
  • ఇంతకు ముందు డెలివరీ లో ఆపరేషన్ లేదా సిజేరియన్ అయ్యి ఉండటం 

కొంత మందిలో మొదటి సారి ఆపరేషన్ అయ్యిన కూడా రెండవ ప్రెగ్నెన్సీ లో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీనినే ఇంగ్లీష్ లో Vaginal birth after cesarean (VBAC) అని అంటారు.   

 కొంత మంది అమ్మాయిలు లేబర్ పెయిన్ లేదా నొప్పి తట్టుకోలేక ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయాలనుకుని నిశ్చయించుకుంటారు. మీరు ఎక్కువ మంది పిల్లలను కనాలి అనుకుంటే  సిజేరియన్ ద్వారా డెలివరీ చెయ్యలేరు. ఎక్కువ సార్లు  సిజేరియన్ అవ్వటం వల్ల ప్లసెంటా కి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.   

 సిజేరియన్ వల్ల కలిగే కొన్ని నష్టాలు 

  •  సిజేరియన్ తరవాత ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది 
  • ఆపరేషన్ కి ముందు లేదా తరవాత ఎక్కువగా రక్త స్రావం జరుగుతుంది 
  •  సిజేరియన్  లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది

తరవాత మీకు జరిగే ప్రెగ్నెన్సీ లలో placenta previa లేదా placenta accreta లాంటి కండీషన్ ఏర్పడటం 

నార్మల్ డెలివరీ మరియు సిజేరియన్ లో ఏది బెస్ట్ ?

ఈ రెండు రకాల డెలివరీలలో కూడా కొన్ని కంప్లికేషన్స్ ఉన్నాయి. నార్మల్ డెలివరీ లో కొన్ని సార్లు వజైన చిరిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వేసిన కుట్లు నయం అవ్వటానికి కూడా సమయం పడుతుంది. నార్మల్ డెలివరీ లో బ్లాడర్ పై కంట్రోల్ ఉండదు.

అలాగే ఇంతకు ముందు చెప్పిన విధంగా ఆపరేషన్ లో కూడా ఇన్ఫెక్షన్స్, రక్త స్రావం, రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సాధారణంగా మన దేశంలో చాలా మంది మహిళలు పెద్దవాళ్లు నార్మల్ డెలివరీ నే ఎంచుకుంటారు. వారి ప్రకారం నార్మల్ డెలివరీ ఆపరేషన్ డెలివరీ కన్నా మంచిది.

ఈ రోజు మన దేశంలో బాధాకరమైన విషయం ఏమిటంటే ఆపరేషన్ ద్వారా డెలివరీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని కొన్ని హాస్పిటల్స్ నార్మల్ డెలివరీ ను చెయ్యరు. ప్రభుత్వ ఆసుపత్రిలలో మాత్రం నార్మల్ డెలివరీ చేయటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.   

మీకు నార్మల్ మరియు ఆపరేషన్ డెలివరీ మధ్య కన్ఫ్యూషన్ ఉంటే మీ డాక్టర్ తో తప్పకుండ డిస్కస్ చేయండి. మీ డాక్టర్ మీ పరిస్థితిని బట్టి మీకు మంచి సలహా ఇవ్వటం జరుగుతుంది.

References : 1) https://my.clevelandclinic.org/health/articles/9675-pregnancy-types-of-delivery 2) https://www.mayoclinic.org/healthy-lifestyle/labor-and-delivery/in-depth/stages-of-labor/art-20046545 3) https://www.mayoclinic.org/tests-procedures/c-section/about/pac-20393655 4) https://www.healthline.com/health/pregnancy/c-section-vs-natural-birth-2#risks-and-complicatio 5) https://www.acog.org/womens-health/faqs/vaginal-birth-after-cesarean-delivery

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.