బ్లూ బెర్రీస్ ను సూపర్ ఫ్రూట్ అని పిలవటం జరుగుతుంది. ఈ పండ్లు మనకు పలు రకాల రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
ఒక 100 గ్రాముల బ్లూ బెర్రీస్ లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి (1).
పేరు | మొత్తం |
శక్తి (Energy) | 57kcal |
Vitamin A, IU | 54IU |
నీరు (Water) | 84.2g |
కార్బో హైడ్రేట్ (Carbohydrate) | 14.5g |
షుగర్ (Sugars) | 9.96g |
ఫ్రూక్టోజ్ (Fructose) | 4.97g |
గ్లూకోజ్ (Glucose) | 4.88g |
ఫైబర్ (Fiber) | 2.4g |
ప్రోటీన్ (Protein) | 0.74g |
కొవ్వు (fat) | 0.33g |
పొటాషియం (Potassium) | 77mg |
ఫాస్ఫరస్ (Phosphorus) | 12mg |
Vitamin C | 9.7mg |
కాల్షియం (Calcium) | 6mg |
మెగ్నీషియం (Magnesium) | 6mg |
కోలిన్ (Choline) | 6mg |
సోడియం (Sodium) | 1mg |
Vitamin E | 0.57mg |
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin) | 80µg |
కెరోటిన్ (Carotene) | 32µg |
Vitamin K | 19.3µg |
ఇప్పుడు బ్లూ బెర్రీస్ లో ఉండే 10 ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాము
Table of Contents
1.బ్లూ బెర్రీస్ లో పుష్కలంగా ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
బ్లూ బెర్రీస్ ఇతర పండ్లలో కన్నా ఎక్కువ ఆంటీ యాక్సిడెంట్ లను కలిగి ఉంటుంది అందుకే దీనిని సూపర్ ఫ్రూట్ అని కూడా అంటారు.
మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి అవ్వకుండా ఆంటీ ఆక్సిడెంట్లు కాపాడుతాయి. ఆంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా కాపాడటంలో సహాయపడుతాయి.
బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంథోసైనిన్స్ (anthocyanins) వల్లనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆంథోసైనిన్స్ సాధారణంగా పండ్లు మరియు కూరగాయలలో ఉంటుంది, ఇది నీటిలో కరిగే ఒక ఫ్లేవనాయిడ్ (2).
2. బ్లూ బెర్రీస్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది
బ్లూ బెర్రీస్ లో ఉండే పోషక విలువలైన కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, ఫాస్ఫరస్ మరియు విటమిన్ K లు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
బ్లూ బెర్రీస్ శరీరంలో బోన్ లాస్ (Bone loss) అవ్వకుండా ఉండటానికి మరియు ఎముకల మినరల్ డెన్సిటీ ను పెంచటంలో సహాయపడుతుంది (3).
ఎలుకల పై జరిగిన పరిశోధనలో కూడా బ్లూ బెర్రీ డైట్ బోన్ లాస్ నుంచి కాపాడినట్లు గమనించటం జరిగింది(4).
3. బ్లూ బెర్రీస్ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది
కొల్లాజిన్ అనే ప్రోటీన్ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఉండే విటమిన్ C కొల్లాజిన్ తయారీ కి సహాయపడుతుంది. కొల్లాజిన్ చర్మాన్ని ముడతల నుంచి కాపాడటంలో దోహదపడుతుంది.
విటమిన్ C మన శరీర చర్మాన్ని యూవీ కిరణాల హాని నుంచి మరియు పొల్యూషన్ వల్ల చర్మానికి కలిగే నష్టం నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
4. బ్లూ బెర్రీస్ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంటీ యాక్సిడెంట్ అయిన ఆంథోసైనిన్స్ గుండెపోటు నుంచి కాపాడటంలో దోహదపడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషక విలువలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది.
5. బ్లూ బెర్రీస్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో సహాయపడుతుంది
బ్లూ బెర్రీ లో ఉండే పోలీఫెనోల్స్ గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతాయి. రోజు బ్లూ బెర్రీస్ ను తినటం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో సహాయపడుతుంది.
బ్లూ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా హైపర్ టెన్షన్ నుంచి కాపాడటంలో మరియు గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
6. బ్లూ బెర్రీస్ మెదడు యొక్క ఆరోగ్యానికి దోహదపడుతుంది
బ్లూ బెర్రీస్ లో ఉండే పోలీఫెనోల్స్ వయసుతో పాటు వచ్చే జ్ఞాపక శక్తి కి సంబంధించిన సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇంతే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచటంలో కూడా సహాయపడుతుంది.
7. బ్లూ బెర్రీస్ డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
ఆక్సిడేటివ్ స్ట్రెస్ వివిధ రకాలైన సమస్యలకు కారణమవుతుంది, వాటిలో ఒకటి డయాబెటిస్. బ్లూ బెర్రీ ని మన డైట్ లో చేర్చుకుంటే టైపు 1 డయాబెటిస్ నుంచి కాపాడటంలో దోహదపడుతుంది.
జంతువుల మీద జరిపిన ఒక పరిశోధనలో బ్లూ బెర్రీస్ ఇన్సులిన్ యొక్క మెరుగుదలకు దోహదపడింది. వీటిలో ఉండే ఆంథోసైనిన్స్ టైప్ 2 డయాబెటిస్ నుంచి భాదపడుతున్న వారిలో తిన్న తరవాత శరీరంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
8. బ్లూ బెర్రీస్ క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
బ్లూ బెర్రీస్ లో ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా శరీరంలోని కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా కాపాడుతుంది. క్యాన్సర్ తిరిగి రెండవ సారి రాకుండా ఉండటానికి కూడా దోహదపడుతుంది.
బ్లూ బెర్రీస్ క్యాన్సర్ కు సంబంధించిన కణాల ఎదుగుదలను ఘననీయంగా తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Sources : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6164568/ https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7442370/
Leave a Reply