బరువు తగ్గడానికి రన్నింగ్ చేయాలా లేదా వాకింగ్ చేయాలా ? Running vs walking in telugu

Image Credit : Pixabay

ఈ కాలంలో నగరాలలో ఉండే చాలా మంది రక రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత మంది software ఉద్యోగాలు మరి కొంత మంది కాల్ సెంటర్స్ లో ఇలా రక రకాల ఉద్యోగాలు, ఐతే ఈ ఉద్యోగాలు అన్ని ఒక దగ్గర కూర్చొని చేయాలి. మహా ఐతే మూడు నుంచి నాలుగు సార్లు మనము లేచి అటు ఇటు తిరుగుతాము. ఫలితంగా ఒకేసారి చాల బరువు పెరుగుతాము, కొంత మంది ఐతే తినే తిండి మీద అదుపు లేకుండా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

బరువు తగ్గడానికి చాల రకాల వ్యాయామాలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా సులువుగా చేయగలిగేది ఏంటంటే రన్నింగ్ లేదా వాకింగ్. ఐతే చాలా మంది ఏది చెయ్యాలో త్వరగా నిర్ణయం తీసుకో లేక పోతారు.

వాకింగ్ మరియు రన్నింగ్ రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. రెండు కూడా మన ఎముకలను, గుండె ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐతే కొంత మంది బరువు తగ్గటానికి రన్నింగ్ లేదా వాకింగ్ చేయాలి అనుకుంటారు. మరి కొంతమంది ఆరోగ్యంగా ఉండటానికి చేయాలి అనుకుంటారు.రెండింటి లో ఏది చెయ్యాలో మనము నిర్ణయించాల్సి ఉంటుంది. బరువు తగ్గాలా లేక ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే చేయాలా అని .

ఒక 72 కేజీ ల మనిషి ౩౦ నిముషాలు 5.5 కిలోమీటర్స్ బ్రిస్క్ వాక్ చేస్తే 156 కెలొరీస్ ఖర్చవుతాయి. ఒకవేళ ఇదే మనిషి 9 .5 కిలోమీటర్స్ ౩౦ నిముషాలు పరుగెత్తితే 356 కెలొరీస్ ఖర్చు చేస్తాడు. వాకింగ్ రన్నింగ్ రెండు కూడా మనకు మంచివే, ఒకవేళ బరువు తగ్గాలి అనుకుంటే పరుగెత్తాలి. ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే చేయాలి అనుకుంటే వాకింగ్ బెస్ట్.

ఒకవేళ మీరు మీ శరీరాన్ని క్రీడాకారుడి లాగా అందంగా తయారు చేయాలి అనుకుంటే రన్నింగ్ వల్ల మన శరీరం షేప్ లో ఉంటుంది. రన్నింగ్ చేసేవారికి చిన్న టిప్ ఏంటంటే రన్నింగ్ చేయటం వల్ల త్వరగా అలిసి పోతాము అందుకే షార్ట్ రన్స్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మన కాళ్ళకి గాయాలు తగలవు. కానీ రన్నింగ్ చేయడం అంత సులువు కాదు దానికి ముందుగా జాగింగ్ కానీ వాకింగ్ అలవాటు ఉండాలి.

ఇక ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకుంటున్నారో వాళ్ళు రన్నింగ్ మరియు జాగింగ్ రెండు చేయవచ్చు, రన్నింగ్ ఐతే కాసేపటికి అలిసిపోతారు. అదే వాకింగ్ కానీ జాగింగ్ కాని చేస్తే ఒకే స్పీడ్ తో చాల సేపు చేయవచ్చు.

వాకింగ్ చేసే వారిని, రన్నింగ్ చేసే వారిని, ఏది చేయని వారిని 2013 లో చేసిన పరిశోధనలతో పోల్చినప్పుడు ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి. రన్నింగ్ చేసేవారిలో ఖాళీగా ఉండేవారి కన్న 4 .5 % గుండెజబ్బులు తక్కువగా వస్తాయి. అలాగే రన్నింగ్ చేసేవారు ఖర్చు చేసిన కెలొరీస్ వాకింగ్ చేసేవారు ఖర్చు చేస్తే వాకింగ్ చేసేవారిలో ఖాళీగా ఉండేవారికన్నా 9 % గుండె జబ్బులు తక్కువగా వస్తాయి.

ఇప్పుడు కూడా మీకు ఏది చెయ్యాలో అర్థము కాకపోతే 1 నిమిషము ఫుల్ గా రన్నింగ్ చెయ్యాలి తర్వాత 2 నిముషాలు వాకింగ్ చెయ్యాలి. ఇలా చేయడాన్ని High-intensity interval training (HIIT) అంటారు. ఇలా చేయటం వల్ల మీకు రన్నింగ్ మరియు వాకింగ్ ఉపయోగాలు రెండు లభిస్తాయి.

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.