1. మన మెదడు యొక్క బరువు 1.5 కిలో గ్రామ్స్ ఉంటుంది. మొత్తం మన శరీరంలో ని బరువు లో 2% మన మెదడు బరువు ఉంటుంది. ఒక్క మెదడు 20% ఆక్సిజన్ మరియు రక్తాన్ని ఉపయోగిస్తుంది. మన మెదడు లో 60% కొవ్వే ఉంటుంది అందుకే ఇది మన శరీరం లో ని కొవ్వు ఎక్కువగా ఉండే అవయవం గా పరిగణించ బడుతుంది.
2. మన మెదడు ఆక్సిజన్ లేకుండా కేవలం 5 నుంచి 6 నిముషాలు మాత్రమే జీవిస్తుంది, ఆ తరవాత చనిపోతుంది.
3. మన శరీరం మొత్తం కాణాలతో నిండి ఉంటుంది ఐతే మెదడులో ఉండే కణాలని neurons అని అంటారు. మన మెదడు లో 100 బిలియన్ల neurons ఉంటాయి.
4. మనము ముసలివాళ్ళము అయిన తర్వాత చాల వరకు విషయాలను మరిచి పోతూ ఉంటాము ఎందుకంటే మన మెదడు పాత మెమోరీస్ ను డిలీట్ చెయ్యక పోవడం వల్ల కొత్త మెమోరీస్ ను గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది.
5. మన మెదడు లో ఉండే రక్త నాళాల యొక్క పొడువు 1,60,934 km ఉంటుంది.
6. మనలో చాలా మంది సమయం వృధా చేయొద్దు అని ఒకే సమయంలో రెండు పనులు చేస్తారు ఇలా చేయడం వాళ్ళ మన మెదడు 50% తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి ఒకే పని చేయాలి.
7. మన మెదడు 2.5 పెటా బైట్ల సమాచారాన్ని నిల్వ ఉంచగలదు. 2.5 పెటబైట్లు అంటే 2,500,000 Gb అని అర్థం. ఇది ఒక అంచనా మాత్రమే, ఈ మధ్య కాలంలో చేసిన పరిశోధనల ప్రకారం ఇంకా 10% ఎక్కువ గానే నిల్వ ఉంచగలదు.
8. మనలో చాల మంది కేవలం 10% మెదడుని ఉపయోగిస్తాం అని అనుకుంటారు కానీ అది తప్పు. మనము దాదాపు 100% మెదడు ని ఉపయోగిస్తాం ఎందుకంటే మన మెదడు లో ఏ ఒక్క భాగం పని చేయకున్నా మనకు చాలా ప్రమాదం.
9. తక్కువగా నిద్ర పోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మన జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకొనే శక్తి తగ్గిపోతుంది.
10. మానవులు అందరు కలలుకంటారు. కళ్లు లేని వాళ్ళు కూడా కలలు కంటారు, ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన మెదడు పగటి కన్నా మనము కలలు కనేటప్పుడు బ్రెయిన్ వేవ్స్ ఎక్కువ ఆక్టివ్ గా ఉంటాయి.
brother very fantastic keep it up