ఉపవాసం అంటే దాదాపు మనందరికీ తెలిసినదే, ప్రతీ మతంలో వేరు వేరు పేర్లతో వేరు వేరు సమయాలు కేటాయించి ఉపవాసం చేస్తారు. చాలా వరకు ఉపవాసం మత పరంగా ఉండటం మనము చూసి ఉంటాం. హిందువులు ఉపవాసం అని ముస్లిమ్స్ రోజా అని ఇలా ప్రతి ఒక్క మతంలో ఉపవాసాన్ని శ్రద్ధ తో పాటించటం జరుగుతుంది.
Table of Contents
Intermittent fasting అంటే ఏమిటి ?
ఒక రోజులో కొన్ని గంటలు ఏమి తినకుండా ఉండటాన్ని ఉపవాసం లేదా ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఉపవాసం వల్ల మనకు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి.
Intermittent fasting పద్దతి:
ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ని చాలా రకాల పద్ధతులతో అమలు చేస్తారు కానీ ఫేమస్ గా ఉపయోగించే పద్దతి 16:8.
16:8 పద్ధతి అంటే, మనకు ఒక్క రోజులో 24 గంటలు ఉంటాయి కదా ఐతే ఈ 24 గంటలలో పదహారు (16) గంటలు ఏమి తినకుండా ఉండాలి ఇక మిగతా 8 గంటలలో తినడానికి సమయం కేటాయించాలి.
ఈ 16:8 పద్ధతి ని 5:2 రోజులలో పాటించాలి. మనకు ఒక వారం లో మొత్తం ఏడు రోజులు ఐతే 2 రోజులు ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చెయ్యాలి ఇక మిగతా 5 రోజులు మాములుగా ఎలా తింటామో అలాగే తినాలి.
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ను ఒక రకంగా డైట్ అని కూడా చెప్పొచ్చు. ఈ డైట్ ప్రకారంగా నీళ్ళని, అతి తక్కువ మోతాదులో కాఫీ, టీ ని తీసుకోవచ్చు. బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి అస్సలు తీసుకోకూడదు.
Intermittent fasting ఆహారం :
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ప్రోటీన్స్ తో కూడిన ఆహార పదార్థలను ఎక్కువగా తినాలి. నూనె పధార్థలు, పిండి పదార్థలు, చక్కర పదార్థలు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫాస్టింగ్ సమయం తర్వాత తీసుకునే భోజనం భారీ గా ఉండ కూడదు.
ఇంటర్మీ టెంట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా మన జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు. జంతువుల మీద చేసిన పరిశోధనల ప్రకారం తక్కువ క్యాలోరీస్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన జీవిత కాలాన్ని 30% పెంచుకోవచ్చు. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ పద్దతి బాగా పనిచేస్తుంది.
మనం లావుగా ఉన్నాం అంటే మన శరీరంలో కొవ్వు ఎక్కువ మోతాదులో ఉంది అని అర్థం, ఇలా ఎక్కువగా ఉన్న కొవ్వు ని ఫాస్టింగ్ చేసే సమయం లో మన శరీరం కొవ్వు ను మనకు కావాల్సిన శక్తి కోసం ఉపయోగిస్తుంది. ఇలా మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గి బరువు కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ మోతాదు కూడా తక్కువ స్థాయి లో ఉండేలా ఉపయోగపడుతుంది.
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ఉపయోగాలు :
1. ఫాస్టింగ్ మనము త్వరగా ముసలివాళ్ళు కాకుండా ఉంచుతుంది అంటే జీవిత కాలాన్ని పెంచుతుంది.
2. గుండె జబ్బులను తగ్గిస్తుంది.
3. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ రాకుండా నివారిస్తుంది.
4. జ్ఞాపక శక్తి ని , మానసిక స్థితి ని మెరుగు పరుస్తుంది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply