డ్రై రన్ (Dry Run) :
డ్రై రన్ అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ముందు ట్రయిల్ గా ప్రాక్టీస్ చేయడాన్ని డ్రై రన్ అంటారు. ఈ ట్రయిల్ ఎందుకు చేస్తారంటే నిజంగా ఆ పనిని చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు మనము ఎదుర్కోవచ్చు అని ఒక అంచనా వస్తుంది.
ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో అందరు చాలా రోజుల నుంచి వ్యాక్సిన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఇతర దేశాలలో వ్యాక్సిన్ ను ఇవ్వటం కూడా ప్రారంభించారు.
కరోనా బారిన పడిన పడ్డ దేశాలను చూసినట్లయితే ఇండియా రెండవ స్థానం లో ఉంది.
యూనియన్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ ప్రకారం వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో వ్యాక్సిన్ ప్రక్రియ ను మొదలుపడతామని తెలిపారు.
ఈ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ కోసం మన దేశంలోని నాలుగు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, అస్సాం మరియు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోవటం జరిగింది.
ఈ ప్రక్రియను సక్రమంగా ఎలా అమలు చేయాలని మరియు వాటి వళ్ళ వచ్చే సమస్యలను మరియు ఇబ్బందులను ముందే తెలుసుకొని జాగ్రత్త పడాలని ప్రభుత్వ ఆలోచన.
ఈ ప్రక్రియ లో కో- విన్ (Cowin) ఆప్ గురించి అవగాహన కూడా కలిపిస్తారు.
ఈ ప్రక్రియను విజయవంతం చేయటానికి పలు ట్రైనింగ్ సెషన్లను మరియు దాదాపు ఏడూ వేల మంది మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన అధికారులను ట్రైన్ చేయటం జరిగింది.
హైదరాబాద్ కి ఈ వ్యాక్సిన్ లను జాగ్రత్తగా తీసుకోవరవటానికి తగిన జగ్రత్తలు కూడా తీసుకోవటం జరిగింది.
వచ్చే ఆరు నుంచి ఏడూ నెలల లోపు భారతదేశాన్ని కరోనా బారి నుంచి తప్పించడానికి భారత దేశ ప్రభుత్వం కృషి చేస్తుంది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply